Jump to content

గరిడేపల్లి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°53′34″N 79°44′15″E / 16.892684°N 79.737611°E / 16.892684; 79.737611
వికీపీడియా నుండి
గరిడేపల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°53′34″N 79°44′15″E / 16.892684°N 79.737611°E / 16.892684; 79.737611
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట జిల్లా
మండల కేంద్రం గరిడేపల్లి
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 194 km² (74.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 56,179
 - పురుషులు 28,135
 - స్త్రీలు 28,044
పిన్‌కోడ్ 508201

గరిడేపల్లి మండలం. తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో ఉన్న మండలం.[1] గరిడేపల్లి, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట జిల్లా లో ఉంది. కొత్తగా ఏర్పాటు చేసిన హుజుర్ నగర్ రెవిన్యూ డివిజన్ లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మిర్యాలగూడ డివిజనులో ఉండేది.ఈ మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామలతో కలిపి మొత్తం 32 గ్రామపంచాయతీ లు ఉన్నాయి..నిర్జన గ్రామాలు లేవు

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 56,179 - పురుషులు 28,135 - స్త్రీలు 28,044. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 194 చ.కి.మీ. కాగా, జనాభా 56,179. జనాభాలో పురుషులు 28,135 కాగా, స్త్రీల సంఖ్య 28,044. మండలంలో 15,463 గృహాలున్నాయి.[3]

నల్గొండ నుండి సూర్యాపేట జిల్లాకు మార్పు

[మార్చు]

లోగడ గరిడేపల్లి మండలం,నల్గొండ జిల్లా, మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గరిడేపల్లి మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. గరిడేపల్లి
  2. పొనుగోడు
  3. గడ్డిపల్లె
  4. కుతుబ్‌షాపురం
  5. వెలిదండ
  6. రాయినిగూడెం
  7. తాళ్లమల్కాపురం
  8. సర్వారం
  9. కలువపల్లి
  10. గానుగబండ
  11. కల్మలచెరువు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  • రేగులగడ్డ తండా

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-20.

వెలుపలి లంకెలు

[మార్చు]