జి. వివేకానంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి. వివేకానంద్
జి. వివేకానంద్


లోకసభ సభ్యులు
పదవీ కాలము
2009 నుండి 2014
ముందు జి. వెంకటస్వామి
తరువాత బాల్క సుమన్
నియోజకవర్గము పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి సరోజ
సంతానము వ్రితిక, వంశీ, వైష్ణవి, వెంకట్
నివాసము హైదరాబాద్
వెబ్‌సైటు జి. వివేకానంద్ అధికారిక జాలగూడు

జి. వివేకానంద్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు 15వ పార్లమెంటు సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించాడు.[1] 2014 ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నాడు.[2]

జననం[మార్చు]

ఈయన 1957, నవంబరు 30న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మరియు పార్లమెంట్ జి.వెంకటస్వామి, కళావతి దంపతులకు కరీంనగర్లో జన్మించాడు.

విద్యాభ్యాసం[మార్చు]

బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను చదివాడు. ఉస్మానియా వైద్య కళాశాల నుండి వైద్య విద్యను పూర్తిచేశాడు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

2009లో రాజకీయరంగ ప్రవేశంచేసి భారత జాతీయ కాంగ్రెస్ తరపున పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలుపొందాడు. బొగ్గు మరియు ఉక్కు కమిటీల సభ్యుడిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేస్తున్నాడు. విశాఖ పరిశ్రమలకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

నిర్వహించిన పదవులు[మార్చు]

  • 15వ లోకసభ పార్లమెంట్ సభ్యుడు
  • బొగ్గు మరియు ఉక్కు కమిటీల సభ్యుడు
  • భారతీయ పరిశ్రమ యొక్క సమాఖ్య (సిఐఐ), ఆంధ్రప్రదేశ్ చాప్టర్, (2006-2007) ల అధ్యక్షుడు
  • తయారీదారుల సంఘం అధ్యక్షుడు
  • విశాఖ పరిశ్రమ సంస్థల ప్రచార ఉపాధ్యక్షుడు

మూలాలు[మార్చు]

  1. Congress MPs fight over Group-I exams. deccanchronicle.com. 7 September 2010
  2. వి6 న్యూస్. "వివేకానంద్ కు ఘన సన్మానం". Retrieved 18 March 2017. Cite news requires |newspaper= (help)