చెన్నూర్ పురపాలకసంఘం
చెన్నూర్ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°47′04″N 79°43′03″E / 18.7844775°N 79.7175517°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల |
మండలం | చెన్నూర్ |
ప్రభుత్వం | |
- చైర్‌పర్సన్ | |
- వైస్ చైర్‌పర్సన్ | |
వైశాల్యము | |
- మొత్తం | 24.53 km² (9.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 23,579 |
- పురుషుల సంఖ్య | 11,809 |
- స్త్రీల సంఖ్య | 11,770 |
- గృహాల సంఖ్య | 6,211 |
పిన్ కోడ్ - 504201 | |
Area code(s) | టెలిఫోన్ కోడ్ - 08737 |
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ |
చెన్నూర్ పురపాలక సంఘం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] చెన్నూర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం లోని చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న చెన్నూర్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
[మార్చు]చెన్నూర్ 24.53 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°51′15″N 79°47′28″E / 18.8541°N 79.7910°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 266 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం మంచిర్యాల నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 23579 మంది కాగా, అందులో 11809 మంది పురుషులు, 11770 మంది మహిళలు ఉన్నారు. 6211 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 18 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలనపురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 18 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
[మార్చు]వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- పోగుల సతీష్
- కమ్మల శ్రీనివాస్
- వేల్పుల సుధాకర్
- రంవెల్లి మహేష్
- నసీబా బేగం
- చిలుకమర్రి శరణ్య
- జగన్నాదుల శ్రీను
- జోడు శంకర్
- దోమకొండ అనిల్
- అర్చన గిల్డ
- పెండ్యాల స్వర్ణలత
- వేముల శారద
- ఎండి. నవజుద్దీన్
- మేడ శ్రవంతి
- జాడి సురేఖ
- తుమ్మ రమేష్
- నాయిని శ్యామల
- గారెపల్లి శాంతరాణి
మూలాలు
[మార్చు]- ↑ "Chennur Municipality". chennurmunicipality.telangana.gov.in. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 13 May 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 13 May 2021.
- ↑ "Basic Information of Municipality, Chennur Municipality". chennurmunicipality.telangana.gov.in. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 13 May 2021.
- ↑ admin (2020-05-20). "Chennur municipality Councillors list 2020". Telangana data. Retrieved 13 May 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)
వెలుపలి లంకెలు
[మార్చు]- చెన్నూర్ పురపాలక సంఘ అధికారిక వెబ్‌సైటు Archived 2021-05-13 at the Wayback Machine