ధర్మపురి పురపాలకసంఘం
ధర్మపురి పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°55′30″N 79°05′54″E / 18.9250391°N 79.0983960°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జగిత్యాల |
మండలం | ధర్మపురి |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | సంగి సత్తమ్మ |
- వైస్ చైర్పర్సన్ | ఇందారపు రామయ్య |
వైశాల్యము | |
- మొత్తం | 8.95 km² (3.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 15,735 |
- పురుషుల సంఖ్య | 7,721 |
- స్త్రీల సంఖ్య | 8,014 |
పిన్ కోడ్ - 505425 | |
Area code(s) | టెలిఫోన్ కోడ్ - |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
ధర్మపురి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ధర్మపురి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం లోని ధర్మపురి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న ధర్మపురి, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
[మార్చు]ధర్మపురి 8.95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 12°07′16″N 78°09′29″E / 12.121°N 78.158°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 230 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం జగిత్యాల నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 15735 మంది కాగా, అందులో 7721 మంది పురుషులు, 8014 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 9 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 15 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం సంగి సత్తమ్మ చైర్‌పర్సన్‌గా, ఇందారపు రామయ్య వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6][7] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- అయ్యోరి వేణుగోపాల్
- ఇందారపు రామయ్య (వైస్ చైర్పర్సన్)
- సంగనభట్ల సంతోషి
- పురాణపు కిరణ్మయి
- తరాల్ల కార్తీక్
- గుర్రాల సుధాకర్
- వేముల నాగలక్ష్మి
- వొడ్నాల ఉమాలక్ష్మి
- కొంపల పద్మ
- సంగి సత్తమ్మ (చైర్పర్సన్)
- జక్కు పద్మ
- గరిగె అరుణ
- తిర్మందాస్ అశోక్
- సయ్యద్ యూనుస్
- అనంతుల విజయలక్ష్మి
మూలాలు
[మార్చు]- ↑ "Dharmapuri Municipality". dharmapurimunicipality.telangana.gov.in. Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 8 May 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 8 May 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 8 May 2021.
- ↑ "Basic Information of Municipality, Dharmapuri Municipality". dharmapurimunicipality.telangana.gov.in. Retrieved 8 May 2021.[permanent dead link]
- ↑ The Hindu, Telangana (27 January 2020). "All top posts of municipalities in Karimnagar go to TRS". Archived from the original on 28 January 2020. Retrieved 8 May 2021.
- ↑ admin (2020-05-15). "Dharmapuri municipality Councillors list 2020". Telangana data. Retrieved 8 May 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 12 May 2021.
వెలుపలి లంకెలు
[మార్చు]- ధర్మపురి పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు Archived 2021-04-23 at the Wayback Machine