మదీనాగూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదీనాగూడ
సమీపప్రాంతం
మదీనాగూడ is located in Telangana
మదీనాగూడ
మదీనాగూడ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
మదీనాగూడ is located in India
మదీనాగూడ
మదీనాగూడ
మదీనాగూడ (India)
నిర్దేశాంకాలు: 17°29′46″N 78°20′30″E / 17.496111°N 78.341667°E / 17.496111; 78.341667Coordinates: 17°29′46″N 78°20′30″E / 17.496111°N 78.341667°E / 17.496111; 78.341667
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 050
వాహన నమోదు కోడ్టిఎస్
లోకసభ నియోజకవర్గంహైదరాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

మదీనాగూడ, తెలంగాణ రాష్ట్ర హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది నగరానికి వాయువ్య దిశలో చందానగర్, హఫీజ్‌పేట, మియాపూర్ ప్రాంతాల మధ్యలో ఉంది.[1][2]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో చందానగర్, తారానగర్, హఫీజ్‌పేట, మియాపూర్, హెచ్‌ఎమ్‌టి కాలనీ, విశ్వస్వరనగర్ కాలనీ, ఇంద్రారెడ్డి అల్విన్ కాలనీ, ఉషోదయ ఎన్‌క్లేవ్, సప్తగిరి కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[4]

వాణిజ్య ప్రాంతం[మార్చు]

ఇక్కడ అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. మియాపూర్ ప్రాంతంలో ఒక పెద్ద మార్కెటు ఉంది. చుట్టుపక్కల శివారు ప్రాంతాలలో బాగా ప్రాచూర్యం పొందిన మార్కెటు ఉంది.

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మదీనాగూడ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు (10కెవి: సికింద్రాబాద్ జంక్షన్ నుండి మియాపూర్ బస్టాప్ వరకు, 17/226: ఇసిఐఎల్ బస్ స్టేషను నుండి లింగంపల్లి బస్టాప్ వరకు, 17హెచ్/226సి: ఇసిఐఎల్ బస్టాప్ నుండి భెల్ వరకు, 113కె: లింగంపల్లి బస్టాప్ నుండి ఉప్పల్ బస్టాప్ వరకు, 216కెఎల్: లింగంపల్లి బస్టాప్ నుండి మెహదీపట్నం బస్టాప్ వరకు) సౌకర్యం ఉంది.[5] ఇక్కడికి సమీపంలో చందానగర్ రైల్వే స్టేషను, హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను, మియాపూర్ మెట్రో స్టేషను ఉన్నాయి.

ప్రార్థన స్థలాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో షిర్డీ సాయిబాబా దేవాలయం, అయ్యప్పస్వామి దేవాలయం, దుర్గా దేవాలయం, శ్రీ కనకదుర్గ దేవాలయం, మసీదు-ఎ-అమీనా కలీమి, జూబ్లీహిల్స్ మసీదు, ఇస్లామిక్ సెంటర్, మసీదు ఇ ఎరాజ్ మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Madinaguda Locality". www.onefivenine.com. Retrieved 2021-01-29.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2021-01-29.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01.
  4. "Madinaguda, Chanda Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-29.
  5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-29.
"https://te.wikipedia.org/w/index.php?title=మదీనాగూడ&oldid=3656523" నుండి వెలికితీశారు