నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2015

నల్గొండ లోక్ సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
నియోజకవర్గం నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1962-06-20) 1962 జూన్ 20 (వయసు 60)[1]
సూర్యాపేట్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
(ప్రస్తుతం తెలంగాణ)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి నలమాద పద్మావతిరెడ్డి
నివాసం బంజారాహిల్స్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ
వెబ్‌సైటు

నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (జ. 1962 జూన్ 20) తెలంగాణ శాసనసభ్యుడు. అతను తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ శాసనసభకు 2014లో ఎన్నికైనాడు. అతను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గృహ, బలహీన వర్గాల మంత్రిత్వ శాఖలో పనిచేసాడు.[2] అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను తెలంగాణ రాష్ట్రానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా 2015-2021 వరకు పనిచేశాడు

ప్రారంభ జీవితం[మార్చు]

అతను సూర్యాపేటలో 1962, జూన్ 20న జన్మించాడు. అతని తల్లిదండ్రులు పురుషోత్తం రెడ్డి, ఉషారాణి. అతని స్వగ్రామం సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుమలగిరి మండలంలోని తాటిపాముల. అతను బియస్సీ చేసాడు. అతను భారత వైమానిక దళంలో పైలట్ గా కూడా తన సేవలనందించాడు. అతను ఎం.ఐ.జి 21, ఎం.ఐ.జి 23 విమానాలను నడిపాడు. అతను రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి విదేశీ ప్రయాణాలలో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలరుగా తన సేవలనందించాడు. [3]

రాజకీయ జీవితం[మార్చు]

ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారిగా 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీ కి ఎన్నికయ్యాడు. 2004 శాసనసభ ఎన్నికలలో కోదాడ నుండి రెండవసారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాడు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడ్డ హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి 2009 లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి పై 25,682 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. [4] అతను తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షునిగా 2015 నుండి పనిచేస్తున్నాడు.[5][6]

మంత్రి[మార్చు]

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ, బలహీన వర్గాలకు కేబినెట్ మంత్రిగా పనిచేసాడు.<ref>"Members of Legislative Assembly". APOnline.

References[మార్చు]

  1. "Profile of N Uttam Kumar Reddy - Huzurnagar". helloap. 2011-01-13.
  2. [://web.archive.org/web/20131008000758/ |date=2013-10-08 }}. APOnline.
  3. "Huzurnaar MLA" Archived 2013-10-09 at the Wayback Machine. Andhra Pradesh MLA's Portal.
  4. "Housing Minister" Archived 2014-05-02 at the Wayback Machine. Andhra Pradesh MLAs Portal.
  5. http://indtoday.com/uttam-exhorts-party-cadre-to-re-capture-hyderabad-in-next-elections/
  6. సాక్షి, పాలిటిక్స్ (24 May 2019). "టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ గెలుపు". Sakshi. Archived from the original on 24 May 2019. Retrieved 25 October 2019.