బాల్క సుమన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాల్క సుమన్
బాల్క సుమన్


పదవీ కాలము
2018 డిసెంబర్ 11 - ప్రస్తుతం
నియోజకవర్గము చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం అక్టోబరు 18, 1983
గ్రామం :,రేగుంట మండలం:మెట్‌పల్లి, జిల్లా:పెద్దపల్లి తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి రాణి అలేఖ్య
మతం హిందూమతము

బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి, రాజకీయ నాయకులు మరియు 16వ పార్లమెంటు సభ్యులు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు.[1] తెలంగాణలో 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి గొలుపొందాడు. ఈ గెలుపు అనంతరం తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.

జననం[మార్చు]

బాల్క సుమన్ 1983, అక్టోబరు 18న తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా, మెట్‌పల్లి మండలంలోని రేగుంట లో జన్మించారు. సుమన్ తండ్రి బాల్క సురేష్ మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. టిఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన నాటినుండి కార్యకర్తగా చురుకైన పాత్ర పోషించారు.

విద్యాభ్యాసం[మార్చు]

కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉన్నత విద్యను, జూనియర్ కళాశాలలో మాధ్యమిక విద్యను చదివారు. అతను కోరుట్లలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో పిహెచ్.డి. చేస్తున్నారు.

వివాహం - పిల్లలు[మార్చు]

సుమన్ వివాహం రాణి అలేఖ్యతో జరిగింది. వీరికి ఒక కుమారుడు (సుహన్).

రాజకీయ జీవితం[మార్చు]

2001 లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం ద్వారా సుమన్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి విభాగమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం (టి.ఆర్.ఎస్.వి) కు 2007లో అధ్యక్షులుగా పనిచేశారు. టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం (టి.ఆర్.ఎస్.వి) కు 2010లో రాష్ట్రాధ్యక్షుడు పనిచేశారు.

ప్రస్తుతం పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా ఉన్నారు.

2009 మరియు 2014 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

ప్రస్తుతం చెన్నూర్ MLA అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "Constituencywise-All Candidates". Retrieved 17 May 2014.