సి.హెచ్. మల్లారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.హెచ్. మల్లారెడ్డి
సి.హెచ్. మల్లారెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 ఫిబ్రవరి 2019
ముందు లక్ష్మారెడ్డి
నియోజకవర్గము మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1953-09-09) 9 సెప్టెంబరు 1953 (వయస్సు 67)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి కల్పన రెడ్డి
సంతానము ఇద్దరు కుమారులు, ఒక కూతురు
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

న్యూఢిల్లీ, భారతదేశం

వృత్తి రాజకీయ నాయకుడు
విద్యావేత్త
సామాజిక వేత్త
మతం హిందూ

సి.హెచ్. మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 19 ఫిబ్రవరి 2019 కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా చేరాడు. [1]

జననం[మార్చు]

మల్లారెడ్డి 1953, సెప్టెంబరు 9న తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో జన్మించాడు.[2]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

2014, మార్చి 19న తెలుగుదేశం పార్టీలో చేరిన మల్లారెడ్డికి 2014, ఏప్రిల్ 9న మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం ఎం.పి. అభ్యర్థిగా పార్టీ టికెట్ ఇచ్చింది. 2014, మే 16న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డే. 2016 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)లో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు..[1]

2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల, మహిళ, శిశు సంక్షేమ, నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్నాడు.[4][5][6]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఇండియన్ ఎక్స్ ప్రెస్. "TDP's lone Telangana MP, Malla Reddy, joins TRS". Retrieved 14 February 2017.
  2. "Ch. Malla Reddy". india.gov.in. Retrieved 12 February 2017.
  3. వెబ్ ఆర్కైవ్. "ELECTION COMMISSION OF INDIA". web.archive.org. Retrieved 14 February 2017.
  4. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  5. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  6. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.