గాదరి కిషోర్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాదరి కిషోర్ కుమార్
గాదరి కిషోర్ కుమార్


ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 - 3 డిసెంబర్ 2023
తరువాత మందుల సామేల్
నియోజకవర్గం తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం జూన్ 16, 1981
తుంగతుర్తి, తెలంగాణ, భారతదేశం
తల్లిదండ్రులు మారయ్య - సుజాత
జీవిత భాగస్వామి కమల
సంతానం ఇద్దరు కుమారులు

డా.గాదరి కిశోర్ కుమార్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి నుండి తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

జననం[మార్చు]

కిశోర్ కుమార్ 1981, జూన్ 16న గాదరి మారయ్య - సుజాత దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో జన్మించాడు.[2]

విద్యార్థి జీవితం[మార్చు]

1990-1996 వరకు నల్లగొండ జిల్లా సర్వేల్ లోని రెసిడెన్సియల్ పాఠశాలలో చదివాడు. 2006లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ జర్నలిజం చేసి, 2017లో పిహెచ్.డి. పట్టా అందుకున్నాడు. విశ్వవిద్యాలయం విద్యార్థిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

కిశోర్ కు కమలతో 2014, ఆగస్టు 14న వివాహం జరిగింది.[4] వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి, భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ పై 2,379 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] గాదరి కిశోర్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్లమెంటరీ సెక్రటరీగా నియమించడమే కాకుండా వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలను అప్పగించాడు.[6] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్ పై 1,847 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7]

మూలాలు[మార్చు]

  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. "Gadari Kishore Info". Archived from the original on 2017-09-20. Retrieved 2017-02-25.
  3. India, The Hans (2014-08-28). "KCR attends MLA's wedding reception". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-20.
  4. Jun 2, TNN /; 2014; Ist, 03:00. "It's a dream realised for Osmania University students | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-20. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  5. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  6. "Thungathurthi results". Archived from the original on 2017-07-03. Retrieved 2017-02-25.
  7. "Gadari Kishore Kumar | MLA | Thungathurthi | Nalgonda | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-24. Retrieved 2021-09-20.