తుక్కుగూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తుక్కుగూడ, రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామమునకు ఆనుకుని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ గ్రామమునందు ప్రాచీన వేంకటేశ్వరస్వామి ఆలయము ఉంది. అయ్యప్పస్వామి ఆలయము ఉంది.

సమీప మండలాలు[మార్చు]

కందుకూరు మండలం, దక్షిణం వైపున, షంషాబాద్ మండలం ఉత్తర దిక్కున, కోహిర్ మండలం పడమర వైపున, రాజేంద్రనగర్ మండలం ఉత్తర దిక్కున ఉన్నాయి. ఫరూఖ్ నగర్ మండలం పడమర దిక్కున ఉన్నాయి. పరూక్ నగర్, సింగపూర్, బడేపల్లె ఇక్కడికి సమీపములోని పట్టణాలు. ఈ ప్రాంతము రంగారెడ్డి జిల్లా మరియు మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దులో ఉంది.

రవాణా సౌకర్యములు[మార్చు]

ఈ గ్రామము చుట్టుప్రక్కల వున్న అన్ని ప్రాంతాలకు రోడ్డు వసతి కలిగి ఉంది. బస్సులు తిరుగు చున్నవి. కాని ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైలు వసతి లేదు. కాని సమీపములోని పెద్ద రైల్వే స్టేషను హైదరాదు ఇక్కడికి 32 కి.మీ దూరములో ఉంది.

పాఠశాలలు[మార్చు]

  • రెయిన్‌ట్రీ ఇంటర్నేషనల్ స్కూల్

ఉప గ్రామాలు[మార్చు]

భవాండ్ల కుంట తండ, ఇమాం గూడ, శ్రీనగర్.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

టి.దేవేందర్ గౌడ్
టి.దేవేందర్ గౌడ్
రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్మెన్‌గాను, 3 సార్లు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడుగాను, రాష్ట్రమంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన ప్రముఖ నేత దేవేందర్ గౌడ్ తుక్కుగూడ గ్రామంలో 1953, మార్చి 18న జన్మించాడు. కళాశాల దశలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేసిన అనుభవంతో తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి ఎన్.టి.రామారావు నేతృత్వంలో పార్టీలో చేరి అంచెలంచెలుగా పార్టీలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు. తన తెలంగాణా వాదానికి పార్టీలో తగిన ప్రతిస్పందన లభించకపోవడంతో 2008, జూన్ 23న తెలుగుదేశం పార్టీకి రాజానామా చేశాడు.

మూలాలు[మార్చు]