శానంపూడి సైది రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శానంపూడి సైదిరెడ్డి
శానంపూడి సైది రెడ్డి

పదవీ కాలం
24 అక్టోబరు 2019 - 3 డిసెంబర్ 2023
ముందు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
నియోజకవర్గం హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1974, ఏప్రిల్‌ 18
గుండ్లపల్లి, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బీఆర్ఎస్
తల్లిదండ్రులు అంకిరెడ్డి, సత్యవతి
జీవిత భాగస్వామి రజితరెడ్డి
సంతానం అంకిరెడ్డి, అనిరుధ్‌ రెడ్డి
మతం హిందూ మతం

శానంపూడి సైది రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. 2019లో హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు.[1]

జననం, విద్య

[మార్చు]

సైదిరెడ్డి 1974, ఏప్రిల్‌ 18న అంకిరెడ్డి, సత్యవతి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో జన్మించాడు.[2] సైదిరెడ్డి మఠంపల్లి లోని వీవీఎం హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదివాడు. ఇంటర్ హుజూర్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ ప్రియదర్శిని కళాశాలలో పూర్తిచేశాడు.[3] సైదిరెడ్డి తండ్రి అంకిరెడ్డి గతంలో గుండ్లపల్లి సర్పంచ్ గా పనిచేశాడు. సైదిరెడ్డి తెలుగుదేశం పార్టీలో మఠంపల్లి మండలం ప్రధాన నాయకుడిగా ఉన్నాడు. సైదిరెడ్డి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగంలో చేరాడు.[4] 2009లో తెలంగాణ ఉద్యమానికి ప్రభావితమయిన కెనడాలో తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉద్యమానికి మద్దతు అందించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సైదిరెడ్డికి కాట్రం రజితతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (అంకిరెడ్డి, అనిరుధ్ రెడ్డి) ఉన్నారు.

రాజకీయాలు

[మార్చు]

విదేశాల్లో ఉద్యోగం, వ్యాపారంలో స్థిరపడిన సైదిరెడ్డి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక స్వరాష్ట్రానికి తిరిగివచ్చి అంకిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటుచేసి వివిధ సేవ కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నాడు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) చేతిలో 7,466 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2019లో హుజూర్‌నగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,284 వేల మెజార్టీతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5][6][7]

సైదిరెడ్డి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో 44,888 ఓట్ల తేడాతో ఓడిపోయి 2024 మార్చి 10న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[8][9] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిపై 5,59,905 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[10]

ఇతర వివరాలు

[మార్చు]

కెనడా, జమైకా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలను మొదలైన దేశాలను సందర్శించాడు.

మూలాలు

[మార్చు]
  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. "Shanampudi Saidireddy". www.telanganadata.news. Retrieved 2021-09-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Telangana poll: Saidireddy Shanampudi – Man of the people and TRS' hope from Huzurnagar". www.timesnownews.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-09-25. Retrieved 2021-09-25.
  4. "Inspiring Entrepreneur – Saidireddy Shanampudi, Mayuri Indian Cuisine – The Times of Canada" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-25.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (25 October 2019). "సైరా సైదిరెడ్డి". ntnews.com. Archived from the original on 25 October 2019. Retrieved 25 October 2019.
  6. HMTV, తెలంగాణ (24 October 2019). "శానంపూడి సైదిరెడ్డి ఎవరు ?". www.hmtvlive.com. Archived from the original on 25 October 2019. Retrieved 25 October 2019.
  7. TV5 News, తాజా వార్తలు తెలంగాణ (24 October 2019). "కెనడాలో స్థిరపడిన సైదిరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో.. – TV5 News". Archived from the original on 25 October 2019. Retrieved 24 October 2019.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. ABP Telugu (10 March 2024). "బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు". Archived from the original on 10 March 2024. Retrieved 10 March 2024.
  9. Eenadu (10 March 2024). "భాజపాలో చేరిన పలువురు భారాస నేతలు". Archived from the original on 10 March 2024. Retrieved 10 March 2024.
  10. Election Commision of India (4 June 2024). "2024 Nalgonda Loksabha Election Results". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.