Jump to content

తిరుమలగిరి మండలం (సూర్యాపేట జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 17°30′14″N 79°25′46″E / 17.503938°N 79.42955°E / 17.503938; 79.42955
వికీపీడియా నుండి
తిరుమలగిరి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°30′14″N 79°25′46″E / 17.503938°N 79.42955°E / 17.503938; 79.42955
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట జిల్లా
మండల కేంద్రం తిరుమలగిరి (సూర్యాపేట జిల్లా)
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,657
 - పురుషులు 24,106
 - స్త్రీలు 23,551
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.80%
 - పురుషులు 63.41%
 - స్త్రీలు 37.69%
పిన్‌కోడ్ 508223

తిరుమలగిరి మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా లోని మండలం.[1] తిరుమలగిరి, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 45 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా- మొత్తం 47,657 - పురుషులు 24,106 - స్త్రీలు 23,551 అక్షరాస్యత (2011) - మొత్తం 50.80% - పురుషులు 63.41% - స్త్రీలు 37.69%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 133 చ.కి.మీ. కాగా, జనాభా 38,808. జనాభాలో పురుషులు 19,682 కాగా, స్త్రీల సంఖ్య 19,126. మండలంలో 9,645 గృహాలున్నాయి.[3]

నల్గొండ జిల్లా నుండి మార్పు

[మార్చు]

లోగడ తిరుమలగిరి మండలం,నల్గొండ జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా తిరిమలగిరి మండలాన్ని (1+12) 13 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. తాటిపాముల
  2. నందాపురం
  3. తిరుమలగిరి
  4. తొండా
  5. వెల్చలా
  6. మామిడియాల
  7. బండ్లపల్లి
  8. మాలిపురం
  9. అనంతారం
  10. గుండెపూరి
  11. సిద్దసముద్రం
  12. జలాల్ పురం

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-24.

వెలుపలి లంకెలు

[మార్చు]