విద్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిండర్ గార్టెన్ తరగతి గది, ఆఫ్ఘనిస్తాన్.

విద్య అనగా బోధన, నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యాసనల సమీకరణం. ఇంకనూ విశాలమైన భావంలో, పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడం. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం, సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజకీయం జేయడం. విద్య అనగా,మానవునిలో దాగివున్న అంతర-జ్ఞానాన్ని వెలికి తీయడం. ప్రకృతి ప్రతి మానవునికీ అంతర-జ్ఞానాన్ని ప్రసాదించింది.దానికి సానబెట్టి వెలికి తీయడమే విద్య పని. విద్యారంగాలనేకం. మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, భాషాశాస్త్రం, సామాజిక శాస్త్రం మొదలగునవి.

విధానాలు

[మార్చు]
మానవ అభివృద్ధి రిపోర్టు 2007-2008 ల విద్యా సూచిక ప్రపంచ పటం చూపుతున్నది.

విద్యావిధానాలు, విద్య ,శిక్షణ లను ఇవ్వడానికి స్థాపించబడ్డాయి. ఇవి ప్రధానంగా పిల్లలు , యువకుల కొరకు స్థాపించబడ్డాయి. పిల్లలకు యువకులకు, పాఠ్యాంశాలను నిర్ణయించి భోదించటం, వారి విద్యాఫలితాలను, వారి జీవిత లక్ష్యాల కొరకు ప్రతిపాదింపబడుతాయి. వీటి వలన పిల్లలు, ఏమి నేర్చుకోవాలి?, ఎలా నేర్చుకోవాలి?, ఎందుకు నేర్చుకోవాలి? అనే ప్రశ్నలు సాధించుకొనేలా జాగ్రత్తలు తీసుకొని, వారికి విద్యా బోధన ఇవ్వబడుతుంది. బోధనా వృత్తి, ఇందుకు సర్వదా సహాయపడుతూ, పిల్లలలోని అన్ని రంగాల అభివృద్ధికొరకు సహాయపడుతూ, వారిని మంచి పౌరులుగా తీర్చి దిద్దడానికి ఎల్లవేళలా సిద్ధంగా వుంటుంది. ఈ బోధనా వృత్తి, విద్యా బోధన, బోధనాంశాలు, మూల్యాంకనము మొదలగు అంశాలపై ఆధారపడి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది.

విద్య ప్రాథమిక హక్కు

[మార్చు]

విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యా హక్కు చట్టం చేశారు[1] ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టాల తరహాలో ఇది అమలౌతుంది. 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వయసు పిల్లలు 92 లక్షల మంది పాఠశాల చదువులకు వెలుపలే ఉండిపోతున్నారు. పాఠశాలల్లో చేరని, లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. పాఠశాల నిర్వహణ కమిటీ, లేదా స్థానిక ప్రభుత్వం పాఠశాల చదువులకు దూరంగా ఉండిపోతున్న ఆరేళ్లపైబడిన బాలిబాలికలందరినీ గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇప్పించి, పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాల్సి ఉంటుంది. ఏ విద్యార్థికీ పాఠశాలలు అడ్మిషన్‌ను నిరాకరించటానికి వీల్లేదు. ప్రైవేటు పాఠశాలలు సైతం 25% సీట్లను బలహీన, పేద వర్గాలకు కేటాయించాలి.వారి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.నిధులను 55-45 నిష్పత్తిలో కేంద్రం రాష్ట్రాలు భరించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయిలో నియమ నిబంధనలు రూపొందించేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన , శిక్షణా సంస్థ కృషి చేస్తుంది.

ప్రాథమిక విద్య

[మార్చు]
బయలు ప్రదేశంలో ప్రాథమిక పాఠశాల. 1842 బుచారెస్ట్లో ఒక ఉపాధ్యాయుడు (ప్రీస్ట్) తరగతి నిర్వహించటం.

తెలుగు రాష్ట్రాలలో ఐదు సంవత్సరములు నిండిన పిల్లలకు ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం తప్పని సరి. ఈ పాఠశాలలలో ఒకటి నుండి ఐదు తరగతులకు విద్యాబోధన జరుగుతుంది. ఇందులో మాతృభాష (తెలుగు, ఉర్దూ, తమిళం, ఒరియా, కన్నడ లేదా ఇతరములు), రెండవ భాషగా మాతృ భాష లేదా ఇతర భాష, ఇంగ్లీషు, గణితము, పరిసర విజ్ఞానాలు నేర్పబడుతాయి. తెలుగు రాష్ట్రాలలో అనేక మాధ్యమాలలో ఈ విద్య అందజేయబడుచున్నది. ఉదాహరణకు, తెలుగు, ఆంగ్లము, ఉర్దూ, కన్నడము, తమిళము, ఒరియా, హిందీ, పంజాబీ, మరాఠీ మొదలగునవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలలో ప్రాథమిక విద్యా మాధ్యమంగా తెలుగు తొలగించి దాని స్థానంలో ఆంగ్లం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.[2]

మాధ్యమిక విద్య

[మార్చు]

సమకాలీన విద్యావిధానంలో, సెకండరీ విద్య, లేక మాధ్యమిక విద్య చాలా ప్రధానమైనది. ఉన్నత విద్యకు అసలైన పునాది ఇదే. మనదేశంలోని రాష్ట్రాలలో ఈ విద్యను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ , ఇంటర్మీడియట్ విద్యా మండలివారు నిర్వహిస్తుంటారు. పాఠశాలల నిర్వహణ , విద్యా సదుపాయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఉదాహరణకు జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్, , పురపాలక సంఘం, కలుగజేస్తాయి. జిల్లాలో విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో విద్యావిధానమంతా అమలు పరచ బడుతుంది. ఏ భోషామాధ్యమపాఠశాలయైనా, యే యాజమాన్య పాఠశాలయైనా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వస్తుంది. ఈ విద్యావిధానంలో ప్రధానమైనవి పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు.

ఉన్నత విద్య

[మార్చు]
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఒక ఉన్నత విద్యాకేంద్రం.

ఉన్నత విద్య ఉన్నత పాఠశాల విద్య తరువాత ప్రారంభమౌతుంది. మన దేశంలో విద్యా విధానం 10+2+3 విధానం. 10 అనగా సెకండరీ విద్య, 2 అనగా ఇంటర్మీడియట్ విద్య, 3 అనగా కాలేజి డిగ్రీ విద్య. కాలేజీ డిగ్రీని గ్రాడ్యుయేషన్ అని, దాని తరువాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అని వ్యవహరిస్తారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత రీసర్చ్ పోగ్రాంలు అయిన ఎం.ఫిల్. , పి.హెచ్.డీ. డిగ్రీలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నత విద్యాశ్రేణిలోకి వస్తాయి.

ఈ విద్యలన్నీ వివిధ రంగాలలో వుండవచ్చు. ఉదాహరణకు, కళలు, భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం, జీవశాస్త్రం, గణితం, వాణిజ్యం, బోధన, సామాజిక శాస్త్రం, మానసిక శాస్త్రం, ఫిలాసఫీ, భాషలు, కంప్యూటర్ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వైద్య శాస్త్రం, న్యాయశాస్త్రం, ఇంజినీరింగ్ , ఇతర రంగాలు.

వయోజన విద్య

[మార్చు]

వయోజనవిద్య అనేక దేశాలలో అవసరంగా మారింది. దీని కొరకు ప్రభుత్వాలు పాటు పడుతున్నాయి. సరైన సదుపాయాలు లేక, బాల్యంలో అభ్యసించలేక, పాఠశాల చదువును నోచుకోలేని వయోజనులకు, వారి తీరిక సమయాలలో అక్షరాభ్యాసం కల్పించడం, దీని ముఖ్యోద్దేశ్యం. ఈ వయోజన విద్య ఒక ప్రహసనంగా మారకుండా చూడడం ప్రతి పౌరుని విధి. సర్వ శిక్షా అభియాన్ అనే ఓ జాతీయ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అందరికీ విద్య కార్యక్రమాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్నాయి. నేషనల్ లిటరసీ మిషన్ లేదా జాతీయ అక్షరాస్యత మిషన్, ఈ కార్యక్రమాలన్నీ అనుసంధానిస్తుంది. 1990 దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు జిల్లాలలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టింది. చిత్తూరు జిల్లాలో అక్షర తపస్మాన్ అనేపేరు పెట్టి అక్షరాస్యతా కార్యక్రమాన్ని అమలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు ఇంకో పౌరుడికి విద్యనేర్పాలి.

విద్యా విధానాలు

[మార్చు]
నియత విద్య
- పరిణామక్రియ ఆధారంగా, శారీరక వయస్సు , మానసిక వయస్సు ల ఆధారంగా ఇవ్వబడు సాధారణ విద్యను నియత విద్య అంటారు. ఈ విద్య కొరకు విద్యార్థులు విద్యాకేంద్రాలకు వచ్చి అభ్యసిస్తారు. వీరికొరకు నిర్ధిష్టమైన విద్యాకార్యక్రమాలుంటాయి. అభ్యసనాంశాలు కర్రికులమ్, కాలపట్టికలు, బోధన, మూల్యాంకనం, పరీక్షలు, ఫలితాలు వుంటాయి. ఈ విద్య పూర్తికాలపు విద్య.
అనియత విద్య
- ఈ విద్య జీవిత కాలపు విద్య. శారీరక వయస్సు , మానసిక వయస్సులకు అతీతంగా వుంటుంది. ఈ విద్యకు మంచి ఉదాహరణ దూరవిద్య . ఈ విద్యనందించు విద్యాలయాకు మంచి ఉదాహరణ :

సార్వత్రిక పాఠశాల

[మార్చు]

ప్రత్యామ్నాయ విద్య

[మార్చు]

ప్రత్యామ్నాయ విద్య అన్ని విద్యావిధానాలకు అతీతంగా, ప్రత్యేకమైన విద్యావిధానాన్ని కలిగిన విద్యా విధానం. ఈ విధానం ముఖ్య ఉద్దేశం, పాఠశాలనుండి వైదొలగేవారిని తగ్గించడం. దీనికొరకు సార్వత్రిక పాఠశాల (ఓపెన్ స్కూల్స్) విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఓపెన్ స్కూల్స్ లో చదివిన బాలబాలికలకు నేరుగా సాధారణ విద్యావిధాన స్రవంతిలో తీసుకొచ్చి అక్షరాస్యత , విద్యను పెంపొందించడం, అసలైన ఉద్దేశం. ఇది చాలా మంచి ప్రయత్నం. మంచి ఫలితాలను కూడా ఇస్తున్నది.

బోధనాంశాలు

[మార్చు]

బోధనలో ముఖ్యమైనవి "బోధనాంశాలు" సహబోధానాంశాలు.

బోధనాంశాలు:భాష , శాస్త్రాల అభ్యసన.

భాషకు ఉదాహరణ: 1. మాతృభాష, 2. ప్రాంతీయ భాష, 3. జాతీయ భాష, ఈ భాషలను నేర్చుకోవడం ముఖ్యం, ఈ సూత్రాన్నే త్రిభాషా సూత్రం అంటారు. ఈ భాషలతోబాటు అదనంగా అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషును నేర్పడం అవసరం.శాస్త్రాలకు ఉదాహరణ: గణితం, పరిసరాల విజ్ఞానం, సామాజిక శాస్త్రాలు, వగైరా.సహ బోధనాంశాలు: శారీరక శ్రమలు, పోటీలు, కళలు , ఇతర మార్గాల ద్వారా వైయక్తిక నిర్మాణం.[3]

విధానము

[మార్చు]

అభ్యసనా పద్దతులు

[మార్చు]

ఈ అభ్యసనా పద్దతులన్నీ విద్యార్థులకు అవసరం.[4][5] వీటికి ఉదాహరణ:

  • కదలిక ప్రధానం : ఈ పద్దతిలో విద్యార్థి తన చేతులకు పనిచెప్పి నేర్చుకుంటాడు.
  • దృశ్య ప్రధానం : ఈ పద్దతిలో విద్యార్థి వీక్షించి, గమనించి, ఏమి జరుగుతున్నది?, ఎలా జరుగుతున్నది?, ఎందుకు జరుగుతున్నది?, ఎప్పుడు జరుగుతున్నది? మున్నగు ప్రశ్నలు వేసుకొని నేర్చుకుంటాడు.
  • శ్రవణ ప్రధానం : ఈ పద్దతిలో విద్యార్థి విని, విషయసంగ్రహణ చేసుకుని నేర్చుకుంటాడు.

ఉపాధ్యాయులకు బోధనా పద్దతులు అత్యవసరం. వీటికి ఉదాహరణ:

సాంకేతిక విజ్ఞానం

[మార్చు]

విద్యలో ప్రధానంగా ప్రభావితం చేసే విషయం సాంకేతిక విజ్ఞానం. విద్యాభ్యాసంలో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, అభివృద్ధి చెందిన దేశాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆన్-లైన్ విద్య ఓ రకంగా దూరవిద్య. ఈ విధానంలో అభ్యసన , అవగాహనల కొరకు ఓ ప్రత్యేక అనుకూల స్థితి కలుగుతుంది. ఇది చాలా లాభదాయకంగానూ నిరూపింపబడింది. దీని నష్టాలు కూడా నేటి ప్రపంచం గమనిస్తూవుంది. విద్యార్థులలో పాఠశాలల పట్ల అనాసక్తి, ఉపాధ్యాయుల పట్ల అనాదరణ, విద్యావిధానంపట్ల సరియైన పట్టు లేకుండాపోతున్నది. భౌతికంగా అభ్యసన జరుగుతున్నది కాని మానసికంగా విద్యాభ్యాసన జరగడంలేదు. విషయ సంగ్రహణ జరుగుతున్నది గాని, విషయ పరిజ్ఞానం పెంపొందింప బడడంలేదు. విద్యలో ఇదే కీలకం, ఇదియే లోపిస్తున్నది. అరిస్టాటిల్, సోక్రటీసు , ప్లేటో లాంటి మేధావులకు నేటి లోకం జన్మనివ్వలేక పోతున్నది.

చరిత్ర

[మార్చు]
బొలోనా విశ్వవిద్యాలయం ఇటలీ, ఓ ఊహాచిత్రం.

విద్య యొక్క చరిత్ర, ప్రాచీన కాలంనుండి మనకు లభిస్తున్నది. ప్రాచీన కాలంలో, పర్ణశాలలు, కుటీరాలు ఋషుల ఆశ్రమాలు, ఆశ్రమ కేంద్రాలు విద్యాభ్యాసం కొరకు కేంద్రాలుగా విలసిల్లేవి. ఈ కేంద్రాలలో సకల శాస్త్రాలూ బోధింపబడేవి. ఉదాహరణకు: ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, రాజనీతి, భాష, యుద్ధవిద్యలు, సంస్కృతి, చదరంగం, కుస్తీ, విలువిద్య, భూగోళం, జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రము మున్నగునవి నేర్పేవారు.

ఫిలాసఫీ

[మార్చు]

విద్య , తత్వము పరస్పర మూలాలు గలిగినవి. తత్వము "జ్ఞాన ఉద్దేశ్యము, ________ప్రకృతి విద్య , విద్య యొక్క ఆదర్శము. దీని ఉప ఉద్దేశ్యాలు, మనో తత్వము, మనోజ్ఞాన ప్రకృతి సిద్ధాంతం, , మానవ విషయాలు, సమస్యలూ , విద్యా-సమాజాల మధ్య సంబంధ బాంధవ్యాలు.

తత్వము యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు :

* జ్ఞాన సమపార్జన.
* జ్ఞాన సమపార్జనకొరకు ప్రకృతి సిద్ధాంతాలు.
* మానవ , సమాజ కళ్యాణం.

మానసిక శాస్త్రం

[మార్చు]
అమెరికాలోని ఒక తరగతి. ఇందులో తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల పిల్లలు వస్తారు.[6]

విద్యా మానసిక శాస్త్రం, నేటి విద్యావిధానంలో విద్యార్థులు ఎలా జ్ఞానం సంపాదిస్తారు అనేవిషయంపై చర్చిస్తుంది. విద్యాభ్యాసంలో పిల్లల మానసిక ప్రవృత్తులు, సమస్యలు, వైయుక్తిక భేదాలు, పరివర్తన, నడవడికలు మున్నగు వాటి గురించి చర్చిస్తుంది.

దీని ముఖ్య విషయాలు, పిల్లల మానసిక శాస్త్రము , సామాజిక మానసిక శాస్త్రము.

ఆర్థిక శాస్త్రం

[మార్చు]

ఓ సమాజం ఆర్థికంగా నిలదొక్కుకోగలగాలి, లేదా అభివృధ్ధి చెందాలి అంటే, విద్య అత్యవసరం. సిద్ధాంతాల ప్రకారం, అభివృద్ధిచెందిన దేశాల కంటే, పేద దేశాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతాయి. కారణం, అభివృద్ధి చెందిన దేశాలు ప్రయోగాత్మకంగా ఉపయోగించిన విధానాలు. కానీ కొందరు ఆర్థిక వేత్తలు దీన్ని అంగీకరించక ఇలా వాదిస్తారు, "అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతూనే వుంటాయి, వాటికున్న వనరులలాంటివి. పేద దేశాలు పేద దేశాలు గానే వుండి పోతాయి వాటికున్న వనరులలాంటివి", అని.

సామాజిక శాస్త్రం

[మార్చు]
రష్యాలో అకాడెమిక్ గ్రాడ్యుయేట్లు, ఇతర ఐరోపా దేశాల కంటే ఎక్కువ.

విద్యా సామాజిక శాస్త్రము ప్రకారం, సామాజిక విద్యా సంస్థలు , విద్యావిధానాలు , వాటి ఫలితాలు పరస్పరం ఆధారపడివుంటాయి. కాని సమాజానికి చెందిన బలహీనతలనుండి సమాజాన్ని రక్షించాలంటే, కేవలం విద్య మాత్రమే మార్గం. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం సమాజ నిర్మాణమే. గురజాడ అప్పారావు చెప్పినట్లు "దేశమంటే మట్టి కాదోయ్; దేశమంటే మనుషులోయ్", దేశం బాగుపడాలంటే పౌరులు లేదా మనుషులు బాగుపడాలి, అప్పుడే సమాజం బాగుపడుతుంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలు

[మార్చు]

అభివృద్ధి చెందుతున్న దేశాలలోని తీవ్ర సమస్యలలో ప్రధానమైనది నిరక్షరాస్యత. ఈ నిరక్షరాస్యతకు మూలం అవిద్య. దీన్ని రూపుమాపుటకు సరైన సాధనం , మార్గం 'విద్య'.

ప్రాపంచీకరణ

[మార్చు]

మనం ఈ రోజు అవలంబిస్తున్నవన్నీ ఐరోపా వాసుల విద్యావిధానాన్నే. విద్య, ఐరోపా , అమెరికా వాసులు ప్రవచించిందే విద్య అనే మూఢ విశ్వాసాలనుండి ప్రపంచం బయట పడాలి. ఆసియాకూడా విజ్ఞాన ఖని. అందులోనూ భారత్, చైనా , అరేబియా, విద్యా విజ్ఞానాలకు పుట్టినిల్లు. ప్రపంచానికి మన కాంట్రిబ్యూషన్ ఏపాటిది అని తెలియజేయాలంటే, మన పురాతన, జ్ఞాన సంపన్నుల గూర్చి శోధన అవసరం. నికోలస్ కోపర్నికస్ ప్రపంచానికంతటికీ తెలుసు కాని ఆర్యభట్ట మన దేశంలో మనవారిలో కొందరికే తెలుసు. దీనికి కారణం, మనవారందించిన విజ్ఞానాన్ని మనం ఇంకా శోధించి, పొడిగించి ప్రపంచానికి అందివ్వక పోవడమే.

ఇతర విషయాలు

[మార్చు]

విద్య పరమార్ధం విజ్ణానమే కాని ఉద్యోగం కాదు. అయితే నేడు దేశంలో విద్య యొక్క నిర్వచనం, పరమార్ధం మారిపోతున్నది. పూర్వం విద్యార్థులు విజ్ణాన సముపార్జన కోసం విద్యను అభ్యసించేవారు. నేటి విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం విద్యను అభ్యసిస్తున్నారు. ఇది బహు దురదృష్టకరము. మనిషి బ్రతుకడానికి వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం అను మూడు రకాలుగా ఉంది. విద్య వలన ఈ మూడింటినీ సమర్ధవంతంగా నిర్వర్తించవచ్చును. రైతులకు విద్య తోడైతే తమ వ్యవసాయ వృత్తిలో అధ్బుతంగా రాణించవచ్చును. పదిమందిలో దూసుకువెళ్ళిపోయి, ధైర్యం, స్వశక్తి మీద నమ్మకం ఉన్నవారు వ్యాపారం చేసుకొనేవారికి విద్య అండగా ఉంటుంది. ఇక ఉద్యోగం అనేది అతి హీన పరిస్థితుల్లో తినడానికి లోటు లేకుండా చేసుకొనే పనిగా చెప్పవచ్చు. అయితే నేటి అధ్యాపకులు తమ విద్యార్థులకు సమకాలీన సమాజ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కాకుండా కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నారు. దీని వలన దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. చదువుకి, సంపాదనకి సంబంధం లేదని, సంపాదనకి కావాల్సింది తెలివితేటలు, చదువు లేనివారు సైతం కోట్లు సంపాదిస్తున్నారు అని, పదిమందికీ జీతాలిచ్చే ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయినా కనీసం నెలజీతం తీసుకొనే దిగువస్థాయి అవకాశం విద్యవల్ల దక్కుతుంది అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గ్రహించవలసియున్నది.

పూర్తి వ్యాసం కొరకు ఉద్యోగం చూడండి.

ఆంధ్రప్రదేశ్ లో విద్య

[మార్చు]

ప్రధాన వ్యాసం: ఆంధ్రప్రదేశ్ లో విద్య

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "రాష్ట్ర విద్యా పరిశోధన , శిక్షణా సంస్థ విద్యా హక్కు పేజి". Archived from the original on 2010-04-18. Retrieved 2010-05-01.
  2. "పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్". NTVnews. 2019-12-11. Archived from the original on 2019-12-14.
  3. "Examples of subjects..." Archived from the original on 2008-08-21. Retrieved 2008-04-17.
  4. "Dunn and Dunn". Archived from the original on 2009-02-03. Retrieved 2008-04-17.
  5. Biographer of Renzulli
  6. Finn, J. D., Gerber, S. B., Boyd-Zaharias, J. (2005). Small classes in the early grades, academic achievement, and graduating from high school. Journal of Educational Psychology, 97, 214-233.

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
Education గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

"https://te.wikipedia.org/w/index.php?title=విద్య&oldid=4315918" నుండి వెలికితీశారు