Jump to content

శ్రీరామ, భక్త గెంటాల నారాయణరావు డిగ్రీ కళాశాల

వికీపీడియా నుండి

యస్సార్ అండ్ బిజియన్నార్ డిగ్రీ కళాశాలగా వాడుకలో తెలిసిన తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల, జిల్లాలో తొలి డిగ్రీ కళాశాల ఇది. కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుభందంగా డిగ్రీ పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను ఇక్కడ అందిస్తున్నారు.

శ్రీరామ భక్త గెంటాల నారాయణ రావు డిగ్రీ కళాశాల
యస్సార్ అండ్ బిజియన్నార్ కళాశాల
నినాదంవిద్యకై ప్రవేశించండి సేవకై తిరిగెళ్ళండి
స్థాపితం1956 (1956)
విద్యాసంబంధ అనుబంధం
కాకతీయ విశ్వవిద్యాలయం
చిరునామYellandu X Road, Khammam, Telangana - 507002, ఖమ్మం, తెలంగాణ, 507002, భారతదేశం
17°15′15″N 80°09′38″E / 17.2542434°N 80.1605113°E / 17.2542434; 80.1605113
కాంపస్Urban
శ్రీరామ, భక్త గెంటాల నారాయణరావు డిగ్రీ కళాశాల is located in Telangana
శ్రీరామ, భక్త గెంటాల నారాయణరావు డిగ్రీ కళాశాల
Location in Telangana
శ్రీరామ, భక్త గెంటాల నారాయణరావు డిగ్రీ కళాశాల is located in India
శ్రీరామ, భక్త గెంటాల నారాయణరావు డిగ్రీ కళాశాల
శ్రీరామ, భక్త గెంటాల నారాయణరావు డిగ్రీ కళాశాల (India)

కళాశాల చరిత్ర

[మార్చు]

ఖమ్మం పట్టణంలో మొట్ట మొదటి ప్రయివేట్ కళాశాలగా ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలను స్థాపించారు. నిజాం సంస్థానం నుంచి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంలో, ఒకప్పుడు, ఒక్క హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా కళాశాలలు లేవు. దరిమిలా, ఒకనాటి వరంగల్‌ జిల్లాలో అంతర్భాగంగా వున్న ఖమ్మం, అక్టోబర్‌ 1, 1953న కొత్త జిల్లాగా ఏర్పాటైంది. ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు, ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కళాశాలన్నా వుండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ జీ వీ భట్, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, ఖమ్మానికి చెందిన కొందరు ముఖ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. స్వర్గీయులు బొమ్మకంటి సత్యనారాయణరావు, సర్వదేవభట్ల నరసింహమూర్తి, పర్సా శ్రీనివాసరావు, కవుటూరి కృష్ణమూర్తి, రావులపాటి జానకి రామారావులతో ఏర్పాటైన ఆ కమిటీ, నిధుల సేకరణ మొదలెట్టారు. 1956 లో ఖమ్మం జిల్లా మొత్తానికి ప్రధానా గ్రాడ్యుయేషన్ ప్రదేశంగా స్థాపించబడినది. కళాశాల స్థాపనకు భూసేకరణకు నిర్మాణానికి నిధుల కొరత వుందని ప్రభుత్వం తెలిపింది. జిల్లాకు చెందిన కొందరు విద్యావంతులుఒక నిర్ణయం కొచ్చారు.వాళ్ళుఓసొల్యూషన్ కొచ్చారు.భద్రాచలం రామాలయం లోని బంగారు నగలు వేలం వేసి ఆసొమ్ముతో డిగ్రీ కళాశాల స్థాపించాలనుకున్నారు.ఆమేరకు పత్రిక లో బహిరంగ ప్రకటన వేశారు.దాని సారాంశం ఏమంటే జిల్లా విద్యాభివృద్ధికి డిగ్రీ కళాశాల అవసరం,కనుక భద్రాచలం లోని సీతమ్మ వారి నగలు వేలం వేయుటకు నిర్ణయించాము అన్నారు. కానీ ఖమ్మం పట్టణంలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు అధ్యక్షుడుగా, శ్రీ కవి రాజమూర్తి అనే పేరుగల సర్వదేవభ్ట్ల నరసింహ మూర్తి (యెస్.యన్.మూర్తి) ప్రధాన కార్యదర్శిగా ఏర్పడిన పేరెంట్స్ కమిటీ కృషితో తక్కెళ్ళపల్లి గ్రామం జగ్గయ్యపేటకృష్ణా జిల్లాకు చెందిన శ్రీ గెంటాల నారాయణ రావు, తన ఇష్ట దైవం పేరుతో తన పేరు కలిపి పెట్టె షరతు మీద తొలుత గుట్టలబాజార్ దాటిన తరువాత గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలో నెలకొల్పారు ఆ సమయంలోనే పెద్దలంతా కలిసి 600రూపాయలకు ఎకరంచొప్పున దాదాపు 70ఎకరాల భూమిని ఖమ్మంలో కొనుగోలుచేశారు. కళాశాలను ఆతర్వాత వైరా రోడ్ యెల్లాండు రహదారి చుట్టూ ఉన్న నా 200 ఎకరాల భూమిని ఖమ్మం లో డిగ్రీ కాలేజీ స్థాపనకు లక్షరూపాయల నిధులను ఇస్తాననే ప్రతిపాదనను శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు పేరెంట్స్ కమిటీలో ఆమోదించిన ఫలితంగా ఇల్లందు క్రాస్ రోడ్ లోనికి S.R & B.G.N.R COLLEGE ఏర్పాటు అయినదని చెబుతారు. తరువాత ఈ భూమి జిల్లా కోర్టు దాని క్వార్టర్స్, స్టేడియం, యూనివర్శిటీ పిజి కాలేజ్, మెడిసినల్ పార్క్ మొదలైన వాటి నిర్మాణానికి ఉపయోగించబడుతుంది. అదే జిల్లాలో మొదటి డిగ్రీ కాలేజీ. ఆ సమయంలో శ్రీ గెంటాల వారికి తన స్వగ్రామం గండ్రాయి లోనున్న తన భూమిని కాకిరాయి వ్యాపారంకు లీజ్ కు ఇవ్వటం వల్ల లక్షల రూపాయలు ఆర్ధికంగా కలసి వచ్చింది.

ప్రధానాచార్యుల కాల పట్టిక

[మార్చు]
  • ప్రస్తుతం డి వెంకటేశ్వర రెడ్డి

క్రీఢా ప్రాంగణం

[మార్చు]

సర్దార్ పటేల్ స్టేడియం నిర్మాణం కోసం కళాశాల క్యాంపస్ మైదానాన్ని ఇచ్చారు. ఈ మైదానం ప్రధాన ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహిస్తుంది. కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) కింద వివిధ నాయకత్వ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఓపెన్ జిమ్ నిర్వహిస్తున్నారు. వివిధ క్రీఢలలో శిక్షణ ఈతకొలను నిర్వహణ జిమ్నాజియం

నగర వాహ్యాళి కేంద్రం

[మార్చు]

కళాశాల క్రీడామైదానం అతి పెద్దదిగా వుండటంతో దాన్ని నగరంలోని వేలాది మంది ఉదయం సాయంత్రం నడకలకు వినియోగిస్తారు. వాకింగ్ క్లబ్బులను కూడా ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నారు.

ఆర్కియాలజీ ప్రాముఖ్యత

[మార్చు]

ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ఉన్న ప్రధాన మెగాలిథిక్ సైట్లతో పాటు డిగ్రీ కళాశాల ఆవరణలలో కూడా అత్యంత అరుదైన మెగాలిధికల్ సిస్ట్ బరియల్స్ బయటపడినవి. వీటి సంరక్షణతో పాటు జిల్లా మొత్తం సేకరించిన అనేక ఆర్కియాలాజికల్ వస్తువులతో ఒక మ్యూజియం ఇదే ఆవరణలో నిర్వహించేందుకు అనుమతులలో జాప్యం జరుగుతోంది. మెగాలిథిక్ కుండలను తవ్వటానికి పరిశోధనా బృందానికి హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కె.పి.రావు మార్గనిర్దేశం చేశారు. కళాశాలలో మెగాలిథికల్ సమాధులు వున్న చోటు రక్షిత కట్టడంగా గుర్తింప బడినది.

బహిరంగ వేదికలకు స్థానం

[మార్చు]

హెలీకాప్టరు దిగేందుకు అనువైన ప్రదేశంతో పాటు నగరపు నడిబొడ్డున వుండి విశాలమైన వేదికస్థలం ఉండటంతో అనేక ముఖ్య రాజకీయ రాజకీయేత బహిరంగ సభలకు ఇది కేంద్రం అయ్యింది. వాటిలో మచ్చుకు కొన్ని

  1. సంఖ్యా జాబితా అంశం

కళాశాల భూముల వివరాలు

[మార్చు]

ఖానాపురం హవేలి పరిధిలోని విలువైన ఈ భూమి 226 సర్వేనెంబర్‌లో 5 ఎకరాలు, 223 సర్వేనెంబర్‌లో 12 ఎకరాలు, 222లో 11 ఎకరాలు, 227లో 08 ఎకరాలు, 221లో 09 ఎకరాలు, 229లో08 ఎకరాలు, 228 లో 08 ఎకరాలు, 220లో 04 ఎకరాలు, 237లో 04ఎకరాలతో పాటు మొత్తం సుమారు 69.8 ఎకరాలు సేకరించారు. డిగ్రీకళాశాల నిర్మాణానికి గాను నారాయణరావు సహకారంతో సేకరించిన ఈ భూమిలోనే ప్రస్తుతం 4ఎకరాల్లో కోర్టు భవనాలు, సర్దార్‌పటేల్‌ స్టేడియానికిగాను సుమారు 10 ఎకరాలు, ఎన్‌ఎస్‌పీ భవనం, స్టేడియానికి మధ్యలో వెలుగు కార్యాలయం, రైతు బజారు, 2 ఎకరాల్లో కాడా ఎన్‌ఎస్‌పి భవనం తదితర నిర్మాణాలు చేపట్టారు. దీంతో సుమారు 70 ఎకరాల భూమి 38 ఎకరాలకు చేరింది.

వివాదాలు

[మార్చు]

విద్యాభివృద్ధికి ఇచ్చిన భూమి ఆక్రమణకు గురవుతున్న వైనాన్ని దాత దత్తపుత్రుడు గెంటాల వెంకటశేషగిరి శ్రీనివాసరావు అనేక సార్లు జిల్లా ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు విన్నవిస్తూనే ఉన్నాడు. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో అప్పటికే ఉత్తర భాగాన బైపాస్‌ రోడ్‌ నిర్మాణం జరిగింది. ఆ రహదారికింద దాదాపు 6ఎకరాల అత్యంత విలువైన భూమి పోయింది. దీందో దానంచేసిన భూమిని అన్యాక్రాంతం చేస్తున్నట్టు అప్పటికలెక్టర్‌, రెవెన్యూ అధికారులను సంప్రదించగా కళాశాల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటుచేయించారు. ఈ క్రమంలో బైపాస్‌కు అవతల ఉన్న స్థలాలు కబ్జాకు గురయ్యాయి.

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]