బస్తీ దవాఖాన
హైదరాబాద్‌లో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాను ఏర్పాటు చేసింది. ఈ దవాఖానాను నగరంలో ప్రతి 10వేల మందికి ఒక దవాఖానా చొప్పున వెయ్యి బస్తీ దవాఖానాలను దశలవారీగా ఏర్పాటు చేయనున్నారు.[1] బస్తీ దవాఖానాలో ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక నర్స్‌లతోపాటు, మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ప్రాథమికంగా చికిత్సలు అందిస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల సాయంత్రం 4 గంటల వరకు వైద్యసేవలు అందిస్తారు.
ప్రారంభం
[మార్చు]తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ దవాఖానాను 2018 ఏప్రిల్ 6న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.
57 రకాల వైద్య సేవలు
[మార్చు]బస్తీ దవాఖానాల్లో ఓపీ, ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షలు, గర్బిణీలు, బాలింతలకు పరీక్షలు, టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ కౌన్సెలింగ్, రక్త హీనత, షుగర్, బీపీ, క్యాన్సర్ పరీక్షలు, ఇతర ప్రాథమిక చికిత్సలు, ఆరోగ్య పరిరక్షణ-అవగాహన-చైతన్యం వంటి 57 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అంతకు మించిన ఆరోగ్య, అత్యవసర సమస్యలకు రెఫరల్ హాస్పిటల్స్‌గా ఉండే సిహెచ్‌సిలు, ఇతర ప్రభుత్వ దవాఖానాలకు రెఫర్ చేస్తారు.[2]
బస్తీ దవాఖానాల్లో సేవలు
[మార్చు]- ఓపీ నిత్యం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు
- 200 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, 145 రకాల మందుల పంపిణీ
- సాధారణ జ్వరం, దగ్గు, షుగర్, బీపీతోపాటు ప్రతినిత్యం 80 నుంచి 100 మందికి ఉచితంగా పరీక్షలు. అవసరమైన మందుల అందజేత
- తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా నిత్యం 30 మందికి ఉచితంగా షుగర్ పరీక్షలు.
- గర్భిణులకు 9 నెలలపాటు పరీక్షలు చేయడం, క్యాల్షియం, ఐరన్ మందులివ్వడం. #థైరాయిడ్ సమస్యలు గుర్తించి ప్రసవం సులభంగా జరిగేలా సలహాలు, సూచనలివ్వడం.
- ప్రతి బుధ, శనివారాల్లో చిన్నారులకు పోలియో, టీటీ, డీపీటీ టీకాలు వేస్తారు.
- పలు కేంద్రాల్లో టెలీమెడిసిన్ సేవలు[3]
హైదరాబాద్ లో ఉన్న బస్తీ దవాఖానల వివరాలు
[మార్చు]- బీజేఆర్ నగర్ - మల్కాజ్‌గిరి
- బీఎస్ మక్త - ఖైరతాబాద్
- దత్తాత్రేయ నగర్ - కుత్బుల్లాపూర్[4]
- జవహర్‌నగర్ - సంతోష్‌నగర్
- గడిఖానా - గన్‌ఫౌండ్రీ
- పోచమ్మబస్తీ - అడిక్‌మెట్
- మాదన్నపేట్ - కుర్మగూడ
- వికాస్‌నగర్ - కుర్మగూడ
- దూద్‌బౌలి
- అల్లామజీద్ - కిషన్‌బాగ్
- రాంరెడ్డినగర్ - హబీబ్‌గూడ
- భోలక్‌పూర్
- రాంగోపాల్‌పేట్
- మోచీ కాలనీ- రాంనాస్‌పుర
- బండ్లగూడ - దూద్‌బౌలి
- భీమామైదాన్ - కవాడిగూడ
- ఇబ్రహీం బస్తీ - లంగర్‌హౌస్
- ఎంసీహెచ్ కాలనీ - జియాగూడ
- కుమ్మరబస్తీ - ఖైరతాబాద్
- అశోక్‌నగర్ - సనత్‌నగర్
- బాపూజీనగర్ - బన్సీలాల్‌పేట్
- వీరన్నగుట్ట - మన్సూరాబాద్
- బూపేష్‌గుప్తా నగర్ - హస్తినాపురం
- జవహర్‌నగర్ - వెంగళరావునగర్
- హుడా పార్క్ - ఎఎస్‌రావు నగర్
- శారదానగర్ - ఉప్పల్
- గాజుల రామారం విలేజ్ - గాజులరామారం
- శ్రీ కృష్ణానగర్ - సూరారం
- ఎంజీ నగర్ కమ్యూనిటీ హాల్ - మౌలాలి[5]
- శాంతినికేతన్ కమ్యూనిటీ హాల్ - ఓల్డ్ బోయినపల్లి
- షేక్‌పేట్ రాజీవ్‌గాంధీ నగర్ - జూబ్లీహిల్స్
- చంద్రకిరణ్ బస్తీ - దూల్పేట్
- మహాభారత్‌నగర్ కాలనీ - ఖైరతాబాద్
- సింగడి బస్తీ కమ్యూనిటీ హాల్ - జూబ్లీహిల్స్
- జకీర్ హుస్సేన్ కమ్యూనిటీ హాల్ - మల్లేపల్లి
- కామ్‌గార్‌నగర్ కమ్యూనిటీ హాల్ - గోల్నాక
- గంగానగర్ - గోల్నాక [6]
- యూసఫ్ గూడ కమ్యూనిటీహాల్
- హమాలీ బస్తీ కమ్యూనిటీ హాల్ - బన్సిలాల్‌పేట్
- అన్నపూర్ణ కాలనీ కమ్యూనిటీ హాల్ - నాచారం
- చిలుకానగర్ కమ్యూనిటీ హాల్ - ఉప్పల్
- రామంతపూర్ జడ్పీహెచ్ స్కూల్ - హబ్సిగూడ
- ఓల్డ్ బోయిన్పల్లి వార్డు ఆఫీస్
- ఫిరోజ్‌గూడ వార్డు ఆఫీస్
- ఎన్ఎల్బీ కమ్యూనిటీహాల్ - చింతల్
- అపురూప కాలనీ కమ్యూనిటీహాల్ - సుభాష్‌నగర్
- కౌకూర్మెయిన్ రోడ్డు హనుమాన్ టెంపుల్ దగ్గర - మచ్చబొల్లారం
- గోకుల్ నగర్ పార్కు - వెంకటాపురం, అల్వాల్
- నేరెడ్మెట్ చెక్‌పోస్ట్ కమ్యూనిటీ హాల్ యాప్రాల్ - మల్కాజ్‌గిరి
- ఓల్డ్ మిర్జల్‌గూడ శ్రీనివాసనగర్ కమ్యూనిటీ హాల్ - గౌతంనగర్, మల్కాజ్‌గిరి
- హైదర్‌నగర్ వార్డు ఆఫీస్ - హైదర్‌గూడ
- ముస్లీం బస్తీ, నెహ్రునగర్ కమ్యూనిటీహాల్ - శేరిలింగంపల్లి
- పాపిరెడ్డి కమ్యూనిటీ హాల్ - చందానగర్
- లలితాబాగ్
- రియసాత్నగర్
- కంచన్‌బాగ్
- నవాబ్‌సాహెబ్‌కుంట
- రామ్నాస్పుర
- టోలిచౌకీ
- పురానాపూల్
- రెయిన్‌బజార్
- దూద్‌బావి - మెట్టుగూడ, సికింద్రాబాద్[7]
- జలాల్‌భాబా నగర్ - అత్తాపూర్
- కసరట్టా - పురానాపూల్, చార్మినార్
- ఎస్.ఎన్ కాలనీ, రామచంద్రాపురం మండలం
- బొంబాయి కాలనీ, రామచంద్రాపురం మండలం
- ఎల్ఐజీ భారతీ నగరి కాలనీ, రామచంద్రాపురం మండలం[8]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (7 April 2018). "వైద్య సంస్కరణలు దేశానికే ఆదర్శం". Archived from the original on 30 జనవరి 2022. Retrieved 30 January 2022.
- ↑ ETV Bharat News (3 December 2021). "మరో 32 బస్తీ దవాఖానాలు ప్రారంభం.. ఎక్కడెక్కడంటే?". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ Namasthe Telangana (17 April 2021). "ఆపత్కాలం.. బస్తీ వైద్యం". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ 10TV (12 November 2020). "దత్తాత్రేయ నగర్‌లో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి" (in telugu). Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ HMTV (12 August 2020). "హైదరాబాద్ లో మరో 26 దవాఖానాలు.. కరోనా సేవలు మరింత విస్త్రుతం". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ Namasthe Telangana (21 April 2021). "పైసా ఖర్చులేకుండా నాణ్యమైన వైద్యం". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ Namasthe Telangana (3 December 2021). "పేదలకు అధునాతన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ Namasthe Telangana (19 February 2022). "పేదల కోసమే బస్తీ దవాఖానాలు : మంత్రి హరీశ్‌రావు". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.