హుజూర్‌నగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హుజూర్‌నగర్
—  మండలం  —
సూర్యాపేట జిల్లా పటములో హుజూర్‌నగర్ మండలం యొక్క స్థానము
సూర్యాపేట జిల్లా పటములో హుజూర్‌నగర్ మండలం యొక్క స్థానము
హుజూర్‌నగర్ is located in Telangana
హుజూర్‌నగర్
హుజూర్‌నగర్
తెలంగాణ పటములో హుజూర్‌నగర్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°53′44″N 79°52′21″E / 16.895558°N 79.872623°E / 16.895558; 79.872623
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట
మండల కేంద్రము హుజూర్‌నగర్
గ్రామాలు 7
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 60,426
 - పురుషులు 30,177
 - స్త్రీలు 30,249
అక్షరాస్యత (2011)
 - మొత్తం 61.90%
 - పురుషులు 72.91%
 - స్త్రీలు 50.50%
పిన్ కోడ్ 508204

హుజూర్‌నగర్, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508204. హుజూర్ నగర్‌కు పూర్వము పోచంచర్ల అనే పేరు ఉండేది. హుజూర్ అనే నవాబు దీన్ని పాలించడంవల్ల హూజూర్ నగర్ అని పేరు వచ్చింది. 1977 వరకు హుజూర్ నగర్ శాసనసభా నియోజకవర్గముగా ఉండేది. అయితే 1977 నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణలో ఈ నియోజకవర్గాన్ని రద్దుచేశారు. కానీ తిరిగి 2007లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఈ నియోజకవర్గాన్ని 2009లో శాసనసభా ఎన్నికలకు పునరుద్ధరించారు.

హుజూర్ నగర్లో రామాలయము, ముత్యాలమ్మ గుడి, దుర్గ గుడి, షిర్డీ సాయిబాబా గుడి ఉన్నాయి. పట్టణములో ప్రతి సంవత్సరమూ నిర్వహించే ముత్యాలమ్మ జాతర ప్రసిద్ధి చెందినది. హుజూర్ నగర్ సీతారామచంద్రస్వామి ఆలయము 900 సంవత్సరాల పురాతనమైనది. జీర్ణావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని ఇటీవలే కొందరు స్థానిక దాతల సహాయముతో పునరుద్ధరించారు.

హుజూర్ నగర్ పట్టణములో అనేక బియ్యపు మిల్లులున్నవి. పట్టణము చుట్టూ ప్రియా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్, నాగార్జునా సిమెంట్స్, అంజనీ సిమెంట్స్, మహా సిమెంట్స్, సువర్ణా సిమెంట్స్ మరియు కామాక్షీ సిమెంట్స్ అనేక చిన్నా పెద్ద సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. పట్టణములో రెండు జాతీయ బ్యాంకులు : ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు మరియు ఒక సహకార కేంద్రీయ బ్యాంకు మరియు గ్రామీణ బ్యాంకు ఉన్నాయి.

హూజూర్ నగరులో రెండు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నాయి. ఇవికాక రెండు ప్రైవేట్ కళాశాలలు (ప్రియదర్శిని కళాశాల మరియు చైతన్య కళాశాల) ఉన్నాయి.

హుజూర్ నగరుకు రైలు సౌకర్యము లేదు. సమీప రైల్వే స్టేషను 33 కిలోమీటర్ల దూరములో మిర్యాలగూడలో ఉంది. హుజూర్ నగరుకు బస్సులో చేరుకొనవచ్చు.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 60,426 - పురుషులు 30,177 - స్త్రీలు 30,249

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

గ్రామంలో ప్రముఖులు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. మాచవరం (హుజూర్‌నగర్)
 2. కరక్కాయల గూడెం
 3. బూరుగడ్డ
 4. లింగగిరి
 5. అమరవరం
 6. లక్కవరం
 7. హుజూర్‌నగర్
 8. ఏపలసింగారం
 9. మాధవరాయునిగూడెం
 10. గోపాలపురం
 11. గోవిందపురం