సంఘి నగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
sanghi nagar
సంఘి నగర్
పరిసర ప్రాంతము
sanghi nagar is located in Telangana
sanghi nagar
sanghi nagar
Location Telangana, India
భౌగోళికాంశాలు: 17°16′00″N 78°40′33″E / 17.2668°N 78.6758°E / 17.2668; 78.6758
దేశం  India
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హైదరాబాదు
మెట్రో హైదరాబాదు
ప్రభుత్వం
 • సంస్థ GHMC
భాషలు
 • అధికార తెలుగు
సమయప్రాంతం IST (UTC+5:30)
PIN 501511
లోక్ సభ నియోజకవర్గం నల్గొండ
విధానసభ నియోజకవర్గం మలక్‌పేట
Planning agency GHMC
Civic agency GHMC

సంఘి నగర్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ఒక ప్రాంతము.

సంఘి నగర్ సంఘి గ్రూపు ఆఫ్ ఇండస్ట్రీస్ చే నిర్మింపబడిన పారిశ్రామిక సముదాయం. దేవాలయ సముదాయం కొండపై స్వర్గధామంగా కట్టబడినది. దాని చుట్టూ ఉన్న సంఘి గ్రూపు కు చెందిన పరిశ్రమలన్నింటినీ సర్వశక్తిమంతుడు ఆశీర్వదించబడుతున్నట్టుగా ఉంది. ఈ ఆలయం రాత్రిపూట చూడటానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది రామోజీ ఫిల్ం సిటీకి దగ్గరగా ఉంటుంది. సంఘి నగర్ హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్ కు 25 కి.మీ దూరంలో ఉంది. సంఘి సమూహం యొక్క తయారీ సౌకర్యాలు కాకుండా కార్మికులకు పూర్తి స్థాయిలో గృహనిర్మాణ సముదాయం మరియు వైద్య వసతులు కలిగి ఉంది. ఇందులో విద్యుదుత్పత్తి కేంద్రం, కమ్యూనికేషన్ సౌకర్యాలు, హయ్యర్ సెకండరీ పాఠశాల, సంఘి గ్రూపు సిబ్బంది మరియు కార్మికులకు వసతి సౌకర్యం, హాస్పటల్, ఫుడ్ మార్ట్స్, వినోద సౌకర్యాలు, పోస్టు ఆఫీసు, కేబుల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం కలదు.

సంఘి నగర్ ఎస్.టి.డి కోడ్ : 08415.

ఇదే విధమైన సౌకర్యాలు కలిగిన వేరొక సంఘి టౌన్‌షిప్ గుజరాత్ లోని సంఘి పురం లో కలదు. ఈ ప్రాంతంలో సంఘి ఇండస్ట్రీస్ లిమిటెడ్. అధ్వర్యంలో పెద్ద లిగ్నైట్ ఆధారిత సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి.

రవాణా[మార్చు]

టి.ఎస్.ఆర్.టి.సి హైదరాబాదు నుండి బస్ సౌకర్యం కలదు. అవి.

  • రూటు నెం. : 290S & 205K సికింద్రాబాదు - సంఘినగర్/రామోజీ ఫిలిం సిటీ

ఈ మార్గంలో లాలాగూడ, తార్నాక, ఉప్పల్ రింగురోడ్డు, కామినేని హాస్పటల్స్, ఎల్.బి.నగర్, సంఘి నగర్ అనే ప్రాంతాలున్నాయి.

  • రూట్ నెం. : 202u, 204u ఉమెన్స్ కళాశాల - సంఘి నగర్

ఈ మార్గంలో ఉమెన్స్ కళాశాల, చాదెర్గాట్, మలక్‌పేట, దిల్‌ఖుశ్ నగర్, ఎల్.బి.నగర్, సంఘి నగర్ అనే ప్రాంతాలున్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సంఘి_నగర్&oldid=2105702" నుండి వెలికితీశారు