ఖమ్మం
ఖమ్మం
ఖమ్మమెట్ట్ | |
|---|---|
నగరం | |
నరసింహ స్వామి కొండ నుండి ఖమ్మం పట్టణం | |
| Coordinates: 17°15′N 80°10′E / 17.25°N 80.16°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | ఖమ్మం జిల్లా |
| ప్రభుత్వం | |
| • సంస్థ | ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ |
| • మేయర్ | పూనుకొల్లు నీరజ |
| • డిప్యూటీ మేయర్ | షేక్ ఫాతిమా జోహారా |
| • మున్సిపల్ కమీషనర్ | సందీప్ కుమార్ |
| • శాసనసభ్యుడు | పువ్వాడ అజయ్ కుమార్ |
| విస్తీర్ణం | |
• మొత్తం | 93.45 కి.మీ2 (36.08 చ. మై) |
| • స్థానం | 3వ (రాష్ట్రంలో) |
| ఎత్తు | 107 మీ (351 అ.) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 3,13,504 |
| • స్థానం | 151 (దేశం) 4 (రాష్ట్రం) |
| • సాంద్రత | 3,400/కి.మీ2 (8,700/చ. మై.) |
| Demonym | ఖమ్మమైట్ |
| అధికారక | |
| • భాష | తెలుగు, ఉర్దూ |
| కాల మండలం | UTC+5:30 (IST) |
| పిన్‌కోడ్ | 507001 |
| Vehicle registration | టిఎస్–04[3] |
| జాతీయత | భారతీయులు |
| ప్రణాళికా సంస్థ | ఖమ్మం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ |
ఖమ్మం, భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన పట్టణం. ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రం.[4] 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[5] ఖమ్మం పట్టణం వ్యాపార, ఆర్థిక కేంద్రం. ఇది తెలంగాణ రాష్ట్రంలో నాల్గవ అతిపెద్ద నగరం. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు దాదాపు 193 kilometres (120 mi), సూర్యాపేట నుండి 61 kilometres (38 mi), వరంగల్ నుండి 120 kilometres (75 mi), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ఉత్తరాన దాదాపు 121 kilometres (75 mi) దూరంలో ఉంది. మున్నేరు నది ఈ నగరానికి పడమటి వైపున ప్రవహిస్తోంది.[6] 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం, ఖమ్మం పట్టణ సముదాయంలో 313,504 జనాభా ఉంది.[2] 2012, అక్టోబరు 19న, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడింది. కార్పోరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడిన తరువాత ఖమ్మం జనాభా సుమారు 3,07,000 గా ఉంది.[7]
పద చరిత్ర
[మార్చు]స్తంభాద్రి, కంబంమెట్టు, ఖమ్మంమెట్టు[8], కమ మెట్ట్[9], గంబంబుమెట్టు[10], కంబము మెట్టు, ఖమ్మం పేర్లతో పరిణామం చెందుతూ వచ్చిన చారిత్రిక ప్రదేశం. ఇచ్చటగల అతిపురాతనమైన స్తంభాద్రి నరసింహస్వామి ఆలయం దీనికి పేరు రావడానికి కారణం. ఖంబా అనేది కూడా స్థంబానికి మరో పర్యాయ పదం. సీమ ప్రాంతాలనుంచి కాకతీయుల సామ్రాజ్యం చేరుకోవాలంటే ఈ ప్రాంతం నుంచే వెళ్ళలి. ఖమ్మం వరకూ వస్తే ఇక ప్రయాణంలో ఓరుగల్లు ప్రాంతానికి చేరుకున్నట్లే అక్కడికోక మెట్టు చేరుకున్నట్లే. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తంగా అప్పట్లో ‘‘ ఖమ్మంమెట్టు’’ అని కూడా పిలిచేవారు. మహాత్మాగాంధీ ఈ ప్రాంతాన్ని సందర్శించినపుడు వార్తలలో గమనించినా, `1953 లో జిల్లాగా ఏర్పడినప్పుటి పేరును గమనించినా ‘ఖమ్మంమెట్టు’ గానే వుంది[11]. తర్వాతి కాలం లోని రెండక్షరాల అపభ్రంశ పేరుతో కేవలం ‘ఖమ్మం’ గా మిగిలింది. ఏదేమైనా అతి చారిత్రకమైన పేరును వేలసంవత్సరాలుగా నిలబెట్టుకుంటూ వస్తున్న ఘనతమాత్రం ఈ జిల్లా ప్రత్యేకం. పలు చారిత్రక ఆధారాలనుబట్టి ఖమ్మం నిజనామము కమ్మమెట్టు. దీనికి తగు ఆధారాలు బ్రిటిష్ వారి మరియు క్రైస్తవ మిషనరీల రికార్డులు .[12][13][14][15][16][17] అయితే అవి ఆంగ్లీకరించటం లో స్పెల్లింగ్ గా రాసి ఉండవచ్చు , ఎందుకంటే సర్వే పితామహుడు గా పరిగణించబడే జేమ్స్ రెన్నెల్ మ్యాప్ ఆఫ్ ఇండియా - జియోగ్రాఫిక్స్ - ఇండియా-ఫేడెన్-1795 లో ఖమ్మం పేరు లేదు, కొమ్ముం మెట్ (Commum Met) అని ఉంది.

చరిత్ర
[మార్చు]తెలంగాణలో ఖమ్మం జిల్లా తూర్పు ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మధ్య గాను ఉత్తర అక్షాంశం 16.45’కు 18.35’ మధ్యగాను ఉండి 15, 921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉంది. జిల్లాకు ఉత్తరమున చత్తీస్ ఘఢ్, ఒడిశా రాష్ట్రాలు, తూర్పున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్గొండ, వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. 1901 నుండి 1981 వరకు ఖమ్మం పట్టణం తొమ్మిది వేల జనాభా ఉన్న చిన్న పట్టణం నుండి లక్ష మంది జనాభా ఉన్న నగరంగా ఎదిగింది. 24-3-1942 లో పట్టణం మునిసిపాలిటీగా ఏర్పడింది. ఖమ్మం జిల్లా 1953లో పరిపాలనా సౌలభ్యము కొరకు ఏర్పరచబడింది. అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. తొలి రోజులలో ఖమ్మం మొత్తం ఒకటిగా లేదు ఈ జిల్లా భుభాగం అంతా వేరువేరు రాజ వంశాల ఇక్ష్వాకు, తూర్పు చాళిక్యులు, రాష్ట్ర కూటులు, పశ్చిమ కల్యాణి చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, బహామనీయులు, కుతుబషాహీలు, మొగల్, అసఫ్జాహీ ) కాలాల్లో వేరుగా ఉంది.
అది క్రీస్తుశకం 591 ఖమ్మం ప్రాంతాన్ని మహదేవవర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. మనకి తెలుగు చరిత్రలో కూడా మొట్టమొదటిది అని చెప్పకుంటున్న కలమళ్ల శాసనాన్ని ఎరికల్ ముతురాజు అనే బిరుదు వున్న ధనుంజయుడు వేయించిన కాలం కూడా దీనికో పదిహేనేండ్ల పూర్వం క్రీస్తుశకం 575 కాలం. తెలుగు భాషకు ఎంత పూర్వచరిత్ర వుందో అప్పటినుండి చారిత్రక అస్తిత్వాన్ని బ్రతికించుకుంటూ వస్తున్న ఖమ్మం చరిత్ర నిజంగా గర్వకారణమే. ఈ మహ దేవ వర్మ వంశమే చాలా కాలం క్రమంగా పరిపాలించుకుంటూ వచ్చారట. మహదేవ వర్మ మహారాజు గారి తొమ్మిదవ వంశస్థుడైన మహదేవ రాజు 10వ శతాబ్ధంలో ఖమ్మం రాజ్యపాలన చేశాడు.
ఖమ్మం లో చారిత్రకమైన గుడి వున్నట్లే నది కూడా సహజంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తోంది. కృష్ణానదికి ఉపనది అయిన మునేరుని ఆనుకుని నగరం విస్తరించింది.
భౌగోళికంగా చక్కటి పీఠభూమి ప్రాంతం, పైగా అత్యంత కఠినమైన పురాతనమైన నల్లరాతి నిల్వలున్న ప్రాంతం. నరసింహ స్వామి గుట్టకు కూతవేటు దూరంలో, ఉదయపు దైవనమస్కారాలను ఉదయం కళ్ళు తెరవగానే చేసుకునేంత దగ్గరలో ఒక నల్లరాతి బండల అందమైన కొండ. పెద్దపెద్ద రాళ్ళ తరలింపులేమీ లేకుండా సులభంగా శత్రు దుర్భేద్యమైన నిర్మాణం చేసుకోగల చోటు.
పటిష్టమైన కోట నిర్మాణానికి అనుకోకుండా దొరికిన నిధి సాయం
[మార్చు]అప్పుడు ఓరుగల్లు ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలిస్తున్నారు. వెలుగుమట్ల అనే గ్రామంలో ముగ్గురు భూస్వామి రైతులు పొలం పనులు చేయిస్తుండగా వారికి అదృష్ట వశాత్తూ అపార సంపద దొరికింది. ఇలా పొలం పనుల్లో నిధిని సంపాదించిన ముగ్గురూ రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, వెల్మారెడ్డి ఈ సమాచారాన్ని కాకతీయ ప్రభువుకు తెలియజేసారు. సేద్యంలో దొరికిన ఈ అపార సంపదను మొత్తంగా తీసేసుకోవడం వల్ల వారిలో నిరాశవల్ల వ్యతిరేఖ భావన ఏర్పడుతుంది. లేదూ మొత్తం గా వాడేసుకొమ్మని వదిలేస్తే వృధాఖర్చులతో ప్రజలకు కంటగింపుగా మారే ప్రమాదం కూడా వుంది. అందేకే మహా మంత్రులతో మంతనాలైన పిదప ఈ ముగ్గురు రెడ్లకూ ఒక భాద్యతను అప్పగించి రాజహోదాను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని చేసారు. ధనం దొరకటమే కాదు. ఈ నిర్ణయం కూడా ఖమ్మం చరిత్రకు ఒక చెరిగిపోని మైలు రాయిగా మారింది. అప్పటికే బౌద్దంతో విరాజిల్లుతున్న రాచరిక కేంద్రం నేలకొండపల్లి ప్రాంతానికి దగ్గరలో వుండి, కాకతీయ సామ్రాజ్యానికి ముఖ ప్రాంతంలా వుంటూ, ప్రవహించే నది, జనాల మనసులను కలిపి వుంచే ఆధ్యాత్మిక కేంద్రం వున్న ఖమ్మం ప్రాంతంలో కోట నిర్మాణం అనువుగా వుంటుందని చెప్పారు. నరసింహస్వామి గుట్ట పక్కనే వున్న తమ ఆధినంలోని రాజు పరిపాలనలో వున్న ఖమ్మంరాతిగుట్టమీద ఈ ధనంతో చక్కటి కోట నిర్మాణం చేసి, వారి జీవితాలకూ, వారి పిల్ల పిల్ల తరాలకూ నిలబడిపోయే పేరు తీసుకువచ్చేలా ఈ ధనాన్ని ఖర్చుపెట్టమనే నిర్ణయాన్ని కాకతీయ ప్రభువు చెప్పారు.
ఈ ముగ్గురు సోదరులు మహారాజు ఆదేశాను సారం నిధిరూపంలో దొరికిన సంపదసాయంతో తమ స్వీయ పర్యవేక్షణలో 950 లో కోట కట్టడం ప్రారంభించారు. మొదట్లో వీరు నిర్మాణం చేసింది సాధారణ మట్టికోట. అయినా సరే సహజంగా ధృఢంగా నిలబడిన రాతి దేహంతో అప్పడైనా ఎంతో శౌర్యప్రతాపాలున్న వీరుడిలాగానే ఈ కోట కనిపించేది.
ఈ ముగ్గురిలో లక్ష్మరెడ్డి తన ప్రత్యేకమైన శ్రద్దతో కోట పక్కనే ఒక తటాకాన్ని తవ్విచాడు లక్ష్యారెడ్డి చెరువే కాలక్రమాన లకారం చెరువుగా మారివుంటుంది. ఖమ్మం ప్రాంత వాసులు ఈ కోనేరు నీటినే పైపుల ద్వారా మళ్లించుకుని తాగు నీటిని పొందేవారు. నగరానికి జీవాన్ని జవసత్వాలనూ ఇచ్చేందుకూ ఈ కృత్రిమ తటాకం మునేరుకు కొంచెం దూరంగా వున్న ఖిల్లాప్రాంతంలో జనజీవనానికి సౌకర్యాన్ని కల్పించింది. కోటకు సంభందించిన సైన్యంతో పాటు వారి గజతురగాలన్నీ దాహార్తిని తీర్చుకునేందుకు ఇది సమాయకారి అయ్యింది.
997 లొ పరాక్రమవంతులైన గజపతులతో పాటు ఖమ్మానికి వచ్చిన కొండాపురానికి చెందిన అక్కిరెడ్డి, అస్కారెడ్డిలకు తమ పూర్వీక వంశానికి చెందిన వారు నిర్మించిన కోటను మరింత సౌందర్యవంతంగా మరింత శక్తిసామర్ధ్యాలతోనూ నిలబడివుండేలా తయారు చేయాలనిపించింది. తోమ్మిదేళ్ళ పాటు నిరంతరంగా కోట నిర్మాణాన్ని కొనసాగించారు.
చట్టూ 60 ఫిరంగులను మోహరించిగల ప్రదేశాలు అక్కడ ఫిరంగి వేర్వేరు దిశల్లో తిప్పి శత్రువుకు ఎక్కుపెట్టే అవకాశం వుంటుంది. అంతే కాకుండా శత్రువుల ఆయుధాలతో క్రిందనుంచి ఈ ఫిరంగులను నాశనం చేయటం దాదాపు అసాధ్యం అనుకునే చోట్లో పెట్టారు.
పహారా మూలలు, పర్యవేక్షణ రంధ్రాలూ ఎంతో ముందు చూపుతో చేసినవి వున్నాయిక్కడ సాయుదులైన సైనికులు కోట మీదనుండి దూరప్రాంతం వరకూ తమ దృష్టిపరిధినుంచి తప్పించుకోకుండా గమనింపులో వుంచుకునేలా కోటచుట్టూ వున్న వివిధ పహారా మూలలు ఏ ఒక్క దిక్కునూ వదలకుండా మొత్తంగా 360 డిగ్రీలలో చుట్టూ గమనింపులో వుంచుకునేలా వున్నాయి. అంతేకాకుండా సాధారణంగా 45 డిగ్రిలు లేదా క్రింది ప్రాంతం గమనించేందుకు కావలసినంత అనుకూలమైన కోణంలోనూ గోడల్లో అనేక చోట్ల ఈ పర్యవేక్షణ రంధ్రాలున్నాయి వీటిద్వారా కోట క్రింద ఏం జరుగుతోంది అనే విషయాలను జాగ్రత్తగా గమనించే అవకాశం వుంది.అంతటి శ్రద్ధతో వీరు నిర్మించతలపెట్టిన గిరిదుర్గం క్రీస్తుశకం 1006 సంవత్సరం నాటికి నిర్మాణం పూర్తిచేసారు. నిధిదొరికించుకున్న పుణ్యఫలమో, శ్రధ్దాభక్తులతో నిర్మించిన ఫలితమో ఆ తర్వాత 300 సంవత్సరాల సుధీర్ఘకాలం పాటు రెడ్డి వంశీయుల పాలనలోనే ఖమ్మం ప్రాంతంతో పాటు ఈ గిరిదుర్గం కూడా వుంది. ఆ తర్వాత శౌర్యమున్న వానిదే రాజ్యమన్న సూత్రంతోనే వెలమ రాజులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. . నిర్మాణానంతర అనేక సొబగులను రెడ్డిరాజుల తర్వాత వెలమరాజులు అద్ది ఈ కోటను మరింత మెరుగు పరిచారట. ఆ తర్వాత నందవాణి, కాళ్ళూరు, గుడ్లూరు వంశాల చేతుల్లోకి వెళ్ళింది. కాకతీయులకు రెండో రాజధానిగా మొదట కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం ఖిల్లా తదనంతరం స్వతంత్ర మండలి రాజ్యంగా రూపొందింది. కాకతీయుల సామ్రాజ్యం నశించిపోయిన తర్వాత తెలుగునేలను ఏకం చేయాలనే లక్ష్యంతో 74 మంది సామంతరాజులు ఏకమై ఖమ్మం సమీపంలో ఉన్న మూసురూలి నాయకత్వంలో పదేళ్లపాటు విరోచితంగా పోరాటం జరిపారు. ఓడ్ర గజపతిరాజు ఈ దుర్గాన్ని జయించి 1424లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం మహేంద్ర వీరులైన కాపా నాయుడు, పోలా నాయుడు దీనిని పాలిం చారు.
షితాబ్ ఖాన్ అనే బిరుదు గల సీతా పతిరాజు క్రీ.శ 15 వశతాబ్దంలో ఈ కోటకు అధిపతిగా ఉన్నా డు. అనంతరం సీతాపతి కాలంలో ఖమ్మం ఖిల్లా తెలంగాణ ముఖ్యకేంద్రం అయింది. సీతాపతి బహమని సుల్తానుల సహాయంతో వరంగల్‌కు రాజప్రతినిధిగా ఎన్నికయ్యాడు. సీతాపతిరాజుకు మంత్రిగా పెద్దామాత్యుడు పనిచేసారట. పెద్దయ్యమాత్యుని సహాయంతో తెలంగాణలో తిరిగి తెలుగు సామ్రాజ్యం విస్తరింపచేశారు.
"గోల్కొండ సీమ కావ్యాలు"లో - "చిత్తాబ్జ ఖానుడు..అనే పదం వుంది అదేమిటంటూ పరిశోదించి అది మరెవరో కాదు చితాబ్ ఖాన్ అనే నామాంతరం కల సీతాపతిరాజే నని శ్రీ ఆదిరాజు వీరభద్రరావు గారు తన పరిశోధనలో తేల్చారు.
కాకతీయ సామ్రాజ్యం పతనమైన తరువాత రెండుశతాబ్దాలకు ఒక కోయ వీరుడు సీతాపతిరాజు - మహమ్మదీయులు అతని మతం మార్చి ‘షితాబుఖాన్’ అనే పేరు పెట్టారు- ‘జీర్ణ కాకతీయ రాజ్యస్థాపనాచార్య’ అనే బిరుదంతో వరంగల్‌ను పాలించి గొల్కోండ నవాబ్ కులీని గడగడలాడించాడు. ఖమ్మంమెట్టు, బెల్లంకొడ దుర్గాలను అతని నుండి లాక్కునేసరికి నవాబ్ కులికీ చావు తప్పి కన్నులొట్టపోయంది. సీతాపతిరాజు, ఓరుగల్లును కోల్పోయిన తరువాత, గజపతుల అధీనంలోగల కొండపల్లి కోటకు వచ్చి గజపతి విద్యాధరదేవ్ కుమారుడు, దుర్గ్ధాపతి రామచంద్రదేవ్‌ను నవాబుతో యుద్ధానికి సిద్ధం చేశాడు. కాని వారు ఓడిపోయి సంధి కుదుర్చుకున్నారు. ఈ సమయంలోనే కృష్ణదేవరాయలు దండెత్తివచ్చారు. గజపతుల ప్రతినిధిగా అతనితో తలపడి ఏలూరువద్ద సీతాపతిరాజు వీరమరణం పొందాడని ‘రాయవాచకం’ అని శౌర్యాన్ని కీర్తిస్తున్నది. కృష్ణాజిల్లా మాన్యుయల్ (1883) పన్నెండువేల విలుకాండ్ల బలానికి నాయకుడుగా సీతాపతిరాజును పేర్కొంటూ అతని పోరాటాలను అనేక సార్లు ప్రస్తావించింది.
సుల్తాన్ కులీకుత్బూల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్‌ఖాన్ (సీతాపతిరాజు)ను ఓడించి ఖమ్మంకోటను స్వాధీనం చేసుకున్నాడు.
క్రీ.శ. 1504 నుంచి 1512వరకు ఓరుగల్లును పాలించిన షితాబుఖాన్ అనే సీతాపతి రాజు మహ్మదీయుల కంటపడి విధ్వంసం కాకుండా కాపాడి భూమిలో పూడ్పించిన 8అడుగుల శివ, విష్ణువు ద్వారపాలకుల విగ్రహాలు, రాజనర్తకి, సూర్య భగవాన్‌ల విగ్రహాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిని పురావస్తు శాఖ వారు గణపేశ్వరాలయ ప్రాంగణంలోని హరిత హోటల్ ముందు భద్రపర్చారు. పరిపాలన సౌలభ్యం కోసం ఖమ్మాన్ని తమ సామ్రాజ్యానికి రెండో రాజధానిగా చేసుకున్నారు. ఈ సమయంలో కులీకుతుబ్‌షాహీ ఓటమి పాలైనా సీతాపతి ఖమ్మాన్ని కేంద్రంగా చేసుకుని ఈప్రాంతానికి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఇక్కడ కూడా దండెత్తి ఇక్కడి ధనరాసులను గోల్కొండకు తరలించారు.
శకసంవత్సరం 1425 అంటే క్రీస్తుశకం 1503 నాటి ఓరుగల్లు శాసనం ప్రకారం ఖమ్మంకోటను పాలించిన వారిలో మరికొంత విశేషంగా చెప్పుకోవలసిన మహావీరుడైన సీతాపతి రాజు గురించి కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈయన నాగవంశానికి చెందిన భోగికులానికి చెందిన వాడట. తన భుజబల పరాక్రమాలతోనూ, బుద్ధికుశలతతోనూ మహ్మదీయులనుంచి ఏకశిలా నగరాన్ని స్వాధీన పరచుకుని హిందూ రాజ్య సముద్ధరణ తన ధ్యేయంగా పనిచేశాడు. ఓరుగల్లు లోని పాంచాలరాయ దేవాలయమును పునరుద్ధరించింది కూడా ఇతడే. కానీ అతని బలం కోటను తన ధ్యేయాన్ని నిలబెట్టేందుకు చాలకపోయింది. సీతాపతి రాజు షితాబ్ ఖాన్ ముసుగుతో చెప్పుకోబడుతూ తనకు సాధ్యమయినంత మేర శిల్పసంపదనూ, వారసత్వ ప్రతీకలనూ భద్రపరిచేందుకు ప్రయత్నించాడు.
సాధ్యమయినంత చోటును గెలుచుకుంటూ వెళ్ళాలనే కంకణం కట్టుకున్న సుల్తాన్ కులీకుత్భుల్ ముల్క్ 1531 లో సీతాపతి రాజును ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకున్నాడు. దానితో ఈ దుర్గం కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్ళిపోయింది. హిందుమతపరమైన చిహ్నాలనూ ఆధారాలనూ సహజంగానే తొలగించివేస్తారు కాబట్టి ఆతర్వాత ముస్లింపద్దతుల్లోకి కోట స్థూలరూపం మార్చబడింది. ఆ తర్వాత కూడా 17 వ శతాబ్ధంలొ ఇది అసఫ్ జాహీల పాలనలోకి వచ్చింది. ఒక కొండ పైన ఠీవిగా వుండే ఈ కోట అటు సాహసానికి, ఇటు వివిధ నిర్మాణ శైలుల మిశ్రమానికి ప్రతీక. ఈ ప్రాంతాన్ని వివిధ మతాలకు చెందిన వివిధ రాజవంశీకులు పరిపాలించిన౦దు వల్లనే ఈ మిశ్రమ శైలి ఏర్పడింది ఇదీ ఒక ప్రత్యకతేనేమో.
క్రీ.శ. 1615లో శ్రీకష్ణదేవరాయలు కులీకుతుబ్‌షాహీని ఓడించి ఖమ్మం దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆంధ్రభోజుడు శ్రీకష్ణదేవరాయలు తన దిగ్విజయయాత్రలో భాగంగా దీనిని కూడా జయించారట గజపతుల నుంచి 1615లో దీనిని స్వాధీనపరచుకున్నారు. ముక్కు తిమ్మన రచించిన పారిజాతాపహరణము లో కృతిపతి కృష్ణదేవరాయల శౌర్య ప్రతాపములు వర్ణించే సందర్భంలో ‘‘గంబంబుమెట్ట గ్రక్కనఁ గదల్చె’’ అని పారిజాతాపహరణం ప్రబంధంలో వర్ణించడం సాహిత్యపూర్వక ఆధారంగా ఈ విషయాన్ని దృవీకరిస్తోంది.
అబుల్ హసన్ తానీషా కాలంలో 21 సర్కారులు (ఇప్పటి జిల్లాల లాగా) ఉండేవి వాటికింద 356 పరగణాలు ఉండేవి. తరు వాత నైజం పాలనలో రావటంతో పరిపాలన సౌలభ్యం కోసం 21 సర్కారులను 40 సర్కారులుగా విభజించాడు. వాటిలో ఖమ్మం, వరంగల్ సర్కారులు ఉన్నాయి.
► 1687 వరకు ఐదుగురు నవాబు ఖమ్మంగిరిని పాలించినట్టు చెబుతారు. వారిలో ఆఖరివాడు అబ్దుల్ హసన్ కుతుబ్‌షా. 1658-1687 వరకు పాలించాడు. ఈయనను తానీషా అని పిలుస్తారు.
► 1687 ప్రాంతంలో గోల్కొండపై దండెత్తిన ఔరంగజేబు ఈ దుర్గాన్ని వశపర్చుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అటు తర్వాత నిజాం ఏలుబడిలో ఖమ్మం ఖిల్లా కొనసాగింది.
► 1722లో ఈ ప్రాంత సుబేదారు నిజాం ముల్కీ అసల్‌జీ అనే వ్యక్తి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు.
► 1761 నుంచి 1803 వరకు జాఫర్‌దౌల్ అనే తహసీల్దార్ పర్యవేక్షణలో ఖమ్మం ఖిల్లా కొనసాగింది. ఇతనికాలంలో ఖమ్మం ఖిల్లా మరింతగా ఆధునీకరించారు. అభివద్ధి కూడా జరిగింది.
► 1768లో రెండో జాఫర్‌దౌలా తహసీల్దార్‌గా నియమితుడయ్యాడు. ఈయన అన్న పేరుతోనే ధంసలాపురం గ్రామాన్ని స్థాపించారు.
► 1800 సంవత్సరం నాటి తెలంగాణ అధికారుల పరిపాలన కొనసాగిన ఈ ఖిల్లాను 1937లో నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
నైజాం కాలంలో రాజ్య పునర్విభజనలో వరంగల్, కరీంగనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలిపి సుభా ఏర్పాటు చేశారు. దానికి కేంద్రంగా వరంగల్‌ను ఉంచారు. దానిలోనే ఖమ్మం జిల్లాను విలీనం చేశారు. దీంతో ఖమ్మం తన సుభా స్థాయిని కోల్పోయి కొంతకాలం తాలూకా కేంద్రంగా మారింది
గోల్కొండ నవాబుల రాజ్యంలో అంతర్భాగమైన ఖమ్మం 1905 వరకు జిల్లాకేంద్రంగా ఉంది. నిజాం పాలకులు తమ పరిపాలనా సౌలభ్యం మేరకు ఓరుగల్లును జిల్లా కేంద్రంగా చేసుకున్నారు[10].
1901వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వం ఐదువేల జనాభాను "పబ్లిసిస్ సపై"గా ప్రకటించింది.వీటిపై స్థానిక నిధి కమిటీకి అన్ని అధికారాలు ఉన్నాయి.కలెక్టర్ ప్రెసిడెంట్ నామినేట్ చేసిన కమిటీ దీని కోసం పనిచేసింది.
1905 దాకా వరంగల్ జిల్లలో భాగంగా ఉండేది, 1948 లో హైదరాబాద్ రాజ్యం మీద భారత ప్రభుత్వం పోలీసు చర్య జరిపేంత వరకు ఈ పట్టణం ఎక్కువ శాతం జాగీరుల పాలనలో ఉన్నది,1952 లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి అప్పటి ఖమ్మం జనాభా 28 వేలు. 1953 ఖమ్మం పట్టణ కేంద్రంగా ఖమ్మం జిల్లా ఏర్పాటు అయింది.
ఖమ్మం ఊరి మధ్యలో స్తంభాద్రి నుంచే మండపాలకు, స్థంబాలకు కావలసిన రాళ్ళు తరలిస్తూ ఉండేవారు, అందుకే దీనికి స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉన్నది . చరిత్రకారుల కథన౦ ప్రకార౦ ఖమ్మ౦ అనే పేరు అదే పట్టణమ౦దు కల నృసి౦హాద్రి అని పిలువబడే నారసి౦హాలయమును౦డి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థ౦భ శిఖరిగాను ఆపై స్థ౦బాధ్రిగా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దూ భాషలో క౦బ అనగా రాతి స్థ౦భము కావున ఖమ్మ౦ అను పేరు ఆ ఫట్టణము న౦దు కల రాతి శిఖరము ను౦డి వచ్చినట్టుగా మరొక వాదన. నిజాం స్టేటు 1870 రైల్వే మ్యాపు ప్రకారం ఈ పట్టణం ఖమ్మంమెట్ట్ గా పేర్కొనబడినది .[18]
చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.
భౌగోళికం
[మార్చు]ఖమ్మం భౌగౌళికంగా 17.25° ఉ 80.15° తూలో ఉంది. దీనికి ఉత్తరంగా ఛత్తీస్ ఘఢ్, ఒడిశా ఈశాన్యం గా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు తూర్పు గా, వరంగల్ జిల్లా దక్షిణంగా ఉంది. దీని వైశాల్యం 16, 029 చదరపు కిలోమీటర్లు. ఈ పట్టణం కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది ఒడ్డున విస్తరించి యున్నది. ఈ జిల్లాలో అధిక విస్తీర్ణం అడవులు వ్యాపించి యున్నవి. ఈ జిల్లాకు 1982 వరకు సాగు నీటి వసతి లేదు. జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉండగా సాగర్ నీరు లభించింది.
ఖమ్మం జిల్లాలోని నేల ఎక్కువగా గోదావరి నదికి దక్షిణాన ఇసుక నేలలు, మధిర మండలంలో నల్లమట్టి, గోదావరి నదిని ఆనుకుని ఉన్న ప్రాంతాలు గోదావరి డెల్టా భూముల వలె సారవంతమైనవిగా ఉన్నాయి. జిల్లాలో ప్రధాన నేల చలక (43%), దుబ్బ (28%), నల్లమట్టి (29%). అటవీ సంపదలో ప్రధానంగా టేకు, నల్లమద్ది, చంద్ర, వెదురు ఉన్నాయి. జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 4% అటవీ విస్తీర్ణంలో, మొత్తం అటవీ విస్తీర్ణం 7,59,438 హెక్టార్లు. జిల్లాలోని వృక్షలలో కలప, సాఫ్ట్ వుడ్, ఇంధనం, వెదురు పొదలు, వివిధ రకాల అటవీ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు ఇచ్చే అనేక ఇతర చిన్న అటవీ ఉత్పత్తులుగా స్థూలంగా వర్గీకరించవచ్చు. గోదావరికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు వన్యప్రాణుల భాండాగారాలు. జిల్లా అంతటా విషపూరితమైన, విషపూరితం కాని పాములు అనేకం కనిపిస్తాయి[19].
నైజాం పాలన 1948లో ముగిసిన తర్వాతహైదరాబాద్ రాష్ట్రంలో ఉండగానే 1953 అక్టోబరు 1న ఖమ్మం మెట్టు, మధిర, ఇల్లెందు, పాల్వంచ, బూర్గంపాడు తాలూకాలతో కలిసి ఖమ్మం మెట్టును జిల్లాగా ప్రకటించారు. కాలక్రమంలో ఖమ్మం మెట్టు పేరును ఖమ్మంగా మార్చుతూ గెజిట్ విడుదల చేశారు. 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఆవతరణ జరిగినప్పుడు జిల్లా హోదాలోనే ఖమ్మం ఉంది. 1959లో నాటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం, నూగురు తాలుకాలను ఖమ్మం జిల్లాలో కలిపారు. ఈ రెండు తాలూకా కలయికతో జిల్లా విస్తీర్ణం బాగా పెరిగింది. మొదట ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మధిర, ఇల్లెందు, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం, మణుగూరు తాలూకాలు ఉన్నాయి. మధిర తాలుకా విశాలమైనది కావడంతో దాని నుంచి సత్తుపల్లి ప్రాంతాన్ని వేరు చేసి కొత్తగా సత్తుపల్లి తాలుకాను ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలనకాలంలో మండల వ్యవస్థ ఏర్పడడంతో జిల్లాలోని తాలూకాలను 46 మండలాలుగా విభజించారు. ప్రస్తుతం జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 నాటి భారత జనాభా లెక్కలు ప్రకారం ఖమ్మం జనాభా (పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిపి) 3,13,504 గా ఉంది. ఇందులో పురుషులు 155,461 మంది కాగా, స్త్రీలు 158,043 మంది ఉన్నారు. సగటు 1000 మంది పురుషులకు 1017 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. ఖమ్మం పట్టణ జనాభా 250,182 కాగా, ఖమ్మం గ్రామీణ జనాభా 63,322 గా ఉంది. 0–6 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 32,172 మంది ఉన్నారు. వీరిలో 16,725 మంది బాలురు, 15,447 మంది బాలికలు ఉన్నారు. బాలల సగటు నిష్పత్తి 1000కి 924 గా ఉంది. సగటు అక్షరాస్యత రేటు 79.40% (7 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) 223,380 అక్షరాస్యులతో, గణనీయంగా ఉంది. రాష్ట్ర సగటు 67.41% కంటే ఎక్కువగా ఉంది.[20][21]
కలెక్టరేట్ నూతన భవన సముదాయం
[మార్చు]జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రంలో ఖమ్మం వైరా ప్రధాన రహదారి వెంకటాయపాలెం వద్ద 53.20 కోట్ల రూపాయలతో 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 100 అడుగుల ఫేసింగ్, 11 వందల అడుగుల లోతు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది.[22] 2023, జనవరి 18న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తోపాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రలు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తోపాటు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా కలిసి కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించారు. కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్ వీపీ గౌతమ్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[23][24]
ప్రభుత్వ వైద్య కళాశాల
[మార్చు]ఖమ్మం పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం 2023లో ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటుచేసింది. 8.5 కోట్ల రూపాయలతో పట్టణంలోని పాత కలెక్టరేట్ భవనాన్ని ఆధునీకరించి ప్రభుత్వ వైద్య కళాశాలగా మార్చారు. 2023 సెప్టెంబరు 14న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీష్ రావు, రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కలిసి వైద్య కళాశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు.[25] 2023 సెస్టెంబరు 15న ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించాడు.[26][27]
స్వాతంత్ర్యోద్యమం
[మార్చు]స్వాతంత్ర్య సంగ్రామంలో ఖమ్మం పట్టణంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు.
- 1915: మొట్టమొదటి ఇనుము, ఉక్కు దుకాణము స్వతంత్ర సమరయోధుడు తవిడిశెట్టి సాంబయ్య గారిచే స్థాపించబడినది
- 1931 - ఖమ్మంలో మొదటి స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది.
- 1935 - ఖమ్మం పట్టణంలో మొదటి గ్రంథాలయం స్థాపించబడింది.
- 1945 - ఖమ్మంలో 12 వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ సమావేశం పెండ్యాల సత్య నారాయణరావు ప్రధాన కార్యదర్శిగా, అహ్వాన సంఘం నిర్వహించారు. ఆ సమావేశంలో బద్దాం ఎల్లారెడ్డిని అధ్యక్షుడిగా, 13 వ రాష్ట్రం ఆంధ్ర మహాసభకు ఉపాధ్యక్షుడిగా పెండ్యాల సత్య నారాయణరావు ఎన్నికయ్యారు. ఈ సమావేశం మార్చి 26–28 తేదీలలో జరిగింది. ఈ సమావేశంలో పుచ్చలపల్లి సుందరయ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి దాదాపు 40,000 మంది హాజరయ్యారు.
- 1946 - 1946 ఆగస్ట్ 5 న మహాత్మా గాంధీ ఖమ్మం మెట్ (ఖమ్మం పట్టణం) సందర్శన,
- 1947 ఆగస్ట్, 7 - జమలాపురం కేశవరావు, కూరపాటి వెంకట రాజు, జగదీశ్వరయ్య నీలకందన్, బచ్చలకూర లక్ష్మయ్య, వట్టికొండ రామకోటయ్య, హీరాలాల్ మోరియా, తీగల హనుమంతరావు, కిలిపాక కిషన్‌రావు, గెల్ల కేశవరావు, యడవల్లి వేంకటేశ్వర శర్మ,
- పుల్లభట్ల వెంకటేశ్వర్లు (హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు), ఊటుకూరి కమల (స్వాతంత్ర్య సమరయోధురాలు - తెలంగాణ విమోచన)
సంస్కృతి
[మార్చు]శ్రీరామ భక్తుడు, కర్ణాటక సంగీత స్వరకర్త భక్త రామదాసు (కంచెర్ల గోపన్న)[28] పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం భక్త రామదాసు కళా క్షేత్రం[29] పేరుతో ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ థియేటర్ నిర్మించింది. లక్ష్మీ నరసింహ స్వామి ఈ దేవాలయం ఖమ్మం లో ఉన్నా గతిసెంటర్ఉన్నాదే , లక్ష్మి నరశిమస్వామి అక్కడ ఉన్న కుఠమీద విలేసాడు అని జనాలు నముతారు,నరశిమ సావ్మి ప్రతి రోజు పూజలు చేస్తారు ,అవి కాకుండా ప్రతి ఆదివారం స్వామి వరకు
వరదలు
[మార్చు]మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏటా ఖమ్మంలో అధిక వర్షపాతం నమోదవుతోంది. వర్షాకాలంలో వార్షిక వర్షపాతం 175 సెం.మీ. (60 అం.) గా ఉంటుంది. కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది వరదల కారణంగా ఖమ్మంలో చాలా ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 2007లో మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షంతో నదికి వరదలు వచ్చి బొక్కలగడ్డ ముంపునకు గురయింది. 2009లో వరదలు వచ్చినపుడు కూడా కొన్ని ముంపునకు గురయ్యాయి. ఖమ్మంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టోరేజీ కేంద్రాలు వరద బాధితుల కోసం ఎప్పటికప్పుడు ఆహారాన్ని అందించాయి .

1 సెప్టెంబర్ 2024 చుట్టపక్కల జిల్లాల్లో 22 సెం.మీ భారీ వర్షం కారణంగా గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా మున్నేరు వాగు పొంగి 15 అడుగుల మేర వరద ఉదృతి చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులను ముంపు గురిచేసింది [4] , లకారం చెరువులోకి వెళ్ళవలసిన బురద నీరు అక్రమాలకు లోనైనా నాలా ఆ వలన 6 అడుగుల మేర నీళ్లు జిల్లా కోర్ట్ ఆవరణ నుండి 2 కి మీ విస్త్రిర్ణం లో 3 రోజుల పాటు నిలిచి పోయాయి , కవిరాజ్ నగర్ , ఇల్లేందు క్రాస్ రోడ్డు , మమతా మెడికల్ కాలేజీ రోడ్డ్లు మరియు ఆయకట్ట కింద ఉన్న జనావాసాలతో పాటు మున్నేరు కి దగ్గరలో ఉన్న సారధీనగర్ , కరుణ గిరి , రాపర్త్రి నగర్ , మామిళ్ళ గూడెం కాలేనిలు నీట మునిగాయి .
పర్యాటక కేంద్రాలు
[మార్చు]ఇక్కడున్న ఖమ్మం కోట సా.శ. 950లో కాకతీయ రాజవంశంచే నిర్మించబడింది. లకారం సరస్సు మరొక పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇవి కాకుండా నగరం చుట్టూ భద్రాచలం, పర్ణశాల, నేలకొండపల్లి, కూసుమంచి వంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి.
- ఖమ్మం ఖిల్లా
- శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
- శ్రీ జలాంజనేయస్వామి ఆలయం
- లకారం చెరువు: ఈ చెరువుపై 11.75 కోట్ల రూపాయలతో నిర్మించిన కేబుల్ వంతెన, మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌లను 2022, జూన్ 11న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[30]
- దానవాయిగూడెం పార్కు
- తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం
- లకారం పార్క్/ట్యాంక్ బండ్
- కిన్నెరసాని వన్యప్రాణి ఆశ్రయం
- నేలకొండపల్లి
- పర్ణశాల
- స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
- తెలంగాణ అమరవీరుల స్థూపం
- గొరిల్లా పార్క్
- నర్సింహాద్రి ఆలయం
- అయ్యప్ప స్వామి ఆలయం
విద్యాసంస్థలు
[మార్చు]- శ్రీరామ, భక్త గెంటాల నారాయణరావు డిగ్రీ కళాశాల
- నామాయాబజార్ ప్రభుత్వం
- రుద్రాంపూర్ పాలీటెక్నిక్
ప్రముఖులు
[మార్చు]- హీరాలాల్ మోరియా (పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు)
- అభిరామ్ వర్మ (సినీ నటుడు,రచయిత)
- ముమ్మినేని సుధీర్ కుమార్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి[31][32]
- అడపా వరలక్ష్మీ: సామాజికవేత్త.
మార్పులు - మరికొన్ని అంశాలు
[మార్చు]- పర్యాటక దినోత్సవం సందర్భంగా ఖిల్లా పై రాక్ క్లైబింగ్ విన్యాసాలు నిర్వహిస్తారు.
- జాతీయ పండుగల నాడు ఖిల్లాపై అనేక ఉత్సవాలు నిర్వహిస్తారు.
- 2010లో శ్రీకృష్ణదేవరాయలు పంచశతాబ్ది పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా అప్పటి కలెక్టర్ రాయలవారి విగ్రహాన్ని ఖిల్లాపై ప్రతిష్టించారు. ఆ విగ్రహం కూడా నేడు శిథిలావస్థకు చేరింది.
- రేణుకా చౌదరి కేంద్రమంవూతిగా ఉన్నప్పుడు ఖిల్లాపైకి వెళ్ళేందుకు రేయిలింగ్ ఏర్పాటు చేసి మెట్లు చెక్కించారు.
- ఖిల్లాపై పర్యాటకులు సేద తీరాడానికి రెండు రేకుల షేడ్లు నిర్మించారు. ఆ తర్వాత వాటిని పట్టించుకపోవడంతో అవీ శిథిలావస్థకు చేరాయి.
- కోటకు ప్రధాన ఆకర్షణ ఫిరంగులు వాటిలో చాలా ఫిరంగులను కోటనుంచి దూరంచేసి ఖమ్మంలోని వివిధ ఆఫీసులకు తరలించారు. వుంచిన రెండు మూడు లోహ పిరంగులూ కేవలం మట్టిలో వదిలేసినట్లు పడేశారు.
- ఖమ్మం గుండా రెండు జాతీయ రహదారులు ఉండడం వల్ల రోడ్డు ప్రయాణం సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం, ఇతర నగరాల మధ్య అనేక బస్సులు నడుపుతుంది. 2023 కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి గ్రీన్ బెల్ట్ హైవే ని అనుసంధించింది దీని వలన హైద్రాబాద్ కు (220 కి . మీ .) ప్రయాణం కేవలం మూడున్నర గంటలలోనే చేరుకోవచ్చు.
ఈ క్రింది ప్రాంతాలు ఖమ్మం పురపాలక సంస్థచే అధికారికంగా గుర్తించబడిన నివాస, వాణిజ్య ప్రాంతాలు
[మార్చు].కవి రాజునగర్
.పడురంగాపురం
.బల్లేపల్లి
.శ్రీనివాసనగర్
|
|
|
|
|
పోడు పట్టాల పంపిణీ
[మార్చు]ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రం 2023, జూన్ 30న మధ్యాహ్నం 3:30 గంటలకు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలిసి గిరిజన రైతులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు.[33][34]
మూలాలు
[మార్చు]- ↑ "Basic Information". Official website of Khammam Municipal Corporation. Archived from the original on 11 February 2016. Retrieved 18 February 2016.
- ↑ 2.0 2.1 "Provisional Population Totals, Census of India 2011 Cities having population 1 lakh and above" (PDF). The Registrar General & Census Commissioner, India. Retrieved 7 July 2014.
- ↑ "District Codes". Government of Telangana Transport Department. Retrieved 4 September 2014.
- ↑ 4.0 4.1 "Khammam". Telangana state portal. Retrieved 15 June 2015. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "profile" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "Krishna District Mandals" (PDF). Census of India. p. 145. Retrieved 21 February 2016.
- ↑ Staff Reporter, . (20 October 2012). "Khammam Municipality upgraded". The Hindu (in Indian English).
{{cite news}}:|first=has numeric name (help) - ↑ "India peninsula N." www.davidrumsey.com (in ఇంగ్లీష్). Retrieved 2023-10-05.
- ↑ "India South, Burma, Malay Peninsula". www.davidrumsey.com (in ఇంగ్లీష్). Retrieved 2023-10-05.
- ↑ 10.0 10.1 ఖమ్మం పురపాలక సంఘ చరిత్ర 1952-1988 (PDF). ఖమ్మం: ఖమ్మం పురపాలక సంఘం. 1988. pp. 1, 8.
- ↑ Andhra Pradesh Magazine Volume 1 Issue 1. Dept of Information and PR of Andhra Pradesh. 1956. p. 6.
{{cite book}}:|archive-url=requires|url=(help) - ↑ A Descriptive and Historical Account in the Godavari District in the Presidency of Madras, H. Morris, 1878, London, p. 216
- ↑ A manual of the Kistna district in the presidency of Madras, Gordon Mackenzie, 1883, Madras, p. 25, 80
- ↑ Buddhist remains in Āndhra and the history of Āndhra between 224 & 610 A.D., K. R. Subramanian, p. 149
- ↑ A Handbook for India, Part I, Madras, John Murray, 1859, London
- ↑ The Geography of India, J. Burgess, 1871, London, p. 48
- ↑ The Church Missionary Intelligencer, Volume 2,1866, London, p. 73
- ↑ Nizam's Guaranteed State Railway 1870
- ↑ "History | Khammam District | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-18.
- ↑ "Provisional Population Totals, Census of India 2011 Cities having population 1 lakh and above" (PDF). The Registrar General & Census Commissioner, India. Retrieved 7 July 2014.
- ↑ "Literacy of AP (Census 2011)" (PDF). Official Portal of Andhra Pradesh Government. p. 43. Archived from the original (PDF) on 14 July 2014. Retrieved 5 September 2014.
- ↑ telugu, NT News (2023-01-18). "సమీకృత కలెక్టరేట్ ముస్తాబు". www.ntnews.com. Archived from the original on 2023-01-18. Retrieved 2023-01-18.
- ↑ telugu, NT News (2023-01-18). "ఖమ్మం కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రులు". www.ntnews.com. Archived from the original on 2023-01-18. Retrieved 2023-01-18.
- ↑ "Khammam: కలెక్టరేట్, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన నలుగురు సీఎంలు". Samayam Telugu. 2023-01-18. Archived from the original on 2023-01-18. Retrieved 2023-01-18.
- ↑ ABN (2023-09-15). "మెడికల్ కాలేజీల ఏర్పాటుతో చేరువగా వైద్య విద్య". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-09-25. Retrieved 2023-09-25.
- ↑ "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-25.
- ↑ telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం.. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-25.
- ↑ Kancherla Gopanna
- ↑ "Bhaktha Ramdas Kalakeshthram, Photo-India". Ugo.cn. Archived from the original on 2015-06-11. Retrieved 2013-11-17.
- ↑ telugu, NT News (2022-06-11). "లకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-06-11. Retrieved 2022-06-15.
- ↑ telugu, NT News (2022-02-02). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Namasthe Telangana. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
- ↑ "హైకోర్టుకు 12 మంది జడ్జీలు!". Sakshi. 2022-02-03. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
- ↑ "పోడు పట్టాలతో పది ప్రయోజనాలు". EENADU. 2023-07-01. Archived from the original on 2023-07-01. Retrieved 2023-07-10.
- ↑ ABN (2023-07-01). "గిరిజనుల ఏళ్లనాటి గోస తీర్చాం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-06-30. Retrieved 2023-07-10.