కోదాడ (కోదాడ మండలం)

వికీపీడియా నుండి
(కోదాడ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కోదాడ, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, కోదాడ మండలానికి గ్రామం[1] ఇది జనగణన పట్టణం.కోదాడ హైదరాబాదు - విజయవాడ జాతీయ రహదారి మీద, హైదరాబాదు నుండి 176 కి.మీ. దూరం లోను, విజయవాడ నుండి 96 కి.మీ. దూరం లోను ఉంది. తూర్పున కృష్ణా జిల్లా, ఉత్తరాన ఖమ్మం జిల్లా హద్దులుగా కలిగి వున్న ముఖ్య వ్యాపార కేంద్రం. అంతేకాక, ముఖ్య విద్యాకేంద్రంగా కూడా భాసిల్లుతుంది. 2011లో కోదాడ పురపాలకసంఘంగా ఏర్పాటు చేయబడింది.[2]

విద్యా సౌకర్యాలు[మార్చు]

కె.ఆర్.ఆర్. కళాశాల, కోదాడ సన్ ఇంజనీరింగ్ కళాశాల, కోదాడమిట్స్ ఇంజనీరింగ్ కళాశాల,కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల,కోదాడ గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల మండలంలో ఉన్నాయి.

శాసనసభ్యుడు[మార్చు]

బోల్లం మల్లయ్య యాదవ్ :2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున ఎన్నికైనాడు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

  1. నెలకురి సిక్కిరెడ్డి: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Basic Information of Municipality, Kodada Municipality". kodadamunicipality.telangana.gov.in. Retrieved 7 April 2021.

ఇవి కూడా చూడండి.[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]