Coordinates: 17°26′42″N 78°28′10″E / 17.444865°N 78.469396°E / 17.444865; 78.469396

బేగంపేట్ (బాలానగర్ మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేగంపేట
నగర ప్రాంతం
బేగంపేట ప్రధాన రహదారి దృశ్యం
బేగంపేట ప్రధాన రహదారి దృశ్యం
బేగంపేట is located in Telangana
బేగంపేట
బేగంపేట
తెలంగాణలో ప్రాంతం ఉనికి
బేగంపేట is located in India
బేగంపేట
బేగంపేట
బేగంపేట (India)
Coordinates: 17°26′42″N 78°28′10″E / 17.444865°N 78.469396°E / 17.444865; 78.469396
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు జిల్లా
మెట్రోహైదరాబాదు
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 016
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

బేగంపేట, హైదరాబాదులోని సికింద్రాబాదుకు చెందిన ప్రాంతం. ఆరవ నిజాం (మహబూబ్ అలీ ఖాన్, అసఫ్ జా VI) కుమార్తె బషీర్ ఉన్నిసా బేగం పేరుమీద ఈ బేగంపేట పేరు పెట్టారు. పైగా షామ్స్ ఉల్ ఉమ్రా అమీర్ ఇ కబీర్ రెండవ అమీర్‌ను వివాహం చేసుకున్నప్పుడు వివాహకట్నంలో భాగంగా బషీర్ ఉన్నిసా బేగానికి ఈ ప్రాంతాన్ని కానుకగా అందించారు.

వివరాలు[మార్చు]

పాత బేగంపేట విమానాశ్రయం

హుసేన్ సాగర్ సరస్సుకి ఉత్తరాన ఉన్న ఈ బేగంపేట, హైదరాబాదు నగరంలోని ప్రధాన వాణిజ్య, నివాస కేంద్రాలలో ఒకటిగా ఉంది. బేగంపేట, పంజాగుట్ట మధ్యలో గ్రీన్లాండ్స్ ఫ్లైఓవర్ ఉంది. పూర్వకాలంలో ఈ బేగంపేట హైదరాబాదు, సికింద్రాబాదు నగరాల మధ్య ఒక చిన్న శివారు ప్రాంతంగా ఉండేది. బేగంపేట విమానాశ్రయం నగరానికి ఒక ప్రధాన ఆకర్షణ. శంషాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన తరువాత బేగంపేట విమానాశ్రయం వాణిజ్య విమానాల కోసం కాకుండా శిక్షణ, చార్టర్డ్ విమానాల కోసం మాత్రమే పనిచేస్తోంది.

పైగా ప్యాలెస్, గీతాంజలి సీనియర్ స్కూల్, బేగంపేట స్పానిష్ మసీదు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ వంటి ముఖ్యమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. హుస్సేన్ సాగర్ ఒడ్డున బేగంపేట సమీపంలో సంజీవయ్య పార్క్ కూడా ఉంది.

ఆస్పత్రులు[మార్చు]

  • పేస్ హాస్పిటల్స్ [1]
  • మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్

రవాణా[మార్చు]

బేగంపేట్ రైల్వే స్టేషను ఈ ప్రాంతానికి ప్రధాన రవాణా సౌకర్యాన్ని అందిస్తోంది. సమీపంలో ఉన్న సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్ వంటి ప్రాంతాలలో హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బేగంపేట నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. బేగంపేట మెట్రో స్టేషనులో మెట్రో రైలు కూడా ప్రారంభమైంది. విద్యార్థులతో పాటు ఇతర పౌరుల రవాణా సాధనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఇది ఒకటి. ఇక్కడికి సమీపంలోని రసూల్‌పురలో కూడా రసూల్‌పుర మెట్రో స్టేషను ఉంది.

వంతెన[మార్చు]

బేగంపేట డివిజన్‌లో గల పికెట్‌ నాలాపై ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమంలో భాగంగా 10 కోట్ల రూపాయలతో నిర్మించిన[2] వంతెనను 2022 అక్టోబరు 28న తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించాడు. ఈ వంతెన మీదుగా సికింద్రాబాదు నుండి పంజాగుట్ట వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కంటోన్నెంట్ బోర్డు ప్రాంతాలలోని 8000 గృహాలు కుటుంబాల ప్రజలకు వరద ముప్పు తగ్గుతుంది. ఈ కార్యక్రమంలో హైదరాబాదు నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[3]

వైకుంఠ‌ధామం[మార్చు]

బేగంపేట ధనియాల గుట్టలోని శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌ వద్ద 4 ఎకరాల్లో 8.54 కోట్ల రూపాయలతో నిర్మించిన‌ ‘మహాపరినిర్వాణ’ను 2023 మే 9న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర పశుసంవర్థక శాఖామంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, రాష్ట్ర కార్మిక శాఖామంత్రి సి.హెచ్. మల్లారెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]

ఈ ఆధుకిన వైకుంఠధామంలో అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ నిర్మాణం, సెరిమోనియల్‌ హాల్‌, చెక్క నిల్వ గది, పిండ ప్రదానం చేసే ప్రాంతం, వెయిటింగ్‌ హాల్‌, బాడీ ప్లాట్‌ఫారంలు, ఫీచర్‌ గోడలు, ప్రవేశం, నిష్క్రమణకు తోరణాలు, ఫలహారశాల, నీటి వసతి సహా టాయిలెట్‌ బ్లాక్‌ల ఏర్పాటు, పాదచారుల మార్గం అభివృద్ధి, పార్కింగ్‌, వైఫై సౌకర్యం, సీఎస్‌ఆర్‌ పద్ధతిన శివుని విగ్రహ ఏర్పాటు, రెండు అంతిమ యాత్ర వాహనాలు వంటి అన్ని రకాల సౌకార్యలు కల్పించారు.[5]

ఇతర వివరాలు[మార్చు]

2005, అక్టోబరు 12న, దాదాపు రాత్రి గం. 7.30 ని.లకు బేగంపేట ప్రాంతంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయం వెలుపల ఒక వ్యక్తి పేలుడు పదార్ధాలను పేల్చడంతో ఈ ఆత్మాహుతి బాంబుదాడిలో ఆ వ్యక్తితోపాటు 45 ఏళ్ళ హోంగార్డు ఎ. సత్యనారాయణను మరణించారు.

మూలాలు[మార్చు]

  1. "Gastro, Liver and Kidney Centre Hyderabad".
  2. Telugu, TV9 (2022-10-27). "Hyderabad: నగరవాసులారా ఊపిరి పీల్చుకోండి.. పూర్తయిన పికెట్‌ నాలా పనులు, శుక్రవారం నుంచే అందుబాటులోకి." TV9 Telugu. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. telugu, NT News (2022-10-29). "ముంపు సమస్య ఇక రానీయం". www.ntnews.com. Archived from the original on 2022-10-29. Retrieved 2022-11-03.
  4. "Telangana municipal administration minister KT Rama Rao to open funeral home in Begumpet". The Times of India. 2023-05-09. ISSN 0971-8257. Archived from the original on 2023-05-16. Retrieved 2023-05-16.
  5. "KTR: దశాబ్దాల సమస్యలు.. ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం: కేటీఆర్". EENADU. Archived from the original on 2023-05-10. Retrieved 2023-05-16.

వెలుపలి లింకులు[మార్చు]