సాయిచంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేద సాయిచందర్‌
సాయిచంద్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 డిసెంబరు 24 - 2023 జూన్ 29
ముందు మందుల సామేల్
తరువాత వేద రజిని

వ్యక్తిగత వివరాలు

జననం 1984, సెప్టెంబరు 20
అమరచింత గ్రామం, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణం 2023 జూన్ 29(2023-06-29) (వయసు 38)
హైదరాబాద్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు వెంకట్రాములు, మణెమ్మ
జీవిత భాగస్వామి వేద రజిని
సంతానం చరీష్ (కుమారుడు), నది (కుమార్తె)
నివాసం గుర్రంగూడ, బడంగ్‌పేట్, రంగారెడ్డి జిల్లా
మతం హిందూ మతము

వేద సాయిచందర్‌ (1984, సెప్టెంబరు 20 - 2023, జూన్ 29), తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారుడు, గాయకుడు, రాజకీయ నాయకుడు.[1] ఆయన 2021 డిసెంబరు 24 నుండి 2023, జూన్ 29 వరకు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్‌ చైర్మన్‌గా పనిచేశాడు.[2]

జననం, విద్య

[మార్చు]

సాయిచంద్ 1984, సెప్టెంబరు 20న తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, అమరచింత గ్రామంలో వెంకటరాములు, మణెమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన అమరచింతలో పదో తరగతి, ఆత్మకూరులో ఇంటర్, హైదరాబాద్‌లో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో (ఎం.ఏ తెలుగు) పీజీ పూర్తి చేశాడు.

గాయకుడిగా స్టూడియోలో

వివాహం

[మార్చు]

సాయిచంద్ కు ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయమైన వేద రజినిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు చరీష్ (చెర్రీస్), కుమార్తె నది ఉన్నారు.

ఉద్యమ జీవితం

[మార్చు]

అభ్యుదయ భావాలు కలిగిన తన తండ్రి లాగే ప్రజా సమస్యలపై పాటలు రాస్తూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజలను తన పాటలతో చైతన్యం చేసేవాడు.ముఖ్యంగా. తెలంగాణా ఉద్యమకారుల బలిదానాల పై వ్రాసిన పాటలను ఆలపిస్తూ... ప్రజలను ఉత్తేజితులను చేశాడు. మలిదశ తెలంగాణోద్యమంలో ఎన్నో ధూంధాం కార్యక్రమాలతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ప్రభుత్వ పథకాలను తన ఆట పాటలతో ప్రజలోకి తీసుకువెళ్ళాడు. 2009 నుండి 2023 వరకు అసెంబ్లీకి జరిగిన సాధారణ, ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున తన ఆట పాటలతో ప్రచారంలో పాల్గొని పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించాడు.

గాయకుడిగా మంచి పేరు తెచ్చిన పాటలు

[మార్చు]
  • ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా’ [3]
  • 'వాగు ఎండిపాయెరో’
  • ‘వలసలతో వలవల విలపించే కరువుజిల్లా పాలమూరు’
  • ‘అనురాగాల పల్లవి అమ్మ ప్రేమ/ మమతల కోవెల మణిదీపం’
  • ‘నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న’

రాజకీయ జీవితం

[మార్చు]

ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రతి సభలో తన పాటలతో చైతన్యం నింపేవాడు. సాయిచంద్ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ అయిన నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం టికెట్ ఆశించాడు, కొన్ని కారణాలవల్ల టికెట్ దక్కలేదు.

తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పేరును టిఆర్ఎస్ అధిష్టానం 2021 నవంబరు 21న ఖరారు చేసింది.[4] టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో మార్పులతో చివరి నిమిషంలో సాయిచంద్‌కు టికెట్ చేజారింది.[5][6]

2021 డిసెంబరు 15న తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ సంస్థ చైర్మన్‌గా నియమితుడై[7] 2021, డిసెంబరు 24న కార్పొరేషన్ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.[8]

మరణం

[మార్చు]

సాయిచంద్ 2023, జూన్ 28న సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లగా అర్ధరాత్రి వేళ ఆయనకు గుండెపోటు రాగా నాగర్ కర్నూల్ లోని గాయత్రి ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

ఆయన పరిస్థితి విషమించడంతో హైదరబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2023, జూన్ 29న తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించాడు.[9][10]

రంగారెడ్డి జిల్లా, బడంగ్‌పేట్ నగరపాలక సంస్థ పరిధిలోని గుర్రంగూడలో సాయిచంద్ పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్,[11] మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ కూర్మాచలం, రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆంజనేయ గౌడ్, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రో.కోదండరామ్, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు నివాళులు అర్పించిన అనంతరం వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.[12][13][14][15]

హైదరాబాద్‌ హస్తినాపురంలోని జీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జూలై 9న జరిగిన సాయిచంద్‌ దశదిన కర్మకు సీఎం కేసీఆర్‌ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సాంస్కృతిక సారథి కళాకారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.[16][17]

మూలాలు

[మార్చు]
  1. 10TV (21 November 2021). "టీఆర్‌ఎస్‌ లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!" (in telugu). Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Namasthe Telangana (24 December 2021). "నమ్మకాన్ని నిలబెట్టుకొంటాం". Archived from the original on 25 December 2021. Retrieved 24 December 2021.
  3. Namasthe Telangana (2 July 2023). "కోటి రత్నాల వీణాగానం సాయిచంద్‌". Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
  4. Sakshi (22 November 2021). "టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. సగం కొత్తవారికే..!". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
  5. Sakshi (23 November 2021). "నిజామాబాద్‌ నుంచి పోటీకే కవిత మొగ్గు". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  6. V6 Velugu (23 November 2021). "సింగర్ సాయిచంద్ కు సీఎం బుజ్జగింపులు" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Namasthe Telangana (15 December 2021). "మూడు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. ఉత్తర్వులు జారీ". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.
  8. Dishadaily (దిశ) (24 December 2021). "గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిచంద్". www.dishadaily.com. Archived from the original on 25 December 2021. Retrieved 25 December 2021.
  9. "Telangana News: తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ మృతి". web.archive.org. 2023-06-29. Archived from the original on 2023-06-29. Retrieved 2023-06-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. Namasthe Telangana (29 June 2023). "ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌ మృతి". Archived from the original on 29 June 2023. Retrieved 29 June 2023.
  11. "సాయిచంద్ మృతదేహానికి ప్రముఖల నివాళులు, కన్నీటి పర్యంతమైన సీఎం కేసీఆర్". 29 June 2023. Archived from the original on 29 June 2023. Retrieved 29 June 2023.
  12. 10TV Telugu (29 June 2023). "సాయిచంద్‌ను తెలంగాణ సమాజం మరువదు.. ప్రముఖుల ఘన నివాళి". Archived from the original on 29 June 2023. Retrieved 29 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. Namasthe Telangana (29 June 2023). "ముగిసిన సాయిచంద్‌ అంత్యక్రియలు". Archived from the original on 29 June 2023. Retrieved 29 June 2023.
  14. Eenadu (30 June 2023). "తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్‌ హఠాన్మరణం". Archived from the original on 30 June 2023. Retrieved 30 June 2023.
  15. Namasthe Telangana (30 June 2023). "నింగికేగిన పాటల చంద్రుడు". Archived from the original on 30 June 2023. Retrieved 30 June 2023.
  16. Disha Daily (9 July 2023). "సాయిచంద్‌కు కేసీఆర్ నివాళి". Archived from the original on 9 July 2023. Retrieved 9 July 2023.
  17. Namasthe Telangana (10 July 2023). "సాయిచంద్‌కు నివాళి". Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=సాయిచంద్&oldid=4273180" నుండి వెలికితీశారు