కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్పస్ క్రిస్టి కాలేజ్, ఇంగ్లాండులోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యొక్క కళాశాలలలో ఒకటి.

కళాశాల (కాలేజ్) అనగా కళను అభ్యసించే శాల. ఇక్కడ విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యను పొందుతారు. సాధారణంగా ఉన్నతపాఠశాల విద్య తరువాత అనగా పదవతరగతి తరువాత విద్యార్థులు పై చదువులను కళాశాలలో అభ్యసిస్తారు. ఇంటర్మీడియట్ అనగా పదకొండు, పన్నెండు తరగతులు. ఇంటర్మీడియట్ విద్యను బోధించే విద్యాలయమును జూనియర్ కళాశాల లేదా జూనియర్ కాలేజీ అని అంటారు. జూనియర్ కళాశాలలో విద్య పూర్తయిన తరువాత ఉన్నత విద్య కోసం తరువాత చదివే విద్యాలయమును డిగ్రీ కళాశాల అంటారు. డిగ్రీ చదువులో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అనే చదువుల డిగ్రీలు ఉన్నాయి. సాధారణంగా కళాశాలలు విశ్వవిద్యాలయముల ఆధ్యర్యంలో పనిచేస్తాయి. కళాశాలలు ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ రంగాలలో విద్యను అందించే విద్యా సంస్థలు.

ఇంజనీరింగ్ విద్యను బోధించే కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలలని, వైద్య విద్యను బోధించే కళాశాలను వైద్య కళాశాలలని, ఆర్థికశాస్త్రము, చరిత్రలను బోధించే కళాశాలలను ఆర్ట్స్ కళాశాలలని అంటారు.

కళాశాల అనేది ఒక రకమైన పాఠశాల లేదా విశ్వవిద్యాలయం, భవిష్యత్‌లో ఉద్యోగాల కోసం నైపుణ్యాలను నేర్చుకోవడానికి విద్యార్థులు వెళ్ళే ప్రదేశం. చాలా మంది కాలేజీ విద్యార్థులు హైస్కూల్ నుండే కాలేజీకి వెళతారు కాని కొందరు ఉన్నత విద్య తరువాత ఉద్యోగంలో చేరి మళ్ళీ కళాశాల చదువు ప్రారంభిస్తారు ఎందుకంటే ఇది ఎక్కువ డబ్బు సంపాదించడానికి, మంచి జీవితాలను గడపడానికి వారికి సహాయపడుతుంది.

విశ్వవిద్యాలయానికి సంబంధించి, కళాశాల సాధారణంగా విశ్వవిద్యాలయంలో ఒక భాగం, దీనికి సొంతంగా డిగ్రీలు ఇచ్చే అధికారం లేదు. డిగ్రీలు ఎల్లప్పుడూ విశ్వవిద్యాలయం చేత ఇవ్వబడతాయి, అయితే కళాశాలలు డిగ్రీలు పొందటానికి విద్యార్థులను సిద్ధం చేసే విద్యా సంస్థలు.

కళాశాల సిబ్బంది

[మార్చు]

జూనియర్ కళాశాల స్థాయిలో అధ్యాపకులుగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, లెక్చరర్‌లు ఉంటారు.

డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ప్రొపెసర్లు ఉంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కళాశాల&oldid=2934191" నుండి వెలికితీశారు