చింతలపాలెం మండలం
| చింతలపాలెం మండలం | |
| — మండలం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°35′29″N 79°23′08″E / 16.591398°N 79.385608°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | సూర్యాపేట జిల్లా |
| మండల కేంద్రం | చింతలపాలెం (సూర్యాపేట జిల్లా) |
| గ్రామాలు | 10 |
| ప్రభుత్వం | |
| - మండలాధ్యక్షుడు | |
| వైశాల్యము | |
| - మొత్తం | 201 km² (77.6 sq mi) |
| జనాభా (2011) | |
| - మొత్తం | 36,542 |
| - పురుషులు | 18,269 |
| - స్త్రీలు | 18,273 |
| పిన్‌కోడ్ | 508202 |
చింతలపాలెం మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1] చింతలపాలెం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం కోదాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సూర్యాపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
మండల జనాభా
[మార్చు]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 201 చ.కి.మీ. కాగా, జనాభా 36,542. జనాభాలో పురుషులు 18,269 కాగా, స్త్రీల సంఖ్య 18,273. మండలంలో 9,969 గృహాలున్నాయి.[4]
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు
[మార్చు]లోగడ చింతలపాలెం గ్రామం నల్గొండ జిల్లా సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలోని మేళ్లచెరువు మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చింతలపాలం గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన - సూర్యాపేట జిల్లా, కోదాడ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+09 (పది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అడ్లూరు
- గుడిమల్కాపూరం
- చింతలపాలెం
- చింత్రియాల
- తమ్మారం
- దొండపాడు
- నెమలిపురి
- రేబల్లె
- వజినేపల్లి
- శోబానాద్రి గూడెం
శివారు లేదా రెవెన్యూయేతర ప్రాంతాలు
[మార్చు]- పీక్లానాయక్ తండా
- గాంధీ నగర్ తండా
- నక్క గూడెం
- క్రిష్టపురం
- కొత్త గూడెం
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2021-12-27 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-06.
- ↑ "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2021-12-27 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. the original నుండి 2022-07-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-07-17.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). the original (PDF) నుండి 2019-12-09 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-01-24.
