బోయిన్‌పల్లి (సికింద్రాబాద్)
బోయిన్‌పల్లి
Bowenpally | |
---|---|
సికింద్రాబాద్ | |
Coordinates: 17°28′34″N 78°28′58″E / 17.476111°N 78.482778°E | |
దేశం | India |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైద్రాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
Government | |
• Body | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు |
భాషలు | |
• అధికార | తెలుగు, ఉర్దు |
Time zone | UTC+5:30 (ప్రామాణిక కాలం) |
పిన్‌కోడ్ | 500011 |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
బోయిన్‌పల్లి, తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాలానగర్ మండలంలో ఉంది. (బో-ఎన్-పల్లి అని కూడా పిలుస్తారు).సికింద్రాబాద్‌లోని అభివృద్ధి చెందిన ఒక నివాస ప్రాంతం.[1] ఇది సికింద్రాబాద్ నగరానికి వాయవ్య ప్రాంతంలో ఉంది. ఎన్‌హెచ్ 44 వంటి ప్రధాన రహదారులు ఈ ప్రాంతం గుండా వెళుతున్నాయి. ఇది ఎన్‌హెచ్ 7, ఎన్‌హెచ్ 9 లను కూడా కలుపుతుంది. మంచి పౌరసౌకర్యాలుతో కలిగి ఉంది.రహదారి, రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడిన ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వృద్ధికి కారణమవుతున్నాయి.ఇది ప్రధానంగా ఉన్నత మధ్యతరగతి ప్రాంతం.ఈ ప్రాంతంలో కొన్ని ఉత్తమ నివాస కాలనీలను కలిగి ఉంది. ఇది సికింద్రాబాద్ నగరానికి వాయవ్య అంచున ఉంది. బ్రిటిష్ వారు చాలా సంవత్సరాలు ఇక్కడ నివసించి, పరిపాలన సాగించారు. ప్రజల స్నేహపూర్వక వీధులతో కలిగిన పాత బోవెన్‌పల్లి గ్రామం ఇప్పటికీ ఉంది. కొన్ని పాత నిర్మాణాలలో కాకతీయులకాలంనాటి ప్రత్యేకమైన రూపకల్పనతో ఎద్దు ఆకారంలో నిర్మించన కొన్ని పురాతన శిల్పాలతో మిగిలి ఉన్న ఒక పాత మందిరం బోవెన్‌పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఇప్పటికీ ఉంది.ఇది నగరంలోని వివిధ ప్రాంతాలను కలిపే కూడలిగా గుర్తింపు పొందింది.బోవెన్‌పల్లి పరిధిలో బోవెన్‌పల్లి పోలీసు స్టేషను అనేపేరుతో రక్షకభట నిలయం ఉంది.[2]
బోవెన్‌పల్లికి ఉత్తరాన ఒకేఓక 0927 (తూర్పు-పడమర)తో ఉన్న హైదరాబాద్ విమానాశ్రయం రన్‌వే సృష్టమైన ఉమ్మడి సరిహద్దుగా ఉంది. ఇది జాతీయ రహదారి 7 (మ్యాప్‌లో " నిజామాబాద్ రోడ్"గా గుర్తించబడింది), జాతీయ రహదారి 7జాతీయ రహదారి 9 (మ్యాప్‌లో " పూణే రోడ్"గా గుర్తించబడింది) రెండు కలిసేకూడలిగాఉంది.[1] ఈ రెండు రహదారుల నుండి హైదరాబాదు నగరానికి ప్రవేశ ద్వారం అనుకోవచ్చు. బోవెన్‌పల్లి అనేక మసీదులు, గురుద్వారాలు, దేవాలయాలతో శాంతి, మత సామరస్యాన్ని కలిగి ఉంది.ఈ ప్రాంత సామాజిక ప్రజలు అన్ని వర్గాల ప్రజలతో కలిసిమెలిసి ఉంటారు.
చరిత్ర
[మార్చు]సికింద్రాబాద్ అభివృద్ధి చెందుతున్నప్రారంభ రోజుల్లో మూడు ప్రధాన గ్రామాలు తిరుమలగిరి, బోవెన్‌పల్లి, కార్ఖానా అనే మూడు ప్రధాన గ్రామాలుతో ఏర్పడిన ఒక చిన్న పట్టణం. "బోవెన్‌పల్లి" అనే పేరు భువనపల్లి నుండి వచ్చింది. దీనికి 10 వ శతాబ్దం నుండి చాళుక్య రాజు త్రైలోక్యమల్లా భువనేశ్వర పేరు పెట్టారు.చాళుక్య కాలం నాటి స్తంభంపై ఉన్న ఒక శాసనం ప్రకారం రాష్ట్ర పురావస్తు శాఖ ఈ పేరును ధ్రువీకరించింది.
- చరిత్ర ఉన్న భారతీయ ఫోటోగ్రాఫర్ లాలా దీన్ దయాల్ ఇక్కడ బోవెన్‌పల్లిలోని ప్లాస్సీ లైన్స్ ప్రాంతంలో నివసించారు.
- హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు మిశ్రమ సంస్కృతితో కూడిన శాంతియుత సామరస్యంతోకలిగిన, హిందూ దేవాలయాలు, పెద్ద మసీదు (బాడి మసీదు), చర్చిలతో బోవెన్‌పల్లి ప్రాంతం కలిగిఉంటుంది. ఇవి ప్రతి కుగ్రామంలో కీర్తన, భజనసంఘాలుగా ఉండటానికి అవి ఉపయోగపడేవి. ఇప్పుడు వాటిలో కొన్ని తగ్గతున్నాయి.
- బోవెన్‌పల్లిమీదుగా వెళ్లే మేడ్చల్ హైవే జాతీయ రహదారి 7 (నిజామాబాద్ రోడ్ అని కూడా పిలుస్తారు) లో రుచికరమైన ఆహారాన్ని అందించే అనేక ఢాబాలు ఉన్నాయి. ఈ ఢాబాలు ఎక్కువగా సాంప్రదాయ ప్రామాణికమైన పంజాబీ ఆహారాన్ని అందిస్తూ, ఆర్థికంగా అభివృద్ధి చెందాయి.
- బోవెన్‌పల్లి ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగరంలోని వివిధ ప్రాంతాలకు 26, 26ఎన్, 26ఎమ్, 229 సంఖ్యతో ఉన్న మార్గంగల అనేక బస్సులను నడుపుతుంది. సికింద్రాబ్డ్ స్టేషన్ నుండి ఓల్డ్-బోవెన్పల్లికి, 26/8సి, 26బి / 7కె, 49ఎమ్ సంఖ్యలగల ఇతర ప్రత్యేక బస్సులను నడుపుతుంది. 26, 8ఎన్ / 26 26ఎమ్, 229 మొదలైనవి కార్యాలయాలు పనిచేయు సమయలలో నడుస్తాయి. అలాగే, 24ఇ / 31హచ్ స్టేషన్ నుండి గ్రీన్ ఫీల్డ్స్ కు నడుస్తాయి. హస్మత్ పేట్ మీదుగా 26 జి సంఖ్య కలిగిన మరొక బస్సు నడుస్తుంది.
- సమీప హైదరాబాద్ ఎమ్.ఎమ్.టి.యస్ రైల్వేస్టేషన్ ఫతేనగర్ వద్ద ఉంది.
- రోజంతా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. చాలా బస్సులు (226, 229, 230 ఎ) ఇతర వాహనాలు న్యూ బోవెన్‌పల్లి ద్వారా సికింద్రాబాద్ నగరానికి వెళ్తాయి.
- రద్దీని తగ్గించడానికి బోవెన్‌పల్లి ప్రధాన కూడలి కెేంద్రం నుండి ఇరానీ హోటళ్ల వరకు ట్రాఫిక్ లైట్లు ఏర్పాటుకు కొత్త ప్రణాళిక ఉంది. అదనంగా, పెరుగుతున్నప్రయాణికులరద్దీని సులభతరం చేయడానికి రహదారిని వెడల్పు చేయడానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రణాళికలను కలిగి ఉంది.
ఉప ప్రాంతాలు
[మార్చు]ఓల్డ్ బోవెన్పల్లి, న్యూ బోవెన్పల్లి అనే రెండు ప్రధాన ఉప ప్రాంతాలుతో బోవెన్‌పల్లి ఏర్పడింది. ఈ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలు చాలా ఉన్నాయి.ఓల్డ్-బోవెన్పల్ల తిరుమలగిరికి చాల దగ్గరగానూ,ప్యారడైజ్ ప్రాంతానికి 4 కి.మీ. దూరంలోనూ ఉంది. రాతిఫల్లి బస్ స్టాప్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వంటి ప్రధాన రవాణా ప్రదేశాలు ఓల్డ్ బోవెన్పల్లికి సమీపంలోనే ఉన్నాయి. ఓల్డ్ బోవెన్పల్లిలో 30 కి పైగా పాఠశాలలు, సుమారు 10 కళాశాలలతో విద్యకు మైలురాయిగా ఉంది. ప్రతి సంవత్సరం అనేక అపార్టుమెంట్లు, ఫ్లాట్లలో వ్యక్తిగత ఇళ్ళు నిర్మించి వ్యాపార కేంద్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. వివిధ దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మించబడ్డాయి.ఈ ప్రాంతం క్షితిజ సమాంతర అభివృద్ధిని చూసింది. ఆదిత్య విల్లా గ్రాండే, నెస్ట్కాన్ తులిప్, సంకల్ప్ గార్డెనియా టవర్ లాంటి నివాస ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
కొత్త బోవెన్పల్లి
[మార్చు]ఓల్డ్ బోవెన్పల్ల, న్యూ బోవెన్పల్లి రెండింటిలో మంచి కాలనీలు ఉన్నప్పటికీ, న్యూ బోవెన్పల్లి ఆధునిక నగరానికి చాలా దగ్గరగా ఉంది. న్యూ బోవెన్పల్లిలో పెద్ద తోకట్టా, చిన్న తోకట్టా అనే రెండు ప్రాంతాలు ఉన్నాయి.న్యూ బోవెన్పల్లి, టాంక్బండ్, తిరుమలగిరి, అల్వాల్ వంటి చుట్టుపక్కల ఇతర ప్రాంతాలతో పాటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత పరిధి కిందకు వస్తుంది. కంటోన్మెంట్ వారి స్వంత పరిపాలన, పన్ను విభాగాలను కలిగి ఉంది. వీటికి నీరు, నిర్మాణ ఆమోదాలు వంటి ఇతర సౌకర్యాలు కంటోన్మెంట్ పరిపాలనా మండలి పరిధిలో ఉన్నాయి.న్యూ బోయినపల్లి వైపు రెండు జాతీయరహదారి 7 రహదారి మేడ్చల్ వైపు, జాతీయరహదారి 9 బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాన్ని కలుపుతుంది. ఓల్డ్ విమానాశ్రయం రహదారి, శ్మశాన వాటిక, మౌంట్ కార్మెల్ పాఠశాల ఈ ప్రాంతంలో ఉన్నాయి. దీనిని ఓల్డ్ బాంబే హైవే అని కూడా పిలుస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Bowenpally in Hyderabad Overview | Bowenpally Google Map | MagicBricks". www.magicbricks.com. Retrieved 2020-10-19.
- ↑ https://www.hyderabadpolice.gov.in/ps/bowenpallyps.htm