మందుల సామేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మందుల సామేల్
మందుల సామేల్


ఎమ్మెల్యే
పదవీ కాలం
3 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
ముందు గాదరి కిషోర్ కుమార్
నియోజకవర్గం తుంగతుర్తి

పదవీ కాలం
2016 అక్టోబరు నుండి 2021
తరువాత సాయిచంద్

వ్యక్తిగత వివరాలు

జననం 14 జులై 1961
ధర్మారం గ్రామం, అడ్డగూడూరు మండలం, యాదాద్రి-భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మందుల రామయ్య
సంతానం సూర్య కిరణ్, భాను కిరణ్

మందుల సామేల్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయనను 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

మందుల సామేల్ టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో పనిచేసి తుంగతుర్తి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి, పార్టీ పటిష్ఠతకు కృషి చేశాడు. ఆయన 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పని చేస్తూ 2001-05 వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా, 2005లో టీఆర్ఎస్ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమితుడై 2014 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగాడు. 2008లో పునర్విభజన తర్వాత తుంగతుర్తి ఎస్సీకి రిజర్వ్ అయ్యింది దీంతో ఆయనను తుంగతుర్తి ఇన్చార్జిగా నియమితుడయ్యాడు. ఆయనకు 2009లో ఎమ్మెల్యేగా టికెట్ ఖాయమన్న సమయంలో టీడీపీ-టీఆర్ఎస్ పొత్తుల్లో భాగంగా  సీటును టీడీపీకి కేటాయించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించగా గాదరి కిశోర్‌కుమార్‌కు టికెట్‌ దక్కడంతో, సామేల్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ చెప్పడంతో ఆయన గెలుపులో కీలకంగా పనిచేశాడు. ఆయన ఆ తరువాత రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. మందుల సామేల్ 2016 అక్టోబరు నుండి 2021 వరకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా పనిచేశాడు.[3] ఆయన 2018లోనూ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించగా అప్పుడు సిట్టింగ్‌లకే టికెట్‌ ఇవ్వడంతో 2018లోనూ కిశోర్‌కుమారే టికెట్‌ సాధించి విజయం సాధించాడు.2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇవ్వాలని కోరగా 2023 జూన్‌ 29న తిరుమలగిరిలో జరిగిన నియోజకవర్గ ప్రగతి నివేదన సభలో కిశోర్‌కుమార్‌కే టికెట్‌ అని మంత్రి కేటీఆర్‌ ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్న సామేల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రకటనతో కలత చెంది జూన్‌ 30న బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశాడు.

మందుల సామేల్ సెప్టెంబరు 17న హైదరాబాద్‌లో టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[4] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.[5] ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్‌ పై 51094 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై[6], డిసెంబర్ 9న ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశాడు.[7]

మూలాలు[మార్చు]

  1. Eenadu (10 November 2023). "ఉత్కంఠకు తెర.. కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే." Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  2. Eenadu (4 December 2023). "వచ్చేస్తున్నాం..అధ్యక్షా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. "గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ పదవీ కాలం పొడిగింపు". andhrajyothy. Archived from the original on 2022-01-11. Retrieved 2022-01-11.
  4. Sakshi (18 September 2023). "కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మందుల సామేల్‌". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  5. Eenadu (10 November 2023). "పంతం నెగ్గించుకున్న సీనియర్లు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  6. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  7. Namaste Telangana (9 December 2023). "ప్ర‌మాణ స్వీకారం చేసిన 101 మంది ఎమ్మెల్యేలు". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.