Jump to content

అయిజ పురపాలకసంఘం

వికీపీడియా నుండి

అయిజ నగర పంచాయతి, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నగర పంచాయతీలలో ఒకటి. గద్వాల రెవెన్యూ డీవిజ పరిధిలోని అయిజ మండల కేంద్రంగా ఉన్న అయిజను 2012లో నగర పంచాయతీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదివరకు ఇది మేజర్ గ్రామపంచాయతీగా ఉండేది. ప్రస్తుతం ఈ నగర పంచాయతి పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. మార్చి 2014 నాటికి ఓటర్ల సంఖ్య 17173.

చరిత్ర

[మార్చు]
అయిజ నగర పంచాయతి కార్యాలయము (పూర్వపు గ్రామపంచాయతి)

అయిజ నగర పంచాయతిని తొలుత ప్రభుత్వ ఉత్తర్వు 361 తేది 24-08-2011 ప్రకారం నగర పంచాయతీగా ప్రకటించబడింది. కాని గ్రామస్థులు ఆందోళన చేయడంతో ఉపసంహరించుకొంది. మళ్ళీ ఏప్రిల్ 29, 2012న నగర పంచాయతీగా ఏర్పాటుచేస్తూ ఉత్తర్వు జారీచేయబడింది. నగర పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి ఇది ప్రత్యేక అధికారుల పాలనలో ఉంది. తొలిసారిగా 2014, మార్చి 30న ఎన్నికలు జరుగనున్నాయి.

2014 ఎన్నికలు

[మార్చు]

2014 మార్చి 30న అయిజ నగర పంచాయతికి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. 20 వార్డులకు జరిగే ఎన్నికలలో విజయం సాధించిన వార్డు సభ్యులు పరోక్ష పద్ధతిలో చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]