ఆందోల్-జోగిపేట పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆందోల్-జోగిపేట నగర పంచాయితీ, సంగారెడ్డి జిల్లా చెందిన నగరపంచాయతి. రెండు పట్టణాలను కలిపి నగరపంచాయతీగా ఏర్పాటు చేయడంతో ఆందోల్-జోగిపేట పేరుతో పిలువబడుతుంది. 2014 మార్చి నాటికి ఈ నగరపంచాయతి పరిధిలో 20 వార్డులు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

1955 నుంచి 1965 వరకు జోగిపేట పురపాలక సంఘంగా ఉండేది. 1965లో రెండీంటిని కలిపి పంచాయతీగా ఏర్పాటుచేశారు. ఈ రెండు పట్టణాలు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. 1998లో రెండింటినీ విడదీసి వేర్వేరు పంచాయతీలుగా ఏర్పాటుచేశారు. ఆదాయం విషయంలో ఈ రెండింటి మధ్యన తగాదాలు జరుగుతుండేవి. 2013లో ఈ రెండు పట్టణాలను కలిపి నగర పంచాయతీగా ఏర్పాటుచేశారు. జోగిపేటకు ఐదుగురు, ఆందోలుకు ఎనిమిది సర్పంచులు ఎన్నికయ్యారు. 2014 మార్చి 30న ఎన్నికలు జరగనున్నాయి.

2014 ఎన్నికలు[మార్చు]

నగర పంచాయతీగా ఏర్పాటైన పిదప తొలిసారిగా 2014 మార్చి 30న ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నగరపంచాయతి పరిధిలో 20 వార్డులున్నాయి. వార్డులలో ఎన్నికైన కౌన్సిలర్లు పరోక్ష పద్ధతిలో చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]