Jump to content

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

వికీపీడియా నుండి
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి


పదవీ కాలం
2023 అక్టోబరు 05 - ప్రస్తుతం

పదవీ కాలం
2014 - 2018, 2018- ప్రస్తుతం
నియోజకవర్గం జనగామ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1953, ఫిబ్రవరి 11
పున్నోల్, ఐనవోలు మండలం, హన్మకొండ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు గోపాల్‌రెడ్డి, కౌసల్యదేవి
జీవిత భాగస్వామి పద్మలతారెడ్డి
సంతానం పృథ్వీరాజ్‌రెడ్డి, తుల్జాభవానీ
నివాసం జనగామ, తెలంగాణ

యాదగిరి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున జనగాం శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడిగా ఉన్నాడు.[1][2]

జననం, విద్య

[మార్చు]

యాదగిరి రెడ్డి 1953, ఫిబ్రవరి 11న గోపాల్‌రెడ్డి, కౌసల్యదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం లోని పున్నోల్ గ్రామంలో జన్మించాడు. యాదగిరి రెడ్డికి ఒక అన్న, ఒక తమ్ముడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. 1970-72 మధ్యకాలంలో హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తిచేశాడు. ఆ తరువాత కొంతకాలం వ్యవసాయం చేశాడు.

ఉద్యోగం

[మార్చు]

పదో తరగతి చదువుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో పోలీస్ స్టేషన్‌పై దాడిచేసి మిత్రుడిని విడిపించాడు. తన మేనమామ మందలించడంతో హైదరాబాదు వెళ్ళి, ఆటో డ్రైవర్‌గా మారాడు. కొంతకాలం సికింద్రాబాద్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. తరువాత ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ జరిగిన అవినీతిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అభినందనలు, ప్రమోషన్లు అందుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

యాదగిరి రెడ్డికి పద్మలతారెడ్డితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (పృథ్వీరాజ్‌రెడ్డి), ఒక కుమార్తె (తుల్జాభవానీ) ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

1994లో కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1994లో కాంగ్రెస్ నుండి మేడ్చల్ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేశాడు. అది మరొకరికి వెళ్ళింది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సరైన అవకాశాలు రాలేదు. దాంతో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బీఫామ్ కరెక్ట్ ఇవ్వకపోవడం మూలంగా రైతు నాగలి గుర్తుపై పోటీ చేసి, దయాకరరావు చేతిలో ఓడిపోయాడు. అటు తరువాత 2009లో టిఆర్ఎస్ తరపున ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీచేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండారి రాజిరెడ్డి చేతిలో ఓడిపోయాడు.[3]

2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా జనగాం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యపై 32,695 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[4][5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున జనగాం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య పై 29,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6] 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా కూడా ఉన్నాడు.[7]

ఆయనకు 2023లో జరిగే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో 2023 అక్టోబరు 05న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మ‌న్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[8] ఆయన అక్టోబరు 08న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్‌ భవన్‌లో టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు.[9] తెలంగాణాలో 2023 డిసెంబర్​లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువుతా, ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆర్టీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

నటుడిగా

[మార్చు]
  • తపస్వి (1995) [10]

ఇతర విషయాలు

[మార్చు]
  1. 2020, జూన్ నెలలో యాదగిరి రెడ్డికి కోవిడ్ 19 వైరస్ సోకినట్లు తేలింది. కోవిడ్ 19 వైరస్ సోకిన తెలంగాణ మొదటి శాసనసభ్యుడు ఇతడు.[11]
  2. చైనా, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్‌ మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Muthireddy Yadagiri Reddy(TRS):Constituency- JANGOAN(WARANGAL) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 22 August 2021.
  2. https://m.sakshi.com/news/telangana/muthireddy-yadagiri-reddy-biography-162528
  3. "Muthireddy Yadagiri Reddy | MLA | Jangaon | Telangana | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-11. Retrieved 22 August 2021.
  4. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. "Jangoan Election Result 2018 Live Updates: Muthireddy Yadagiri Reddy of TRS Wins". News18 (in ఇంగ్లీష్). 2018-12-11. Retrieved 22 August 2021.
  6. "Muthireddy Yadagiri Reddy(TRS):Constituency- JANGOAN(JANGAON) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 22 August 2021.
  7. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 22 August 2021.
  8. Eenadu (5 October 2023). "తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి". Archived from the original on 5 October 2023. Retrieved 5 October 2023.
  9. Andhrajyothy (8 October 2023). "టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి యాదగిరి‌రెడ్డి". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  10. Sakshi (31 August 2014). "రియల్ హీరో". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.
  11. "TRS MLA Yadagiri Reddy tests positive for coronavirus, being treated in hospital". The News Minute (in ఇంగ్లీష్). 2020-06-13. Retrieved 22 August 2021.