Jump to content

పాలిటెక్నిక్

వికీపీడియా నుండి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వరంగల్

పాలిటెక్నిక్ విద్యని డిప్లొమా స్థాయి సాంకేతిక విద్య అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర సాంకేతిక విద్యా బోర్డు [1] పర్యవేక్షిస్తుంది . ఈ కోర్సు కాలపరిమితి సాధారణంగా మూడేళ్ళు. రెండున్నరేళ్ళు అకడమిక్ కాలవ్యవధి పూర్తి కాగానే విద్యార్థి తప్పనిసరిగా పరిశ్రమలో పనిచేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు మొత్తం 229 కళాశాలలో ప్రవేశానికి 61120 సీట్లు ఉన్నాయి.[2] వీటిలో 100 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి.

ప్రత్యేకతలు

[మార్చు]
క్రమ సంఖ్య కోర్స్ కాలము ఉపాధి అవకాశాలు
1 సివిల్ ఇంజనీరింగ్ 3 సం నీటి పారుదల, ప్రజారోగ్యం, రోడ్లు, రైల్వే, భవనాలు, సర్వే, నీటి సరఫరా ..లాంటి రంగాలలో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు.గుత్తేదారు మరియ డ్రాఫ్ట్స్ మన్ గా స్వయం ఉపాధి.
2 ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ షిప్ 3 సం డిజైన్, డ్రాయింగ్ శాఖలలో ఉపాధి. పురపాలక సంఘాలలో లైసెన్స్ గల డిజైనర్ గా, డ్రాఫ్ట్స్ మన్ గా స్వయం ఉపాధి
3 మెకానికల్ ఇంజనీరింగ్ 3 సం ప్రభుత్వ కంపెనీలు, శాఖలలో, యంత్రాలు వర్క్ షాప్, ఉత్పత్తి సంస్ధలలో ఉపాధి. మెకానికల్ ఇంజనీరింగ్ అనుబంధ సంస్థల స్వయం ఉపాధి
4 ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 3 సం ఎపిఎస్ఆర్టిసి రవాణా శాఖలలో, ఆటోమొబైల్ కంపెనీ ప్రదర్శన కేంద్రాలలో, ఆటోమొబైల్ సర్వీసింగ్ స్వయం ఉపాధి
5 పాకేజింగ్ టెక్నాలజి 3 సం ఫార్మా, ఆహార, పానీయాల, కాగితం, ప్లాస్టిక్ పాకేజింగ్ పరిశ్రమలు
6 ఎలెక్ట్రికల్ మరియ ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 3 సం ఎపిజెన్కో, ఎపిట్రాన్స్కో, వారి గుత్తేదారుల సంస్థలు. ఎలెక్ట్రికల్ టెక్నీషియన్ గా స్వయం ఉపాధి.
7 ఎలెక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 3 సం ఆకాశవాణి, దూర దర్శన్, సమాచార, ఎలెక్ట్రానిక్స్ సంస్థలు. రేడియో, టీవి బాగుచేయటంలో స్వయం ఉపాధి.
8 అప్లైడ్ ఎలెక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 3 సం ఎలెక్ట్రానిక్స్, ప్రాసెస్ సంస్థలు.
9 ప్రత్యేక ఎలెక్ట్రానిక్స్ కోర్సులు. ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఎలెక్ట్రానిక్స్, టీవి, సౌండ్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ 3 .5 సం సంబంధిత కోర్సులలో చెప్పబడినట్లు
10 కంప్యూటర్ ఇంజనీరింగ్ 3 సం కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్టవేర్ అభివృద్ధి, శిక్షణ. కంప్యూటర్ అమ్మకం, రిపేర్ లో స్వయం ఉపాధి.
11 ఇన్ఫర్మేషన్ టెక్నాలజి 3 సం సాఫ్ట్ వేర్ అభివృద్ధి సంస్థలు
12 మైనింగ్ ఇంజనీరింగ్ 3 సం గనులు,
13 మెటలర్జికల్ ఇంజనీరింగ్ 3.5 సం ఫౌండ్రీ, ఫోర్జ్ షాప్, స్టీల్ ప్లాంట్, రోలింగ్ మిల్స్, హీట్ ట్రీట్మెంట్ షాప్, రక్షణ సంస్థలు
14 టెక్స్ టైల్ టెక్నాలజి 3.5 సం టెక్స్ టైల్ మిల్స్. వస్త్ర ఎగుమతి సంస్థలు
1 5 కెమికల్ ఇంజనీరింగ్ 3 లేక 3.5 సం పెట్రోకెమికల్స్, కెమికల్, కాగితం, ప్లాస్టిక్స్, ఆహారం సంస్కరణ పరిశ్రమలు
1 6 సెరామిక్ టెక్నాలజి 3.5 సం రిఫ్రాక్టరీ, బ్రిక్ కిల్న్, సిమెంట్, గాజు, సెరామిక్, శానిటరీవేర్ పరిశ్రమలు
1 7 లెదర్ టెక్నాలజి 3.5 సం తోలు, పాదరక్షల పరిశ్రమలు
1 8 ప్రింటింగ్ టెక్నాలజి 3 సం డిటిపి, ఫిల్మ్ తయారీ, ముద్రణ, పాకేజింగ్ అనుబంధ పరిశ్రమలు, స్వయం ఉపాధి
1 9 కంప్యూటర్స్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ 3 సం స్టెనో, కంప్యూటర్ ఆపరేటర్ (టైపిస్ట్) గా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్వయం ఉపాధి
20 ఫ్యాషన్ టెక్నాలజీ 2 సం వస్త్ర తయారీ, అమ్మకపు పరిశ్రమలలో, స్వయం ఉపాధి

ప్రవేశ పరీక్ష

[మార్చు]

సీప్ [2] (Common Entrance examination for Polytechnics -CEEP) అని పిలవబడే ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు ఎంపిక జరుగుతుంది. సాధారణంగా పదో తరగతి తరువాత పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరుతారు. అయితే కొన్ని కోర్సులకు ఇంటర్మీడియట్ విద్య లేక ఐటిఐ చేసిన విద్యార్థి చేరితే, ఏడాది ముందే వాళ్ళ కోర్సు పూర్తవుతుంది. ఎందుకంటే వారికి గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లను మినహాయిస్తారు.

సీట్ల కేటాయింపు

[మార్చు]

సీట్ల కేటాయింపు వెబ్ ఆధారంగా జరుగుతుంది. సహాయ కేంద్రాలలో నమోదు, సర్టిఫికేట్ల పరిశీలన తర్వాత ఎంపిక కోరికలు కంప్యూటర్ ద్వారా నమోదు చేస్తారు. దీని ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. షెడ్యూల్ కులాలు, జాతులు, వెనుకబడిన కులాలు, అల్ప సంఖ్యా క వర్గాలు ఇతర వర్గాలకి సీట్లని చట్టం ప్రకారం కేటాయిస్తారు. ప్రతి వర్గంలో మహిళలకి33.3 శాతం కేటాయింపువుంది.

వనరులు

[మార్చు]
  1. "రాష్ట్ర సాంకేతిక విద్యా బోర్డు". Archived from the original on 2011-09-02. Retrieved 2011-07-09.
  2. 2.0 2.1 సీప్-2010 సమాచారం, సూచనలు[permanent dead link]