బండారి రాజిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండారి రాజిరెడ్డి
పదవీ కాలం
2009 - 2014
తరువాత ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్
నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1945
సైనిక్‌పురి, కాప్రా, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా , తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
బంధువులు బండారి లక్ష్మారెడ్డి (తమ్ముడు)
నివాసం నాచారం

బండారి రాజిరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో ఉప్పల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బండారి రాజిరెడ్డి 1945లో హైదరాబాద్, నాచారంలో జన్మించాడు. ఆయన మల్లాపూర్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో తోమిదోతరగతి వరకు చదివాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బండారి రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో కాంగ్రెస్ పార్టీ లో వివిధ హోదాల్లో పని చేశాడు. బండారి రాజిరెడ్డి కాప్రా మున్సిపాలిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పై 28,183 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.ఆయన 2012లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా పని చేశాడు.

ఆయన 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన సోదరుడు బండారి లక్ష్మారెడ్డిని పోటీలో నిలిపాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. IndiaVotes (2009). "IndiaVotes AC Summary: Uppal 2009". Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.
  2. Sakshi (1 November 2013). "ఉప్పల్ ఎమ్మెల్యేపై విచారణ చేపట్టండి: హైకోర్టు". Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.
  3. Sakshi (31 March 2014). "'చేతి'లో జాబితా!". Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.
  4. Deccan Chronicle (28 April 2014). "Lakshma gets all-round boost in his constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.