నిర్మల్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిర్మల్ పురపాలక సంఘం
నిర్మల్
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
నిర్మల్
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

నిర్మల్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. నిర్మల్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోని నిర్మల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

చరిత్ర

[మార్చు]

తెలంగాణలోని పురాతన మునిసిపాలిటీలలో ఇది ఒకటి. నిర్మల్ పురపాలక సంఘాన్ని 1952 లో 36 ఎన్నికల వార్డులతో రెండవ తరగతి పురపాలక సంఘంగా స్థాపించారు. 2019 జూన్ 28 న తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల వార్డుల సంఖ్యను 42 కి పెంచింది. చుట్టుపక్కల ఉన్న రెండు గ్రామ పంచాయతీలు మంజులాపూర్, వెంకటపూర్ లను ఈ పురపాలక సంఘంలో విలీనం చేశారు.

భౌగోళికం

[మార్చు]

నిర్మల్ పురపాలక సంఘం19°06′N 78°21′E / 19.10°N 78.35°E / 19.10; 78.35.[1] అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 133 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా 88,433, ఇందులో 44,053 మంది పురుషులు, 44,380 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 10303 ఉన్నారు. నిర్మల్ నగర అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కన్నా 76.39% ఎక్కువ. వీరిలో పురుషుల అక్షరాస్యత 84.86% కాగా, మహిళల్లో 68.05% అక్షరాస్యులు ఉన్నారు.[2]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 42 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం గండ్రత్‌ ఈశ్వర్‌ ఎన్నికైనారు.[3][4] ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
 1. ఎస్. ఉమారాణి
 2. సడం స్వప్న
 3. ఎ. రమాదేవి
 4. బి. నవీన్
 5. జి. లక్ష్మి
 6. ఎల్. నరహరి
 7. సయ్యద్ అక్బర్ హుస్సేన్
 8. ఎన్. పోశెట్టి
 9. ఎ. రాజేందర్
 10. కొండ సబిత
 11. పి. శ్రీకాంత్
 12. ఎస్. బాల రవీందర్
 13. ఆర్. తులసి
 14. అబ్దుల్ మతీన్
 15. నామెడ రమ్య
 16. టి. వాణి
 17. ఫర్వత్ పర్వీన్
 18. పురస్తు రూప
 19. డి. నర్సవ్వ
 20. అంజుమ్ బేగం
 21. ఇమ్రాన్ ఉల్లా
 22. షేక్ సాజిద్
 23. సయ్యద్ జహీర్
 24. ఎం. అపర్ణ
 25. ఎ. నరేందర్
 26. అకుల లక్ష్మీనర్సమ్మ
 27. ఆయేషా కౌస
 28. పుడారి రాజేశ్వర్
 29. ముజైద్ అలీ
 30. ఎస్పీ. రాజు
 31. తోకల లావణ్య
 32. పర్హనాజ్ బేగం
 33. గంద్రత్ ఈశ్వర్
 34. ఎర్రవోతు నవనీత
 35. అతియా ఖనం
 36. కట్టి నరేందర్
 37. నెరెల్లా వేణుగోపాల్
 38. యశోద
 39. రఫూక్
 40. అడపా విజయలక్ష్మి
 41. షేక్ అబ్దుల్
 42. జి. వెంకటరమణ

మూలాలు

[మార్చు]
 1. Falling Rain Genomics, Inc – Nirmal
 2. "నిర్మల్ పురపాలక సంఘ జనాభా గణాంకాలు". www.census2011.co.in. Retrieved 2021-04-09.{{cite web}}: CS1 maint: url-status (link)
 3. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 6 April 2021.
 4. admin (2020-05-18). "Nirmal municipality Councillors list 2020". Telangana data. Retrieved 2021-05-22.