ఇంటర్వ్యూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉద్యోగం కోసం జరుగుతున్న ఇంటర్వ్యూ

ఇంటర్వ్యూ అనగా ప్రశ్న సమాధానాల ద్వారా సమాచారాన్ని సేకరించటం. ఇలా సేకరించిన సమాచారాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. పత్రికలు, దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రజలకి తెలియచేయడం, విద్య, ఉపాధి అవకాశాలకి అర్హతని నిర్ణయించడం లాంటివి వీటిలో ముఖ్యమైనవి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని మదింపు చేస్తారు. అంటే పరిశీలనా శక్తిని, తెలివితేటలను, లౌక్యాన్ని, వాస్తవ దృష్టిని, నిర్ణయనిష్పాక్షితను, నేర్చుకోవాలనే ప్రేరణా శక్తిని, జట్టులో పని చేసే సమర్ధత, అలోచనా శక్తి, ముక్కుసూటి తనం, గోప్యత, నీతి నిజాయితీ, సమయపాలన, క్రమశిక్షణ లాంటి మనిషి నడవడికకి సంబందించిన వివిధ లక్షణాలని అంచనా వేయడం. మిగతా వ్యాసంలో విద్య, ఉపాధి అవకాశాల ఇంటర్వ్యూలో విజయం కోసం అభ్యర్థులు తయారవటానికి సూచనలు పరీశీలిద్దాం.[1]

ఇంటర్వ్యూకి తయారి[మార్చు]

భౌతిక తయారి[మార్చు]

భౌతిక తయారి అనగా అభ్యర్థి దుస్తులు, అలవాట్లు, నడవడిక, సభ్యత లాంటివి. ఒక వ్యక్తిని చూసినపుడు, అ వ్యక్తి ఎలాంటి వాడో, మనం అనాలోచితంగా అభిప్రాయం ఏర్పడుతుంది. దీనికి ఆ వ్యక్తి రూపు రేఖలు, దుస్తులు, నడవడిక ప్రధాన పాత్ర పోషిస్తాయి.

దుస్తులు

పురుషులు, స్త్రీలు హూందాతనంగా వుండే దుస్తులు ధరించాలి. అనగా పురుషులు పాంటు, షర్ట్, స్త్రీలు చీర,జాకెట్ లేక పంజాబీ డ్రస్సు వాడితే బాగుంటుంది. విద్యార్థులు కళాశాలలో సాధారణంగా వాడే టీ షర్టులు, స్కర్ట్లు వాటిని ఇంటర్వ్యూలకి వాడకూడదు. పాదరక్షలు విషయంలో బూట్లు, జోళ్లు వాడాలి. సూట్లు, టై వాడవచ్చు. ఇస్త్రీ చేసిన దుస్తులు వాడాలి.

వ్యక్తిగత అలవాట్లు

ఎబ్బెట్టుగా వుండే వ్యక్తిగత చర్యలను వదిలేయాలి. కొందరు మాట మాటకు మెడతిప్పటం, చేతులు తిప్పటం, భుజాలు ఎగరవేయటం,ఊరికే నవ్వటం చేస్తుంటారు. సన్నిహితులైన స్నేహితుల ద్వారా వాటిని తెలుసుకొని, వాటిని వదిలి వేయడానికి ప్రయత్నించాలి.

నడక

నడక హూందాగా వుండేటట్లు చూసుకోవాలి. సున్నితమైన నడక సాధారణంగా వ్యక్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది.

వ్యక్తిగత శుభ్రత

శరీర వాసనలు నియంత్రణలో వుంచటానికి మామూలుగా పౌడరు అవసరమైతే సుగంధాలు వాడాలి. తల దువ్వుకోవడం, గోళ్లు పెరిగినపుడు కత్తిరించుకోవడం చేయాలి. అతి ఎక్కువగా మేకప్ చేయకూడదు.eat only difest food beforre interview.

మానసిక తయారి[మార్చు]

ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించుకోవటమే మానసిక తయారి. రాత పరీక్ష వచ్చిన మార్కులని బట్టి న్యూనతా భావంగాని, అహంభావంగాని వుండకూడదు. సులభమైన ప్రశ్నలకు సంతోషంగా సమాధానాలు, కష్టమైన ప్రశ్నలకు దిగాలుగా మొహం పెట్టకూడదు. ప్రశ్న ఏదైనా ఆలోచించి, సమర్థతతో, మంచి భావ వ్యక్తీకరణతో, సృజనాత్మకశక్తితో జవాబులు చెప్పాలి. దీనికోసం మాదిరి ఇంటర్వూలకి హాజరై, లోపాలని తెలుసుకొని, వాటిని తొలగించుకోటానికి ప్రయత్నించాలి.

మేధోపర తయారి[మార్చు]

ఇది ఇంటర్వ్యూని బట్టి దానిలో అడగబోయే ప్రశ్నల విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవటం. ప్రజా సేవల ఇంటర్వ్యూలలో సాధారణ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి. దీనికి స్వగ్రామం, స్వంతం జిల్లా, స్వంత రాష్ట్రం, దేశం గురించి తెలుసుకోవాలి. ప్రస్తుత వార్తలలోని విషయాలగురించి అవగాహన పెంచుకోటానికి దిన పత్రికలు, వార పత్రికలు, దృశ్య శ్రవణ మాధ్యమాల్లో చర్చలు వినియోగించుకోవాలి. వీటిలోని ముఖ్యాంశాలను పుస్తకంలో రాసుకుంటే పునఃశ్ఛరణ చేసుకోటానికి సౌలభ్యంగా వుంటుంది.

అభ్యర్థనలో రాసిన సమాచారాన్ని బట్టి ఏ ప్రశ్నలు రావచ్చో ఊహించి సమాధానాలు రాసుకుంటే, ఇంటర్వ్యూలో ఆత్మస్థైర్యంతో గెలుపు సాధించవచ్చు.

మూలాలు[మార్చు]

  1. డాక్టర్ మునిరత్నం రెడ్డి (2010). "3 కోణాల నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్". ఉద్యోగ సోపానం. p. 558-573.