Coordinates: 17°57′41″N 80°35′18″E / 17.9612675°N 80.5882803°E / 17.9612675; 80.5882803

మణుగూరు పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మణుగూరు పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
మణుగూరు పురపాలకసంఘం is located in తెలంగాణ
మణుగూరు పురపాలకసంఘం
మణుగూరు పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°57′41″N 80°35′18″E / 17.9612675°N 80.5882803°E / 17.9612675; 80.5882803
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి కొత్తగూడెం
మండలం మణుగూరు
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 24.86 km² (9.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 32,065
 - పురుషుల సంఖ్య 16,169
 - స్త్రీల సంఖ్య 15,896
 - గృహాల సంఖ్య 8,110
పిన్ కోడ్ - 507117
Area code(s) టెలిఫోన్ కోడ్ - 08746
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

మణుగూరు పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] మణుగూరు పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం లోని పినపాక శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న మణుగూరు 2005, జూన్ 15న 3వ గ్రేడ్ పురపాలక సంఘంగా ఏర్పాటుచేయబడింది.

భౌగోళికం[మార్చు]

మణుగూరు 24.86 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°56′46″N 80°48′50″E / 17.946°N 80.814°E / 17.946; 80.814 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 331 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం కొత్తగూడెం నుండి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 32065 మంది కాగా, అందులో 16169 మంది పురుషులు, 15896 మంది మహిళలు ఉన్నారు. 8110 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 18 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 23 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

మూలాలు[మార్చు]

  1. "Manuguru Municipality". manugurumunicipality.telangana.gov.in. Retrieved 21 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 21 April 2021.
  3. "Basic Information of Municipality, Manuguru Municipality". manugurumunicipality.telangana.gov.in. Retrieved 21 April 2021.

వెలుపలి లంకెలు[మార్చు]