మద్దిరాల మండలం (సూర్యాపేట జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మద్దిరాల మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ మద్దిరాల  గ్రామం నల్గొండ జిల్లా సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలోని నూతనకల్లు మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మద్దిరాల గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+12 (పదమూడు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

  1. గంజివారికొత్తపల్లి
  2. ముకుందపురం
  3. మద్దిరాల
  4. చందుపట్ల
  5. పోలుమల్ల
  6. గోరెంట్ల
  7. మామిండ్లమాధవ
  8. చిన్ననెమిల
  9. గుమ్మడవల్లి
  10. రామచంద్రాపురం
  11. కుక్కడం
  12. రెడ్డిగూడ
  13. కుంటపల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-24.

వెలుపలి లంకెలు[మార్చు]