Jump to content

తుక్కుగూడ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
తుక్కుగూడ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం మహేశ్వరం
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 46.03 km² (17.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 19,182
 - గృహాల సంఖ్య 7,200
పిన్ కోడ్ - 501359
ఎస్.టి.డి కోడ్ -
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

తుక్కుగూడ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] తుక్కుగూడ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలోని మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న తుక్కుగూడ, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం

[మార్చు]

తుక్కుగూడ 46.03 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°12′29″N 78°28′34″E / 17.208°N 78.476°E / 17.208; 78.476 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 19182 మంది కాగా, అందులో మంది పురుషులు, మంది మహిళలు ఉన్నారు. 7200 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 10 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 15 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. బోడ యాదగిరి రెడ్డి
  2. కటేకర్ మధుమోహన్
  3. తూర్పు అనిత
  4. ఎరుకల శివకుమార్
  5. రాగనమోని మౌనికా
  6. కొప్పుల పద్మ
  7. బూడిద తేజస్విని
  8. బాకి విలాస్
  9. బరిగేల హేమలత
  10. బదావత్ రవి
  11. రెడ్డిగండ్ల సుమన్
  12. జాపల భవన
  13. సప్పిడి లావణ్య
  14. రాజమోని రాజు
  15. భవాని వెంకట్ రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. "Thukkuguda Municipality". thukkugudamunicipality.telangana.gov.in. Archived from the original on 2021-10-23. Retrieved 2021-03-22.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 22 March 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 22 March 2021.
  4. "Basic Information of Municipality, Thukkuguda Municipality". thukkugudamunicipality.telangana.gov.in. Archived from the original on 19 ఆగస్టు 2022. Retrieved 22 March 2021.
  5. admin (2020-05-11). "Tukkuguda municipality Councillors list 2020". Telangana data. Retrieved 14 May 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు

[మార్చు]