రాష్ట్ర విద్యా సాంకేతికాల సంస్థ
Appearance
రాష్ట్ర విద్యా సాంకేతికాల సంస్థ (State Institute for Education Technology, (SIET) ) 1985లో ఉపగ్రహాధారిత దృశ్య శ్రవణ కార్యక్రామాల తయారీకొరకు ఏర్పడింది. ఇలాంటివి కేంద్రంలో ఒకటి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒకటి చొప్పున ఏర్పడినవి. కేంద్ర ప్రభుత్వం పూర్తి పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పడింది. 5 నుండి 14సంవత్సరాల వయస్సుగల బాలబాలికలకు తెలుగులో కార్యక్రమాలను రూపొందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. పాఠశాలవిద్యాశాఖ ద్వారా, పనితీరు మెరుగుపరచడం కోసం స్వతంత్ర ప్రతిపత్తిగల సొసైటీగా 1990 లో మార్చబడింది. కేంద్రప్రభుత్వం కార్యక్రమాల కొరకు ఖర్చులు భరిస్తుంటే ఉద్యోగుల జీత భత్యాలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది [1]
లక్ష్యాలు
[మార్చు]- విద్యా విధానాలు, కార్యక్రమాలు నియత, అనియత పద్ధతులలో అమలుపరచుటకు పాఠశాల విద్యా శాఖకు సహాయ పడుట
- పై లక్ష్యం కొరకు సరిపడే కార్యాలను చేయుట
మూలాలు
[మార్చు]- ↑ "రాష్ట్ర విద్యా సాంకేతికాల సంస్థ జాలస్థలి". Archived from the original on 2013-10-29. Retrieved 2013-12-26.