ఘటకేసర్
ఘటకేసర్, తెలంగాణ రాష్ట్రములోని మేడ్చల్ జిల్లా,ఘటకేసర్ మండలానికి చెందిన గ్రామం.[1]
ఈ మండలము రంగారెడ్డి జిల్లా తూర్పున,నల్గొండజిల్లా సరిహద్దులో ఉంది.ఇది మేజర్ గ్రామ పంచాయతి.
విషయ సూచిక
2008 పంచాయతి ఎన్నికలు[మార్చు]
అక్టోబర్ 6, 2008న జరిగిన పంచాయతి ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు బరిలో నిలబడగా నవ తెలంగాణ ప్రజా పార్టీ బలపర్చిన మేకల సుజాత నర్సింగరావు గెలుపొందింది.[2] సుజాత 3840 ఓట్లు సాధించగా, తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థి నాగమణికి 2653 ఓట్లు లభించాయి.[3] కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సుజాత దాసుకు 2255 ఓట్లు, విజయలక్ష్మికి 141 ఓట్లు లభించాయి.
గ్రామ జనాభా[మార్చు]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 19763, పురుషులు 10167, స్త్రీలు 9596, ఆరు సంవత్సరాల లోపు పిల్లలు 2185, అక్షరాస్యులు 14288.[4]
సమీప గ్రామాలు[మార్చు]
యానంపేట్ 2 కి.మీ., కొండాపూర్ 2 .కి.,మీ., ఔషాపూర్ 3 కి.మీ., అంకుష్ పూర్ 4 కి.మీ.,కొర్రెముల్ 4 కి.మీ., దూరంలో ఉన్నాయి.
విద్యాసంస్థలు[మార్చు]
- చైతన్య జూనియర్ కాలేజ్, ఘటకేసర్
- గురుకుల్ జూనియర్ కాలేజ్, ఘటకేసర్
- ఆనందజోతి జూనియర్ కాలేజ్, ఘటకేసర్
- శ్రీచైతన్య డిగ్రీ కళాశాల, ఘటకేశర్.
- విజ్ఞాన స్కూల్, ఘటకేసర్,
- అభూపతి హై స్కూల్, ఘటకేసర్
- మండల పరిషద్ పాఠశాల.ఘటకేసర్[4]
మండలంలోని పట్టణాలు[మార్చు]
- ఘటకేసర్ (ct)