Jump to content

బేగంపేట విమానాశ్రయం

వికీపీడియా నుండి
Begumpet Airport
బేగంపేట విమానాశ్రయము
حیدرآباد ائیرپورٹ
बेगमपेट विमानक्षेत्र

Hyderabad Old Airport
సంగ్రహం
విమానాశ్రయ రకంమిలిటరీ/పబ్లిక్
కార్యనిర్వాహకత్వంఎయిర్ పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా
ప్రదేశంబేగంపేట, హైదరాబాదు, తెలంగాణ, భారత దేశము
ఎత్తు AMSL1,742 ft / 531 m
అక్షాంశరేఖాంశాలు17°27′11″N 078°28′03″E / 17.45306°N 78.46750°E / 17.45306; 78.46750
వెబ్‌సైటుaai.aero/allAirports/...
పటం
బేగంపేట విమానాశ్రయం is located in Telangana
బేగంపేట విమానాశ్రయం
బేగంపేట విమానాశ్రయం is located in India
బేగంపేట విమానాశ్రయం
Location within India
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
09/27 10,600 3,231 తారు
Ceased Operations Effective March 23rd 2008

బేగంపేట విమానాశ్రయం (IATA: BPM, ICAO: VOHY) తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో ఉంది. దీనిని "హైదరాబాదు ఓల్డు ఎయిర్ పోర్టు"గా కూడా పిలుస్తారు. ఈ విమానాశ్రయం బేగంపేటలో ఉంది. ఈ విమానాశ్రయం రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీ (RGAA), బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్ట్ట్షషన్ కు ప్రధాన గృహం వంటిది. భారతీయ వాయుసేన యొక్క శిక్షణా కమాండ్ యొక్క శిక్షణా పాఠశాల పూర్వము నేవిగేషన్, సిగ్నల్ స్కూల్ గా పిలువబడేది. ఈ శిక్షణా పాఠశాల ఇచట ఉంది. పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ విమానాశ్రయం అంతర్జాతీయ, వాణిజ్య సేవలందించేది. మార్చి 23 2008రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్ర్రారంభమైనప్పటి వరకు విశేష సేవలందించింది. ఆ తరువాత ఈ విమానాశ్రయం మూసివేయబడింది. ఈ విమానాశ్రయంలో చివరి వాణిజ్య విమానం" థాయ్ ఎయిర్ వేశ్ ఇంటర్నేషనల్ ప్లైత్ టి.జి.330" బ్యాంకాక్ కు మార్చి 22 2008 న బయలుదేరినది.

బేగంపేట విమానాశ్రయం ప్రస్తుతం మిలిటరీ ఏవియేషన్ ట్రైనింగు, వి.ఐ.పిల విమానాల కొరకు ఉపయోగపడుతుంది. వామపక్ష పార్టీలు సివిల్ ఏవియేషన్ మినిస్టరికు ఈ విమానాశ్రయాన్ని అల్ప ఖర్చులతో ప్రయాణీకులకుపయోగపడేవిధంగా పునరుద్ధరించాలని విన్నపం చేసింది.

చరిత్ర

[మార్చు]
ఈ విమానాశ్రయం వాడుకలో ఉన్నపుడు జెట్ ఎయిర్ వేస్ యొక్క సివిల్ ఎయిర్ క్రాప్టు విమానం నిలిపిన దృశ్యం

బేగంపేట విమానాశ్రయం 1930లలో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు ఎయిరో క్లబ్ స్థాపనతో ప్రారంభించబడింది. మొదట దీనిని హైదరాబాదు రాష్ట్రం యొక్క నిజాం ఉపయోగించాడు. ఇది నిజాం యొక్క దక్కన్ ఎయిర్ వేస్ లిమిటెడ్ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉండేది. ఇది బ్రిటిష్ ఇండియాలో ప్రాచీనమైన ప్రీమియర్, తొలి విమానయాన సంస్థ. 1937 లో టెర్మినల్ భవనం నిర్మితమైనది.[1] ఈ విమానాశ్రయం ముఖ్య విమానాశ్రయంగా రూపొందిన తరువాత 1972 లో క్రొత్త టెర్మిన భవనం దక్షిణం వైపున నిర్మించబడింది.[2] పాత టెర్మినల్ "బేగంపేట పాత ఎయిర్ పోర్టు"ను సూచిస్తుంది. క్రొత్త టెర్మినల్ యందు రెండూ చెక్-ఇన్ టెర్మినళ్ళుంటాఅయి;రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్, ఎన్.టి.ఆర్ నేషనల్.

ఫిబ్రవరి 2005లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుండి లుఫ్తాన్స విమానం వచ్చినప్పుడు హైదరాబాద్ , యూరప్ మధ్య నాన్‌స్టాప్ ఫ్లైట్ ప్రారంభమైంది.[3]

ఈ విమానాశ్రయం ముసివేయడు సమయంలో భారత దేశములో 6వ అతి పెద్ద విమానాశ్రయంగా నిలిచింది. ఇది 13 పార్కిగ్ ప్రదేశాలతోనూ టెర్మినల్ బ్లాక్ చుట్టూ ఐదు "నైట్ పార్కిగ్ బేస్" తోనూ కలిగి ఉండేది. ఇది ఎ320 మైయు బోయింగ్ 737 విమానాల పార్కింగ్ కు సరిపోయేటట్లుండేది. ఈ విమానాశ్రయంలో అతి కొద్ది రాత్రి ల్యాండిగ్ లుండేవి. ఈ విమానాశ్రయంలో 40 శాతం ఆంధ్ర ప్రదేశ్ యొక్క రద్దీ ఉండేది. ఎందువలనంటే తగినన్ని డైరక్టు విమానాలు లేనందున.[4]

బేగంపేట విమానాశ్రయం సామర్థ్యం ప్రయాణీకుల రద్దీ పెరిగిన తరువాత వాణిజ్య, అంతర్జాతీయ రంగాల అవసరాలు తీర్చేందుకు అభివృద్ధి చేయబడింది. భారతీయ విమానాశ్రయాలలో అధికంగా సంవత్సరానికి 45% ప్రయాణీకుల రద్దీని తట్టుకునేవిధంగా రూపొందించబడింది. ఈ విమానాశ్రయంలో 16 అంతర్జాతీయ, 10 దేశీయ విమానయాన సంస్థల 300 విమానాలు ప్రతిరోజూ 20,000 ప్రయాణీకులకు సేవలందించేవి. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ యొక్క ఎయిర్ ఫోర్స్ వన్ 2000 ప్రారంభంలో హైదరాబాద్ పర్యటన సందర్భంగా బేగంపేట నుండి ల్యాండ్ అయింది, బయలుదేరింది.

మూసివేసే సమయానికి, బేగంపేట భారతదేశంలో రద్దీగా ఉండే 6వ విమానాశ్రయంగా నిలిచింది. టెర్మినల్ బ్లాక్ చుట్టూ 13 పార్కింగ్ బేలను కలిగి ఉంది, పాత బ్లాక్ పక్కన ఉత్తరం వైపున ఐదు "నైట్ పార్కింగ్ బేలు" A320, బోయింగ్ 737లను నిర్వహించడానికి సరిపోయేలా ఉన్నాయి. విమానాశ్రయం రాత్రి ల్యాండింగ్ సౌకర్యాలను పరిమితం చేసింది.[5]

ఇండియా సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో

[మార్చు]

Begumpet Airport hosts 'India Aviation', India's first civilian air show. This Biennial event, organised by the Ministry of Civil Aviation in collaboration with FICCI, was first held from October 15 to October 18, 2008. The second edition, ‘INDIA AVIATION 2010’ was organized, from 3 to 7 March 2010. The Partner Country in the second edition was France, and USA was the Focus Country for the event. The event was bigger in magnitude to its predecessor. More than 200 exhibitors participated and the exhibition covered a gross area of 12,000 square metres. 40 aircraft participated, including the Antonov An-148 which was on display for first time in India. More than 500 conference delegates and more than 5000 Business visitors attended the event. Parallel events of International Conference on Civil Aviation and CEOs Forum were also organized. The third edition of INDIA AVIATION 2012 was organized in Hyderabad from 14 to 18 March 2012.[6]

సాధారణ ఏవియేషన్, శిక్షణ

[మార్చు]

After the closure of Begumpet Airport for commercial flights, it is being used for aviation and flight training purposes by A.P. Aviation Academy and Rajiv Gandhi Aviation Academy. Training flights fly only to the south of the airport because of the northern part of the airport being a prohibited airspace for commercial flights.

శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన తర్వాత, పైలట్ల శిక్షణ కార్యకలాపాలన్నింటినీ నాదిర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్ నుండి బేగంపేట విమానాశ్రయానికి మార్చబడ్డాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Begumpet Airport History". Archived from the original on 2005-12-21. Retrieved 2014-10-05.
  2. Begumpet Airport History Archived 21 డిసెంబరు 2005 at the Wayback Machine
  3. "Lufthansa starts Hyderabad-Frankfurt service". Rediff. Press Trust of India. 18 February 2005. Retrieved 23 May 2021.
  4. Airports in Andhra Pradesh PDF (4.53 KiB)
  5. "Airports in Andhra Pradesh" (PDF). Archived from the original (PDF) on 23 September 2015. (4.53 KiB)
  6. "Press Information Bureau, Government of India". Retrieved 30 January 2012.

ఇతర లింకులు

[మార్చు]