బొత్స సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొత్స సత్యనారాయణ
బొత్స సత్యనారాయణ

బొత్స సత్యనారాయణ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు [[]]
నియోజకవర్గము చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం

అసెంబ్లీ సభ్యులు
పదవీ కాలము
2004 - 2011
ముందు గద్దె బాబూరావు
నియోజకవర్గం చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం

పదవీ కాలము
1999 - 2004
ముందు పడాల అరుణ
తరువాత పడాల అరుణ
నియోజకవర్గం బొబ్బిలి లోక్ సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1958-07-09) 9 జూలై 1958 (వయస్సు 62)
విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి బొత్స ఝాన్సీ
సంతానము ఒక అబ్బాయి( సందీప్ ), ఒక అమ్మాయి ( అనూష )
నివాసము కోరాడ వీధి, విజయనగరం
మతం హిందువు
మూలం botsa.in లో వివరాలు (ఆర్కైవ్.ఆర్గ్)

బొత్స సత్యనారాయణ (9 జూలై 1958) ఆంధ్ర ప్రదేశ్‍కు చెందిన రాజకీయ నాయకుడు, జగన్ మంత్రివర్గంలో మంత్రి. ఇతను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్టీకి చెందిన వ్యక్తి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

సత్యనారాయణ విజయనగరంలో పుట్టాడు. వీరి తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, బొత్స గురునాయుడు. ఈయన మహారాజా కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తి చేశాడు. ఇతని వివాహం బొత్స ఝాన్సీ లక్ష్మితో జరిగింది. ఝాన్సీ లక్ష్మి బొబ్బిలి నుండి 2006లో కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నుకోబడింది. సత్యనారాయణ సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం శాసనసభా నియోజకవర్గం నుండి ఎంఎల్‍ఏ.

రాజకీయ జీవితం[మార్చు]

ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి. గతంలో ఏపీసీసీ(ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) కి అధ్యక్షులుగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి, పరిశ్రమల శాఖా మంత్రిగా వ్యవహరించారు..

వివాదాలు[మార్చు]

సత్యనారాయణ తెలంగాణ విషయంలో, ఒకసారి సానుకూలంగా మరోసారి ప్రతికూలంగా వ్యాఖ్యలు చేస్తూ అనేకమార్లు వివాదాల్లోకి వెళ్ళాడు. ముఖ్యమంత్రి పాలనకు పోటీగా తనకు మద్దతు ఇచ్చే విధేయులతో బొత్స ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నది రాజకీయవాదుల వాదన. జగన్ ను ఒకప్పుడు తీవ్రంగా విమర్శించి ఇప్పుడు ఆయన పార్టీలో చేరాడు.

తన కూతురి వివాహంలో యథేచ్ఛగా ప్రభుత్వ వనరులను వాడుకున్నారనీ, ప్రైవేట్ వాహన వాహకులతో బలవంతంగా పని చేయించుకున్నారని వివాదభరిత వ్యాఖ్యలు మీడియా ద్వారా ప్రతిపక్షాల ద్వారా వచ్చాయి.[1]

వనరులు[మార్చు]

  1. "Botsa daughter's mega wedding bash has govt staff in a tizzy". Times of India. 2012-11-02. Archived from the original on 2013-08-30.

బయటి లింకులు[మార్చు]