తడకమళ్ల వేంకట కృష్ణారావు
Appearance
తడకమళ్ల వేంకట కృష్ణారావుతొలి తెలుగు నవలాకారుడు. నరహరి గోపాలకృష్ణమచెట్టి రాసిన సోనాబాయి పరిణయము(1873),కందుకూరి వీరేశలింగం నవల రాజశేఖర చరిత్ర(1866)కు ముందే కంబుకంధర చరిత్ర(1830-60)అనే నవలను రచించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]కృష్ణారావు నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ లో జన్మించారు.కంబుకంధర చరిత్రను ఆయన వచన ప్రబంధంగా చెప్తారు. ఐతే 19వ శతాబ్ధంలో నవల ప్రబంధంగానే వ్యవహరించబడింది. కాబట్టి కథానిక లాగానే నవల రచన తెలంగాణలోనే బీజం పడిందని చరిత్రకారుల అంచనా.[1] 1866లో అతను రాసిన ‘కంబుకంధర చరిత్ర’లో తొలి తెలుగు నవలా మూలాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. [2] తెలుగు గణిత గ్రంథకర్తల్లో అతను గుర్తింపు పొందిన వాడు. ఆయన కూడా పద్యాల్లో ‘ఆంధ్ర లీలావతి’ రాశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం. ఆచార్య ఎస్వీ రామారావు
- ↑ "నవలావనంలో తొలినాళ్ల వెన్నెల". www.teluguvelugu.in. Archived from the original on 2021-01-26. Retrieved 2020-09-12.
- ↑ "గణితానికీ సాహితీ సువాసన". www.teluguvelugu.in. Archived from the original on 2020-08-05. Retrieved 2020-09-12.