సూర్యాపేట రెవెన్యూ డివిజను
సూర్యాపేట రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. సూర్యాపేట జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో గతంలో 14 మండలాలు ఉండేవి.[1] సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పడిన హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజనులో పాలకీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాలు విలీనమయ్యాయి. ఈ డివిజను ప్రధాన కార్యాలయం సూర్యాపేట పట్టణంలో ఉంది.[2][3] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[4] ఇది నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలోని సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.
పరిపాలన
[మార్చు]సూర్యాపేట డివిజన్‌లోని మండలాలు:[5]
| క్ర.సం | సూర్యాపేట రెవెన్యూ డివిజను | రెవెన్యూ గ్రామాల సంఖ్య |
|---|---|---|
| 1 | సూర్యాపేట మండలం | 20 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు) |
| 2 | చివ్వెంల మండలం | 15 రెవెన్యూ గ్రామాలు |
| 3 | మోతే మండలం | 17 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
| 4 | జాజిరెడ్డిగూడెం మండలం | 12 రెవెన్యూ గ్రామాలు |
| 5 | నూతనకల్ మండలం | 14 రెవెన్యూ గ్రామాలు |
| 6 | పెన్‌పహాడ్ మండలం | 17 రెవెన్యూ గ్రామాలు |
| 7 | ఆత్మకూరు (ఎస్) మండలం | 20 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
| 8 | తిరుమలగిరి మండలం | 12 రెవెన్యూ గ్రామాలు |
| 9 | తుంగతుర్తి మండలం | 12 రెవెన్యూ గ్రామాలు |
| 10 | నాగారం మండలం | 10 రెవెన్యూ గ్రామాలు |
| 11 | మద్దిరాల మండలం | 13 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Nalgonda district info". Official website of Nalgonda district. Archived from the original on 15 February 2016. Retrieved 15 February 2016.
- ↑ "Division wise mandals list" (PDF). Official website of Nalgonda district. National Informatics Centre. pp. 11–12. Archived from the original (PDF) on 8 అక్టోబరు 2016. Retrieved 15 February 2016.
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-08-24.
- ↑ "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.