చివ్వేంల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చివ్వేంల మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 17°06′00″N 79°41′36″E / 17.100105°N 79.693222°E / 17.100105; 79.693222
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట జిల్లా
మండల కేంద్రం చివ్వేంల
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,835
 - పురుషులు 23,948
 - స్త్రీలు 23,887
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.92%
 - పురుషులు 61.88%
 - స్త్రీలు 37.40%
పిన్‌కోడ్ 508213

చివ్వేంల మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు, చెందిన మండలం.[1] చివ్వెంల, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 6 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 47,835 - పురుషులు 23,948 - స్త్రీలు 23,887. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 151 చ.కి.మీ. కాగా, జనాభా 47,835. జనాభాలో పురుషులు 23,948 కాగా, స్త్రీల సంఖ్య 23,887. మండలంలో 12,010 గృహాలున్నాయి.[3]

నల్గొండ జిల్లా నుండి మార్పు[మార్చు]

లోగడ చివ్వేంల మండలం,నల్గొండ జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చివ్వేంల మండలాన్ని (1+14) 15 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

  1. ఐలాపూర్
  2. కుదకుద
  3. బీబిగూడెం
  4. గయంవారిగూడ
  5. వత్తిఖమ్మంపహాడ్
  6. చెందుపట్ల
  7. తిమ్మాపురం
  8. చివ్వేంల
  9. దురజ్‌పల్లి
  10. ఉండ్రుగొండ
  11. తుల్జారావుపేట్
  12. వల్లభాపూర్
  13. గుంపుల
  14. తిరుమలగిరి
  15. గుంజలూరు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-24.

గణాంక వివరాలు[మార్చు]