హుస్నాబాద్ పురపాలకసంఘం
హుస్నాబాద్ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°08′32″N 79°07′56″E / 18.1422777°N 79.1322744°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్ధిపేట |
మండలం | హుస్నాబాద్ |
ప్రభుత్వం | |
- చైర్‌పర్సన్ | ఆకుల రజిత |
- వైస్ చైర్‌పర్సన్ | అయిలేని అనిత |
వైశాల్యము | |
- మొత్తం | 25 km² (9.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 22,099 |
- పురుషుల సంఖ్య | 11,218 |
- స్త్రీల సంఖ్య | 10,881 |
- గృహాల సంఖ్య | 5,779 |
పిన్ కోడ్ - 505467 | |
Area code(s) | ఎస్.టి.డి కోడ్ - 08721 |
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ |
హుస్నాబాద్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] హుస్నాబాద్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న హుస్నాబాద్, 2011, సెప్టెంబరు 8న పురపాలక సంఘంగా ఏర్పడింది.
భౌగోళికం
[మార్చు]హుస్నాబాద్ 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°07′55″N 79°12′29″E / 18.132°N 79.208°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 140 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం సిద్దిపేట నుండి 41 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 22099 మంది కాగా, అందులో 11218 మంది పురుషులు, 10881 మంది మహిళలు ఉన్నారు. 5779 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 22 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం ఆకుల రజిత చైర్‌పర్సన్‌గా, అయిలేని అనిత వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- కొంకట నలినిదేవి
- బోజు రామ
- కోమటి స్వర్ణలత
- ఐలేని అనిత
- పెరుక భాగ్యారెడ్డి
- పున్నం లావణ్య
- చిత్తారి పద్మ
- మైదరబోయిన వేణు
- మైదరబోయిన శ్రీనివాస్
- గోవిండు రవి
- దోడి శ్రీనివాస్
- గుల్ల రాజు
- బొల్లి కల్పన
- భూక్య సరోజన
- అకుల రజిత
- జనగత్న రత్న
- వల్లపు రాజయ్య
- మిర్యాల రమేష్
- బోజ్జ హరీష్
- వాల సుప్రజ
మూలాలు
[మార్చు]- ↑ "Husnabad Municipality". husnabadmunicipality.telangana.gov.in. Archived from the original on 16 ఏప్రిల్ 2021. Retrieved 16 April 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 16 April 2021.
- ↑ "Basic Information of Municipality, Husnabad Municipality". husnabadmunicipality.telangana.gov.in. Archived from the original on 17 ఏప్రిల్ 2023. Retrieved 16 April 2021.
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 16 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 16 April 2021.
వెలుపలి లంకెలు
[మార్చు]- హుస్నాబాద్ పురపాలక సంఘ అధికారిక వెబ్‌సైటు Archived 2021-04-16 at the Wayback Machine