కోదాడ రెవెన్యూ డివిజను
కోదాడ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. సూర్యాపేట జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో గతంలో 9 మండలాలు ఉండేవి. దీని నుండి 4 మండలాలు కొత్తగా ఏర్పడిన హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజనులో విలీనం చేసారు.అవి పోను ప్రస్తుతం ఈ డివిజనులో 5 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం కోదాడ పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలోని, కోదాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.
పరిపాలన
[మార్చు]కోదాడ డివిజన్‌లోని మండలాలు:[4]
| క్ర.సం | కోదాడ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
|---|---|---|
| 1 | చిలుకూరు మండలం | 4 రెవెన్యూ గ్రామాలు |
| 2 | కోదాడ మండలం | 12 రెవెన్యూ గ్రామాలు |
| 3 | మునగాల మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
| 4 | నడిగూడెం మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
| 5 | అనంతగిరి మండలం | 10 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-09-02.
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-09-02.
- ↑ "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-09-02.