వేదిక
Jump to navigation
Jump to search
వేదిక | |
---|---|
![]() | |
జననం | వేదిక పూజా కుమార్ ఫిబ్రవరి 21, 1983 సోలాపూర్, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | నటి, ప్రచారకర్త |
క్రియాశీలక సంవత్సరాలు | 2006-ప్రస్తుతం |
వేదిక దక్షిణ భారత చలనచిత్ర నటి, ప్రచారకర్త. అర్జున్, జగపతి బాబు హీరోలుగా నటించిన తమిళ అనువాద సినిమా శివకాశి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది.[1]
జననం - విద్యాభ్యాసం[మార్చు]
వేదిక 1983, ఫిబ్రవరి 21న మహారాష్ట్ర లోని సోలాపూర్ లో జన్మించింది. ముంబై లో ప్రాధమిక విద్యను చదివిన వేదిక, లండన్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో యం.యస్.సి. పూర్తిచేసింది.[1]
సినీరంగ ప్రస్థానం[మార్చు]
కథక్, భరతనాట్యం నేర్చుకున్న వేదిక, కళాశాలలో చదువుకునే రోజుల్లోనే ఒక వీడియో ఆల్బం చేసింది. ఆ ఆల్బం ద్వారా మొదటగా తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. శివకాశి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమయింది. ఆ తరువాత ముని, విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా మొదలైన తెలుగు చిత్రాలలో నటించింది.
నటించిన చిత్రాల జాబితా[మార్చు]
సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2006 | మద్రాసి | అంజలి | తమిళం | |
2007 | ముని | ప్రియా | ||
విజయదశమి | దేవి | తెలుగు | ||
2008 | కాలై | బృందా | తమిళం | |
సక్కరకట్టి | రిమా | |||
సంగమ | లక్ష్మీ | కన్నడ | ||
2009 | మలై మలై | అంజలి | తమిళం | |
బాణం | సుబ్బలక్ష్మీ | తెలుగు | ||
2011 | దగ్గరగా దూరంగా | మీనాక్షి | ||
2013 | పరదేశి | అంగమ్మ | తమిళం | |
శ్రీంగరవేలన్ | రాధ | మలయాళం | ||
2014 | కావియా తలైవన్ | గనకొకిలమ్ వడివంబల్ | తమిళం | |
కజిన్స్ | ఆరుతి | మలయాళం | ||
2016 | శివలింగ | సత్యభామ (సత్య) | కన్నడ | |
జేమ్స్ & ఏలీస్ | ఏలీస్ | మలయాళం | ||
వెల్ కం టూ సెంట్రల్ జైల్ | రాధిక | |||
2017 | గౌడ్రు హోటల్ | కన్నడ | ||
తరంగం | పూజ పద్మనాభన్ | మళయాళం | ||
2019 | కాంచనా 3 | ప్రియ | తమిళం | |
ది బాడి | రీతూ | హిందీ | ||
రూలర్[2] | సంధ్య | తెలుగు | ||
2020 | హొం మినిస్టర్ | కన్నడ | చిత్రీకరణ | |
వినోదం | తమిళం
మళయాళం |
చిత్రీకరణ |
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "వేదిక , Vedhika". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 4 June 2017. Check date values in:
|archive-date=
(help) - ↑ "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Retrieved 7 November 2019.