చేర్యాల పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేర్యాల పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
చేర్యాల పురపాలకసంఘం is located in తెలంగాణ
చేర్యాల పురపాలకసంఘం
చేర్యాల పురపాలకసంఘం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 17°56′42″N 78°57′05″E / 17.9448920°N 78.9514510°E / 17.9448920; 78.9514510
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్ధిపేట
మండలం చేర్యాల
ప్రభుత్వము
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 9,217
 - స్త్రీల సంఖ్య 9,093
 - గృహాల సంఖ్య 4,199
పిన్ కోడ్ - 506223
Area code(s) ఎస్.టి.డి కోడ్ - 08710
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చేర్యాల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] చేర్యాల పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మెదక్ లోకసభ నియోజకవర్గం లోని సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

భౌగోళికం[మార్చు]

చేర్యాల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°55′41″N 78°58′05″E / 17.928°N 78.968°E / 17.928; 78.968 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 98 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం సిద్ధిపేట నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 18,310 మంది కాగా, అందులో 9,217 మంది పురుషులు, 9,093 మంది మహిళలు ఉన్నారు. 4,199 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[3] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. స్వరూప రాణి
  2. చెవిటి లింగం
  3. మంగోలు చంటి
  4. నిమ్మ రాజీవ్‌కుమార్ రెడ్డి
  5. ఆడెపు నరేందర్
  6. యాట కనకవ్వ
  7. జుబేదా ఖాతున్
  8. ఉడుముల ఇన్నమ్మ
  9. సందుల నరేష్
  10. తుమ్మలపల్లి లీల
  11. ముస్త్యాల తార
  12. పచ్చిమడ్ల సతీష్ గౌడ్

మూలాలు[మార్చు]

  1. "Cherial Municipality". cherialmunicipality.telangana.gov.in. Retrieved 2021-06-12.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 12 June 2021.
  3. admin (2020-05-21). "Cheriyal Municipality Councillors list 2020". Telangana data (in ఇంగ్లీష్). Retrieved 2021-06-13.

వెలుపలి లంకెలు[మార్చు]