మోత్కూర్ పురపాలకసంఘం
మోత్కూర్ | |
స్థాపన | ఆగస్టు 2, 2018 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
మోత్కూర్ పురపాలక సంఘం తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పురపాలక సంఘం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని, తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితిగా ఉన్న మోత్కూర్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా సమీపంలోని కొండగడప, భుజిలాపురం గ్రామాలను కలుపుకొని 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది. మోత్కూర్ పురపాలక సంఘం మొత్తం విస్తీర్ణం 54.71 చ.కి.మీ.[1] ఇందులో 12 ఎన్నికల వార్డులు ఉన్నాయి.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం 15,924 జనాభా ఉండగా అందులో పురుషులు 8,030 మంది, మహిళలు 7894 మంది ఉన్నారు.[2]
పాలకవర్గం
[మార్చు]మోత్కూర్ పురపాలక సంఘంలోని 12 వార్డులకు 2020, జనవరి 21న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 12 వార్డులలో 7 వార్డులు తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపొందగా, 5 వార్డులు కాంగ్రెస్ గెలుపొందింది. 7వ వార్డు కౌన్సిలర్ తీపిరెడ్డి సావిత్రి మున్సిపల్ చైర్మన్ గా, 8వ వార్డు కౌన్సిలర్ బొల్లెపల్లి వెంకటయ్య వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.[2] 2020, ఫిబ్రవరి 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సమక్షంలో నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది.[3][4]
- 1వ వార్డు: పురుగుల వెంకన్న (టిఆర్ఎస్)
- 2వ వార్డు: కారుపోతుల శిరీష (కాంగ్రెస్)
- 3వ వార్డు: లెంకల సుజాత (కాంగ్రెస్)
- 4వ వార్డు: ఎర్రబెల్లి మల్లమ్మ (కాంగ్రెస్)
- 5వ వార్డు: మలిపెద్ది రజిత (కాంగ్రెస్)
- 6వ వార్డు: వనం స్వామి (టిఆర్ఎస్)
- 7వ వార్డు: తీపిరెడ్డి సావిత్రి (టిఆర్ఎస్) చైర్మన్
- 8వ వార్డు: బొల్లెపల్లి వెంకటయ్య (టిఆర్ఎస్) వైస్ చైర్మన్
- 9వ వార్డు: దబ్బెటి విజయ (టిఆర్ఎస్)
- 10వ వార్డు: బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి (టిఆర్ఎస్)
- 11వ వార్డు: గుర్రం కవిత (కాంగ్రెస్)
- 12వ వార్డు: కూరెళ్ళ కుమారస్వామి (టిఆర్ఎస్)
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 23 July 2020.
- ↑ 2.0 2.1 Mothkur Muncipality, about Muncipality. "Ward council Details, Mothkur Municipality". www.mothkurmunicipality.telangana.gov.in. Archived from the original on 23 జూలై 2020. Retrieved 23 July 2020.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (5 February 2020). "దేశంలో విశేష ప్రజాదరణ కలిగిన ఒకే ఒక్క పార్టీ టీఆర్‌ఎస్: మంత్రి జగదీష్ రెడ్డి". ntnews. Archived from the original on 23 July 2020. Retrieved 23 July 2020.
- ↑ ఆంధ్రప్రభ, ముఖ్యాంశాలు (5 February 2020). "సంచలనాలకు కేంద్ర బిందువుగా టీఆర్ఎస్ : జగదీష్ రెడ్డి". www.prabhanews.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 July 2020. Retrieved 23 July 2020.
వెలుపలి లంకెలు
[మార్చు]- మోత్కూర్ పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు Archived 2020-07-23 at the Wayback Machine