పల్లా రాజేశ్వర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్లా రాజేశ్వర్ రెడ్డి
పల్లా రాజేశ్వర్ రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చి 2021 - ప్రస్తుతం
నియోజకవర్గం నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం నవంబరు 4, 1963
సోదేశపల్లి గ్రామం, వరంగల్ జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి సూర్యదేవర నీలిమ
నివాసం H.No 8-2-293/82/NG/32, నందగిరి హిల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్
మతం హిందూ

పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుండి 2015, 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందాడు. ఆయన రైతు స‌మ‌న్వయ స‌మితి రాష్ట్ర అధ్యక్షుడిగా కేబినెట్ హోదాలో ఉన్నాడు. [1][2]

జననం[మార్చు]

పల్లా రాజేశ్వర్ రెడ్డి 1963, నవంబరు 4వ తేదీన వరంగల్ జిల్లా, సోదేశపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి పల్లా రాఘవ రెడ్డి, తల్లి అనసూయ. పల్లా రాజేశ్వర్ రెడ్డి కి సూర్యదేవర నీలిమతో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు.

విద్యాభాస్యం[మార్చు]

పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవ తరగతి వరకు వరంగల్ పట్టణ జిల్లా, ధర్మసాగర్ మండలం, మల్లికుదుర్ల లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఫిజిక్స్ లో పి.హెచ్.డి పట్టా పొందాడు.

రాజకీయ జీవితం[మార్చు]

పల్లా రాజేశ్వర్ రెడ్డి 1985-87 మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీ ఎస్.ఎఫ్.ఐ కార్యదర్శిగా పని చేశాడు. 1988 నుండి 91 వరకు ఎస్.ఎఫ్.ఐ. హైదరాబాద్ నగర కార్యదర్శిగా పని చేశాడు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి నల్గొండ లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2015లో నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనమండలికి (ఎమ్మెల్సీ) ఎన్నికయ్యాడు. అనంతరం 2016 - 2019 వరకు ప్రభుత్వ విప్ గా ఉన్నాడు.ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నాడు.[3] 2019లో అయన రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గా భాద్యతలు చేపట్టాడు.[4] 2021, మార్చిలో నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్సీగా గెలుపొందాడు.[5]

మూలాలు[మార్చు]

  1. The Hindu, The Hindu (21 March 2021). "Palla Rajeshwar retains seat". The Hindu. Archived from the original on 1 April 2021. Retrieved 1 April 2021.
  2. The Hans India, The Hans India (27 March 2015). "Palla wins Nalgonda MLC seat". www.thehansindia.com. Archived from the original on 1 April 2021. Retrieved 1 April 2021.
  3. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.
  4. New indian express (17 Nov 2019). "KCR names Palla Rajeshwar Reddy as chairman of farmers' committee". The New Indian Express. Archived from the original on 1 April 2021. Retrieved 1 April 2021.
  5. 10TV (20 March 2021). "రెండోసారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం" (in telugu). Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.CS1 maint: unrecognized language (link)