Jump to content

ఖైరతాబాదు

అక్షాంశ రేఖాంశాలు: 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E / 17.436793; 78.443906
వికీపీడియా నుండి
ఖైరతాబాదు
సమీపప్రాంతం
అతి పెద్ద వినాయకుని విగ్రహం
అతి పెద్ద వినాయకుని విగ్రహం
ఖైరతాబాదు is located in Telangana
ఖైరతాబాదు
ఖైరతాబాదు
తెలంగాణలో ప్రాంతం ఉనికి
ఖైరతాబాదు is located in India
ఖైరతాబాదు
ఖైరతాబాదు
ఖైరతాబాదు (India)
Coordinates: 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E / 17.436793; 78.443906
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్హైదరాబాదు
ఏర్పాటు1626
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
 • ఎమ్మెల్యేదానం నాగేందర్‌
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 004
Vehicle registrationటిఎస్ 09
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు
శాసనసభ నియోజకవర్గంఖైతరాబాదు
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

ఖైరతాబాదు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ఒక నివాసప్రాంతం.[1] ఇది హైదరాబాద్ జిల్లాలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ పరిధిలోని ఒక మండలం. ఇక్కడి నుండి సోమాజీగూడా, అమీర్ పేట, హుసేన్ సాగర్, లక్డీకాపూల్ ప్రాంతాలకు వెళ్ళవచ్చు. ఇక్కడ ప్రాంతీయ రవాణా అధికారి ప్రధాన కార్యాలయం, ప్రెస్ క్లబ్ హైదరాబాద్, షాదన్ గ్రూప్, ఈనాడు మొదలైనవి ఉన్నాయి. ఈ జోన్‌లో మెహిదీపట్నం (12), కార్వాన్ (13), గోషామహల్ (14), ఖైరతాబాద్ (17), జూబ్లీహిల్స్ (18) అనే ఐదు సర్కిళ్లు ఉన్నాయి. ఈ ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో ఖైరతాబాద్ (91), సోమాజిగూడ (97), అమీర్‌పేట్ (98), సనత్‌నగర్ (100) అనే నాలుగు వార్డులు ఉన్నాయి.

పేరు చరిత్ర

[మార్చు]

ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది. ఖైరతాబాద్ మసీదు పక్కనే ఉన్న అతని సమాధి స్మారక చిహ్నం ఉంది. ఈ సమాధి 2002లో విలియం డాల్రింపుల్ (చరిత్రకారుడు) రచించిన వైట్ మొఘల్స్ పుస్తకంలో పేర్కొన్న జేమ్స్ అకిలెస్ కిర్క్‌పాట్రిక్ భార్య ఖైర్-అన్-నిస్సా కావచ్చు.[ఆధారం చూపాలి]

ఖైరతాబాద్ సర్కిల్

[మార్చు]

నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఖైరతాబాద్ సర్కిల్ అని పిలువబడే ఐదు రోడ్ల జంక్షన్‌ను కలిగి ఉంది. ఆ రోడ్లు సోమాజిగూడ, అమీర్‌పేట్, హుస్సేన్ సాగర్, లక్డీ-కా-పుల్, ఆనంద్‌నగర్‌లకు వెలుతున్నాయి. తెలంగాణ గవర్నర్ నివాసం ఉన్న రాజ్ భవన్ రోడ్ ఒక్కడికి సమీపంలో ఉంది.[2]

ఖైరతాబాదు గణేశ్ ఉత్సవాలు

[మార్చు]

ఇక్కడ 1954 నుండి సింగరి కుటుంబం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి.[3] గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఖైరతాబాదు వినాయకుడు ఎత్తైన వినాయకుడిగా పేరుగాంచాడు. పండుగ రోజుకు మూడు నెలల ముందు విగ్రహం నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ పెద్ద విగ్రహాన్ని నిర్మించేందుకు శిల్పి నేతృత్వంలో దాదాపు 200 మంది కార్మికులు మూడు నెలల పాటు పగలు రాత్రి శ్రమిస్తారు.

రాజకీయాలు

[మార్చు]

ఇది 1967లో ఐదు సెగ్మెంట్లతో కలుపుకుని దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఏర్పాటైంది. 2009 పునరవ్యవస్థీకరణతో శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కూకట్ పల్లిలు విడిపోయి అప్పటివరకు అంబరు పేట నియోజకవర్గంలో ఉన్న హిమయత్ నగర్, అమీర్ పేటలను కలుపుకుని ఖైరతాబాద్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. నియోజకవర్గం ఏర్పాటైనప్పటినుంచి 17సార్లు జరిగిన ఎన్నికల్లో 14 సార్లు కాంగ్రెస్ పార్టీగెలిచింది. పీజేఆర్ ఐదుసార్లు ఎమ్మేల్యేగా గెలిచి, అతని మరణానంతరం కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఒకసారి గెలిచారు.

ముఖ్యమైన ప్రదేశాలు

[మార్చు]

రవాణా

[మార్చు]

ఖైరతాబాదు నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు వివిధ వాహనాల రవాణా సదుపాయం ఉంది. ఇక్కడ ఖైరతాబాదు మెట్రో స్టేషను కూడా ఉంది.

50 పడకల ఆసుపత్రి

[మార్చు]

ఖైరతాబాద్‌లో ఏర్పాటుచేసిన 50 పడకల ప్రభుత్వ దవాఖానను 2022 మార్చి 16న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హ‌రీశ్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నగేశ్‌, టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, కార్పోరేటర్‌ విజయారెడ్డి, ఇతర ప్రజాపతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4][5]

డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు

[మార్చు]

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా ఖైరతాబాద్‌ పరిధిలోని ఇందిరానగర్‌లో నిర్మించిన 210 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ సముదాయాన్ని 2022, ఫిబ్రవరి 3న తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్‌-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించి, లబ్ధిదారులకు అందించాడు.[6] ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి ఇతర ప్రజాపతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7]

17.85 కోట్ల రూపాయలతో 210 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించడంతోపాటు వాటర్‌ ట్యాంక్‌, విద్యుత్‌ సౌకర్యం, దుకాణాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి. ఒక్కొ ఇళ్ళు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో 8.50 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు డిగ్నిటీ కాలనీగా నామకరణం చేశారు.

ప్రముఖులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "New circles and wards in GHMC". Greater Hyderabad Municipal Corporation. Archived from the original on 27 సెప్టెంబరు 2019. Retrieved 22 March 2019.
  2. "Khairatabad Ganesha to Receive 3500 Kilo Laddoo as Offering during Vinayaka Chaturthi".
  3. deva, Ganapathi. "Ganapathi Deva | Ganesh Utsav | Khairathabad Ganesh Hyderabad". Khairathabad Ganesh Hyderabad | Ganesh Chaturthi Hyderabad. Retrieved 2019-03-28.
  4. telugu, NT News (2022-03-17). "తీవ్రత తగ్గింది.. ప్రభావం పోలేదు". Namasthe Telangana. Archived from the original on 2022-03-17. Retrieved 2022-03-17.
  5. Telanganatoday (2022-03-16). "20,000 posts to be filled in State health department: Harish Rao". Telangana Today. Archived from the original on 2022-03-17. Retrieved 2022-03-17.
  6. "రూ50 లక్షలు విలువజేసే ఇల్లు ఉచితంగా ఇస్తున్నాం మంత్రి కేటీఆర్‌". ETV Bharat News. 2022-02-03. Retrieved 2023-05-19.
  7. Today, Telangana (2022-02-01). "Hyderabad: Inauguration of Indira Nagar Dignity Housing Colony on Feb 3". Telangana Today. Archived from the original on 2022-02-01. Retrieved 2023-05-19.

బయటి లింకులు

[మార్చు]