Jump to content

ఖానాపూర్ పురపాలకసంఘం

అక్షాంశ రేఖాంశాలు: 19°15′32″N 78°36′41″E / 19.2587826°N 78.6114999°E / 19.2587826; 78.6114999
వికీపీడియా నుండి
ఖానాపూర్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
ఖానాపూర్ పురపాలకసంఘం is located in తెలంగాణ
ఖానాపూర్ పురపాలకసంఘం
ఖానాపూర్ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 19°15′32″N 78°36′41″E / 19.2587826°N 78.6114999°E / 19.2587826; 78.6114999
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్
మండలం ఖానాపూర్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ అంకం రాజేందర్
 - వైస్ చైర్‌పర్సన్‌ అబ్దుల్ ఖలీల్
జనాభా (2011)
 - మొత్తం 20,566
 - పురుషుల సంఖ్య 10,385
 - స్త్రీల సంఖ్య 10,181
 - గృహాల సంఖ్య 6,300
పిన్ కోడ్ - 504203
Area code(s) టెలిఫోన్ కోడ్ -08734
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

ఖానాపూర్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ఖానాపూర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోని ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న ఖానాపూర్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం

[మార్చు]

ఖానాపూర్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 19°01′59″N 78°39′58″E / 19.033°N 78.666°E / 19.033; 78.666 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 240 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం నిర్మల్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 20566 మంది కాగా, అందులో 10385 మంది పురుషులు, 10181 మంది మహిళలు ఉన్నారు. 6300 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 6 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. కావలి సంతోష్
  2. కరింగుల సంకీర్తన
  3. జన్నారపు విజయలక్ష్మి
  4. నాయిని స్రవంతి
  5. పరిమి లత
  6. అఫ్రీనా బేగం
  7. జి. కిషోర్ నాయక్
  8. అబ్దుల్ ఖలీల్
  9. అంకం రాజేందర్
  10. తొంటి శ్రీనివాస్
  11. చిన్నం సత్యనారాయణ
  12. షాజియా బేగం

మూలాలు

[మార్చు]
  1. "Khanapur Municipality". khanapurmunicipality.telangana.gov.in. Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 12 May 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 12 May 2021.
  4. "Basic Information of Municipality, Khanapur Municipality". khanapurmunicipality.telangana.gov.in. Archived from the original on 3 జూలై 2022. Retrieved 12 May 2021.
  5. admin (2020-05-18). "Khanapur municipality Councillors list 2020". Telangana data. Archived from the original on 2021-05-12. Retrieved 12 May 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]